Maintaining kidney health is important to your overall health and general well-being. By keeping your kidneys healthy, your body will filter and expel waste properly and produce hormones to help your body function properly. Watch full video to know the best ways to keep your kidneys healthy.
ఈ వీడియోలో మన ఆర్గాన్స్‌లో అతి ముఖ్య భాగమైన కిడ్నీ వ్యవస్థ పనితీరును కొన్ని సహాజ పద్ధతుల్లో ఎలా మెరుగుపరుచుకోవచ్చు. కిడ్నీల్లోని హానికరమైన క్రిములను, విషపదార్థాలను నేచురల్ వేలో ఎలా తొలగించుకోవచ్చనే అంశాలను ఈ వీడియోలో ప్రస్తావించ బోతున్నాం. ఓకే ఇప్పుడు మెయిన్ టాపిక్‌లోకి వెళ్దాం.. ముందుగా అసలు కిడ్నీ functioning గురించి breef గా ఒకసారి తెలుసుకుందాం ముందుగా చెప్పినట్టుగానే కిడ్నీ వ్యవస్థ మన శరీర అవయవాల్లో అతి ముఖ్యమైన భాగం. మన రక్తంలో ఉండే విషపదార్థాలను, మలినాలను డయాలిసిస్ పద్ధతిలో యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తుంది. సో ఇపుడు మనం ఎనిమిది సహాజ పద్ధతుల్లో కిడ్నీ వ్యవస్థ పనితీరును ఎలా మెరుగుపరుచుకోవాలో one by one తెలుసుకుందాం. 1. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం.. వీలైనంతవరకు మీ శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మరి మన ఒంట్లో సరిపడా నీరు ఉందో లేదో తెలుసుకునేది ఎలా అంటారా ? యూరిన్ కండీషన్ ను చెక్ చేసుకోవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మామూలుగా సగటు ఆరోగ్యవంతమైన మనిషి రోజకు ఆరు గ్లాసుల మేర యూరిన్‌ను విసర్జిస్తాడు. ఒక వేళ మీరు అంతకంటే తక్కువ యూరిన్ ను రిలీజ్ చేస్తున్నట్లయితే ఎక్కువ వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. 2. తీసుకునే ఆహారంలో సోడియం శాతాన్ని అదుపులో ఉంచుకోవడం సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో సోడియం శాతం 1000 మిల్లీ గ్రామ్స్‌కు మించరాదు. దీనికి కారణం సోడియం శాతం అధికమైతే కాల్షియం ఉత్పత్తి అధికమై కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమౌతుంది. అలాగే అధిక రక్తపోటుకు గురై బ్లడ్ డయాలిసిస్ సిస్టమ్‌లో ఇబ్బందులొస్తాయి. కొన్నిసార్లు కిడ్నీల ఫెయుల్యూర్‌కు కారణం కూడా కావచ్చు. అందుకే సోడియం శాతం తక్కువగా ఉండే ఆహారపదార్థాలను మీ డైట్‌లో తీసుకుంటే మంచిది. 3. కిడ్నీ వ్యవస్థను మెరుగుపరిచే ఆహారం తీసుకుంటుండాలి: ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా తాజా ఆహారం తీసుకోండి . న్యూట్రైట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని Prefer చేయండి. రోజుకు ఒక ఆపిల్ తినడం అలవాటు చేసుకోండి. ఇంకా అరటిపళ్లు, దుంపలు, గ్రేప్స్ డైలీ డైట్‌లో తీసుకున్నట్లయితే మినరల్స్, విటమిన్స్, రక్తంలోని విషపదార్థాలను తొలగించే యాంటీ డిటాక్స్ మనకు లభిస్తాయి. అలాగే చేపలు తినడం ద్వారా ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ మన శరీరానికి అందుతాయి. తద్వారా కిడ్నీ వ్యాధుల బారిన పడుకుండా తప్పించుకోవచ్చు. 4. హెర్బల్ టీలు తాగుతుండండి హెర్బల్ టీ తీసుకోవడం ద్వారా మూత్రపిండ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే కిడ్నీలో రాళ్లను తొలగించే సామర్థం కూడా ఈ హెర్బల్ టీలో ఉంటుంది. *నెటెల్ లీఫ్ టీ * టెర్మరిక్ టీ *డెడ్‌లైన్ టీ వంటి హెర్బల్ టీలు ఈ తరహా పనిచేయడంలో ది బెస్ట్‌గా ఉంటాయి. 5. విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి: మరో పద్ధతిలో అవసరమైన సప్లిమెంట్స్, విటమిన్స్ తీసుకోవడం ద్వారా మూత్రపిండ వ్యవస్థ పనితీరు మెరుగ్గా అవుతుంది. * alpha lipoic acid * moringa * n- acetylcysteine * resveratrol * pro biotics * vitamin D .అయితే ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఓకే అనుకుంటే ఈ విటమిన్స్‌ను తీసుకోండి. 6. విటమిన్ బీ-6 తో ఎంతో లాభం.. మన లంగ్స్ పనిచేయడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో, కిడ్నీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి విటమిన్స్, నూట్రంట్స్ కూడా అంతే అవసరం. విటమిన్ బీ-6 పై చేసిన పరిశీలనల ప్రకారం ఇది కాల్షియం ఆక్సలేట్ అవడాన్నితగ్గించి కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది.. 7. అండ్రోగ్రాపిస్ * అలాగే అండ్రోగ్రాపిస్ తెలుగులో నేలవాము అని పిలుచుకునే హెర్బల్ ప్లాంట్ కిడ్నీ వ్యవస్త మెరుగ్గా పనిచేసేందుకు ఎంతో హెల్ప్ అతుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ హెర్బల్ మనం ఆల్కాహాల్ తాగినప్పుడు విడుదలయ్యే విషపదార్థాలను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే దీని శాస్త్రీయత కొంత డౌట్ ఉంది. 8. తీపి పదార్థాలకు దూరంగా ఉండటం * తయారుచేసిన తీపి పదార్థాలకు దూరంగా ఉండడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చనేది అందరికి తెలిసిందే.