Home Best of Health Top 5 Eye Doctors in Hyderabad| Eye Specialist In Hyderabad

Top 5 Eye Doctors in Hyderabad| Eye Specialist In Hyderabad

0
122
Top 5 Eye Doctors in Hyderabad | Best Ophthalmologists in Hyderabad | Eye Specialist In Hyderabad
Top 5 Eye Doctors in Hyderabad | Best Ophthalmologists in Hyderabad | Eye Specialist In Hyderabad


హైదరాబాద్‌లోని Top 5 OPhthalmologist (EYE doctors) వీరే..

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

ప్రస్తుతం 70 శాతం మనుషులు ఏదో ఒక కంటి సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. వాస్తవానికి కంటి సమస్యల్లో చాలా రకాలు ఉంటాయి. అదే విధంగా వాటికి చికిత్స చేసే కంటి వైద్యుల్లోనూ చాలా తేడా ఉంటుంది. ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. అయితే మనం ఎవరినీ సంప్రదించాలనే విషయం పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంటుంది. అన్ని కంటి సమస్యలకు ఆపరేషన్స్ అవసరం లేదు. కొన్ని సమస్యలు కళ్లద్దాలతో సమసిపోతే.. మరికొన్ని సమస్యలు మెడిసన్‌తో నయం అవుతాయి. ఇంకొన్ని సమస్యలకు మాత్రం తప్పకుండా కంటి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరి ఇంతకీ కంటి సమస్యలకు మన హైదరాబాద్ నగరంలో ఎవరినీ సంప్రదించాలో తెలుసా..?. హైదరాబాద్‌లో Top 5 OPhthalmologist(EYE doctors) ఎవరున్నారో మీకు తెలుసా..? అయితే ఈ వీడియో మీకోసమే. నగరంలో Top 5 OPhthalmologist (EYE doctors) వివరాలను మీ కోసం ఈ వీడియో రూపంలో సమగ్రంగా అందిస్తున్నాం. ఈ వీడియోను పూర్తిగా చూసి Top 5 OPhthalmologist (EYE doctors)ను సంప్రదించి మీ కంటి సమస్యలను పరిష్కరించుకుని మీ జీవితాల్లో వెలుగులు నింపుకోండి.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Dr. A. Saibaba Goud ఉన్నారు. హైదరాబాద్ నగరంలో Dr. A. Saibaba Goud 48 సంవత్సరాలుగా కంటి వైద్యం చేస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కొంపల్లిలోని సాయి జ్యోతి ఐ ఇనిస్టిట్యూటల్‌లో పనిచేస్తున్నారు. గాంధీ మెడికల్ కాలేజీ నుంచి 1971లో ఎంబీబీఎస్, 1975లో ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంఎస్ ఆప్తాల్మాలజీ, 1988లో ఓయూ మెడికల్ కాలేజీ నుంచి ఆప్తమాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆలిండియా ఆప్తాల్మాలాజికల్ సొసైటీ సభ్యులుగా ఉన్నారు. Dr. A. Saibaba Goud కంటి రెప్పల శస్త్రచికిత్స, కెనలోప్లాస్టీ, ఓక్యులోప్లాస్టిక్ సర్జరీ, విట్రొరెటినల్ సర్జరీలు చేయడంలో మంచి నైపుణ్యం సంపాదించారు. Dr. A. Saibaba Goud ఎన్నో అవార్డులను అందుకున్నారు. అందులో ప్రధానంగా మెడిసిన్‌లో పద్మశ్రీ, ఆప్తాల్మాలజీ విభాగంలో డాక్టర్ కెఆర్ దత్తు అవార్డు, దిష్టి ప్రధాత అవార్డు, రాష్ట్రీయ గౌరవ్ అవార్డు, ఆలిండియా ఆప్తాల్మాలాజికల్ సొసైటీ నుంచి జేఎస్ మహాసభ అవార్డులను సైతం అందుకున్నారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.400 తీసుకుంటారు.

Address:

SAI JYOTHI EYE HOSPITAL

Plot Number 185, Road Number 1,

Landmark: Next to Kennedy School,

Secunderabad, Hyderabad.

Contact Number: 94942 90777

ఇకపోతే Top 4 ప్లేస్‌లో Dr. SATISH GUPTA ఉన్నారు. ఈయనకు ఆప్తమాలజిస్టుగా 46 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. 1967లో న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1971లో ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌స్ నుంచి ఎండీ ఆప్తమాలజీ కంప్లీట్ చేశారు. ఢిల్లీ ఆప్తమాలాజికల్ సొసైటీతో పాటు ఢిల్లీ మెడికల్ అసోసియేషన్‌లోనూ సభ్యుడిగా ఉన్నారు. Dr. SATISH GUPTA రెటీనా ఎగ్జామినేషన్, లాసిక్ ఐ సర్జరీ, ఓక్యులర్ టాక్సోప్లాస్మోసిస్, ఇరిడాలజీ, ఐబ్రో డిజైన్ తదితర చికిత్సలు అందించడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఏపీ ఆప్తమాలాజికల్ సొసైటీ నుంచి 1993లో సూర్యప్రసాదరావు గోల్డ్ మెడల్, 1994లో ఆర్పీ ధండ అవార్డు, 1981లో ఈ సలామ్ టాన్జానియా యూనివర్సిటీ నుంచి ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ అవార్డులను సాధించారు. ఈయన ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2.30 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజు రూ.200 తీసుకుంటారు.

Address:

Win Vision Eye Hospitals

6-3-868/2, Greenlands.

Landmark : Beside Telangana Tourism Plaza Begumpet, Hyderabad 500016.

Contact Number:040 2340 8888

ఇకపోతే Top 3 ప్లేస్‌లో Dr.Ravi Prasad Challa ఉన్నారు. ఈయనకు అప్తమాలజీ రంగంలో 26 సంవత్సరాల అనుభవం ఉంది. 1989లో బళ్లారి ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1993లో బెంగళూరులో మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎంఎస్ ఆప్తమాలజీ పూర్తిచేశారు. 1993 మార్చి నుంచి హైదరాబాద్‌లోని చల్లా ఐ కేర్ సెంటరులో ఇప్పటివరకు పనిచేస్తున్నారు. Dr.Ravi Prasad Challa మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆలిండియా ఆప్తమాలజీ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర ఆప్తమాలజీ అసోసియేషన్, హైదరాబాద్ ఆప్తమాలజిస్టు అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈయన ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజు రూ.300 వసూలు చేస్తారు.

Address:

Lane Beside Mugdha Art Studio,

Road No.2, Sagar Society,

Banjara Hills, Hyderabad,

Telangana 500034

Contact Number: 9849204178

ఇకపోతే Top 2 ప్లేస్‌లో Dr.Kasu Prasad Reddy ఉన్నారు. కంటి వైద్యం అందించడంలో  Dr Kasu Prasad Reddyకి 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఈయన లేజర్ విధానంలో కంటి ఆపరేషన్స్ చేయడంల ప్రపంచ ప్రఖ్యాత గుర్తింపు పొందారు. Dr Kasu Prasad Reddy అమెరికన్ యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ ఆప్తాల్మిక్ సర్జరీలో సభ్యత్వం పొందిన ఏకైక భారతీయ సభ్యుడిగా అరుదైన గుర్తింపు పొందారు. ఇప్పటివరకు దాదాపు 45వేలకు పైగా లేజర్ ఆపరేషన్స్ చేసి రికార్డు సృష్టించారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ కోసం అధికారిక మెడికల్ ఎగ్జామినర్‌గా నియమితులైన మొదటి భారతీయ వ్యక్తిగానూ Dr Kasu Prasad Reddy రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలోనే మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడిగాను ఈయన ఉన్నారు. ఈయన గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి 1974లో ఎంబీబీఎస్, అనంతరం 1978లో మద్రాస్‌లోని డాక్టర్ రెడ్డి స్టాన్లీ మెడికల్ కాలేజీ నుంచి జనరల్ సర్జరీలో ఎంఎస్ పూర్తి చేశారు. 1978లో యూకెకు వెళ్లి నాలుగు సంవత్సరాల పాటు ఆర్థోపెడిక్స్, యాక్సిడెంట్స్, ఎమర్జెన్సీ విభాగంలో నైపుణ్యత సాధించారు. ఏడాది పాటు న్యూరోసర్జరీ చేసిన తర్వాత 1983లో డోన్‌కాస్టర్ రాయల్ హాస్పటిల్ నుంచి ఆప్తమాలజీ స్పెషాలిటీని తీసుకున్నారు. 1985లో డబ్లిన్ నుంచి డీఓ, 1986లో లండన్ నుంచి ఆప్తమాలజీ కంప్లీట్  చేశారు. Dr Kasu Prasad Reddy గ్లకోమా, లేజర్ సర్జరీ, లాసిక్, క్యాటరాక్ట్ ట్రీట్‌మెంట్‌ చేయడంలో మంచి ఎక్స్‌పర్ట్‌గా గుర్తింపు పొందారు. Dr Kasu Prasad Reddy ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, ఆదివారం మాత్రమే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు అందుబాటులో ఉంటారు.

Address:

6-3-903/a 1,

Raj Bhavan Road,

opp. Yashoda Hospital,

Somajiguda, Hyderabad,

Telangana 500082

Contact Number: 040 4485 5577

ఇకపోతే Top 1 ప్లేస్‌లో Gullapalli Nageswara Rao ఉన్నారు. ఈయనకు కంటి వైద్యం చేయడంలో సుదీర్ఘ అనుభవం ఉంది. Gullapalli Nageswara Rao గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో కంటి సమస్యలకు సంబంధించి ప్రత్యేక కోర్సు పూర్తి చేశారు. 1974లో ఉన్నత విద్య కోసం అమెరికాలోని బోస్టన్ వెళ్లారు. 1986 వరకు రోచస్టర్ యూనివర్సిటీలో డాక్టర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఎల్వీ ప్రసాద్ కుమారుడు రమేశ్ ప్రసాద్ ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో ‘ఎల్వీ ప్రసాద్’ ఐ హాస్పిటల్ స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు.  Gullapalli Nageswara Rao కంటికి సంబంధించిన వ్యాధులపై 250 పరిశోధన వ్యాసాలు రాశారు. ఈయన 2.50 లక్షల కంటి ఆపరేషన్స్ చేశారు. అంతేకాదు అంతర్జాతీయ అంధత్వ నిరోధక సంస్థకు అధ్యక్షుడిగానూ పనిచేస్తున్నారు. అంధత్వ నివారణకు Gullapalli Nageswara Rao చేసిన సేవలకు ఎన్నో పురస్కారాలు అందాయి. పలు యూనివర్సిటీలు డాక్టరేట్లు సైతం ఇచ్చాయి. 1983లో అమెరికా కంటివైద్య శాస్త్ర అకాడమీ పురస్కారాన్ని, 1996లో భారత జాతీయ వైద్యశాస్త్ర అకాడమీ ఫెలోషిప్, 2002లో భారత ప్రభుత్వం నుంచి పద్మ శ్రీ పురస్కారం, 2006లో అమెరికా కంటి వైద్యశాస్త్ర అకాడమీ నుంచి ప్రపంచ అంధత్వ నిరోధక పురస్కారాన్ని అందుకున్నారు.

Address:

Chair, LV Prasad Eye Institute,

LV Prasad Marg, Banjara Hills

Hyderabad 500 034.

Contact Number:(040) 3061 2609

ఓకే ఫ్రెండ్స్ చూశారుగా.. హైదరాబాద్‌లోని Top 5 OPhthalmologist (EYE doctors) ఏవరో చూశారుగా.. మరెందుకు ఆలస్యం. మీ కంటి సమస్య ఏదైనా సరే.. హైదరాబాద్‌లోని Top 5 OPhthalmologist (EYE doctors)ను సంప్రదించి మీ సమస్యలను పరిష్కరించుకోండి.  మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.. షేర్ చేయండి. మా ఆదాన్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిగ్నల్‌ను నొక్కండి. ఎప్పటికప్పుడు మేం చేసే లెటెస్ట్ అప్‌డెట్స్ నోటిఫికేషన్ రూపంలో పొందండి. థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్.

Leave your vote

More

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings

close

Log In

Forgot password?

Forgot password?

Enter your account data and we will send you a link to reset your password.

Your password reset link appears to be invalid or expired.

Log in

Privacy Policy

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.