Peripheral neuropathy(Thimmirlu) refers to the conditions that result when nerves that carry messages to and from the brain and spinal cord from and to the rest of the body are damaged or diseased. The peripheral nerves make up an intricate network that connects the brain and spinal cord to the muscles, skin, and internal organs.
హాయ్ వ్యూవర్స్ ఈ రోజు వీడియోలో మనలో చాలామంది ఫేస్ చేసే కాళ్లు, చేతుల తిమ్మిర్లు రావడం, అలా వచ్చినప్పుడు ఏర్పడే ప్రమాదాలు, అలాగే వాటిని సాధారణ పద్దతుల్లో ఎలా కంట్రోల్ చెయ్యొచ్చో తెలుసుకుందాం.
అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరివరకు చూడండి. అప్పుడే మీకు ఈ information మొత్తం క్లియర్‌గా అర్థమౌతుంది..
ముందుగా ఈ తిమ్మిర్లు రావాడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం..
కాళ్లకు, చేతులకు తిమ్మిర్లు రావాడాన్ని ఫెరిపరల్ న్యూరోపతి అంటారు.
మనం పనిచేస్తున్నప్పుడో, నడుస్తున్నప్పుడో లేదా పడుకున్నప్పుడో ఈ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి.
అప్పుడు తిమ్మిర్లు వచ్చిన ప్రాంతం బాగా మంటగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మంట వల్ల రాత్రిపూట పడుకున్నప్పుడు సరిగా నిద్ర కూడా పట్టదు.
ఇక నిద్రలేమి కలిగే సమస్యలేంటో మనందరికి తెలుసు. ఏ పని మీద సరిగా ధ్యాస పెట్టలేం. పగలంతా బద్దకంగా ఉన్నట్టు అన్పిస్తుంది.
మనం చాలా సేపు కాళ్లు చాపడం, ఎక్కువసేపు కూర్చోడం లేదా మోకరిల్లడం, కాళ్ల మీద కూర్చుని షూ లేదా సాక్సులు వేస్కోవడం వల్ల వెన్నెముక, మొండెం, కాళ్లు, చీలమండలు నరాలపై ఒత్తిడి పెరిగి కాళ్లు మొద్దుబారినట్టు అన్పిస్తుంటుంది.
చాలామంది ఈ సమస్యను experience అయ్యే ఉంటారు కదా.
ఎవరిలో వస్తాయి..లక్షణాలేంటి
ఎక్కువగా 40 ఏళ్ల పైబడిన వారిలో ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొటుంటారు.
అలాగే డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ తిమ్మిర్లు ఎక్కువ బాధిస్తాయి.
డయాబెటిక్ న్యూరోపతి అని పిలిచే ఒక రకమైన నష్టాన్ని అనుభవిస్తుంటారు.
దీని వల్ల తిమ్మిరి, జలదరింపు, పాదాలలో నొప్పి వస్తుంది.
ఒకవేళ వారు డయాబెటిస్‌ను కంట్రోల్‌లో పెట్టుకోకపోతే ఒక 5 to 6 years లో పాదాలు బాగా మంట వస్తాయి.
అలాగే వేడినీరు, చల్లనీరు మధ్య తేడాను స్పర్శ ద్వారా తెలుసుకోలేరు. చెప్పులు వేస్కుని నడుస్తున్నప్పటికి ఆ అనుభూతిని పొందలేం. తరచూ జారిపోతుంటాయి.
పట్టు కోల్పోతారు. ఇలా పాదాలతో మొదలైన తిమ్మిర్లు మెల్లగా చేతుల నరాలకు వరకు చేరుకుంటాయి.
అలాగే ఆల్కాహాలు అతిగా తీసుకుంటూ సరైన డైట్ పాటించరో వాళ్లలో కూడా ఈ లక్షణాలు త్వరగా కన్పిస్తాయ్.
అలాగే కొంత మంది యూత్ డైట్ ప్లాన్ అంటూ తరచూ ఆహారపు అలవాట్లు మారుస్తుంటారు.
వాళ్లలో కూడా ఈ తిమ్మిర్లు సమస్య వస్తుంటుంది. క్యాన్సర్‌తో బాధపడేవారు కూడా ఈ ఫెరిఫరల్ న్యూరోపతి సమస్యను ఎదుర్కుంటుంటారు.
ఎందుకంటే క్యాన్సర్ నిమిత్తం ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకుంటుంటారు కాబట్టి.
తిమ్మిర్లు బారిన పడుకుండా ఉండాలంటే ఏం చేయాలి..
తిమ్మిర్లు రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందుగా చేయాల్సింది సరైన డైట్ పాటించడం.
సరైన పోషకాహార పాళ్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేస్తే ఒక 50 శాతం వరకు తిమ్మిర్లు రాకుండా కంట్రోల్ చెయ్యొచ్చు.
ముఖ్యంగా డయాబెటిక్ పేషేంట్స్ ఈ డైట్ ను ఒక క్రమపద్ధతిలో పాటించాలి. దీనివల్ల షుగర్ కంట్రోల్‌లోకి వస్తుంది.
అలాగే ప్రతిరోజూ మన శరీరానికి తగినంత వ్యాయామం చేస్తే అది నరాలపై ప్రభావం చూపించి తిమ్మిర్లు రాకుండా కంట్రోల్ చేస్తుంది.
అలాగే పాదాలకు, కాళ్లకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు బాగా చేయండి.
ఒకే వ్యూవర్స్ చూశారు కదా…తిమ్మిర్లకు గల కారణాలు అలాగే వాటిని కంట్రోల్ చేసే విధానాలు. సో మీరంతా సరైన పోషాకాహారం, విటమిన్స్ తీసుకుని ఈ తిమ్మిర్లు బారిన పడుకుండా జాగ్రత్త పడండి.
అలాగే షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ లో ఉండేలా డైట్ పాటించండి.
ఎందుకంటే ఈ తిమ్మిర్లు సమస్య చాలా ప్రమాదకరం . సడెన్‌గా మనం ఎటూ కదలలేని స్థితిలోకి చేరుకునేలా చేస్తాయి.
సో బీ కేర్ ఫుల్. ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీకు డౌట్స్ ఉన్న ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చెయ్యండి.
అలాగే కొత్తవారెవరైనా మన ఛానల్‌ను చూస్తునట్లయితే వెంటనే సబ్‌స్క్రైబ్ చేస్కోండి.
GIPHY App Key not set. Please check settings