How to Make Your Hair Grow Faster in Natural Way?. Many of you thinking about this. If you’re trying to regrow hair that you’ve lost or would simply like to improve the hair that you have, try these natural remedies. Their proven benefits can help to stimulate growth and enhance the hair that you have.
ఇప్పుడు ఎదుర్కొంటున్న beauty సమస్యలలో అతి ముఖ్యమైనది హెయిర్ లాస్, అలాగే వెంట్రుకలు తెల్లబడటం. మనకు అందుబాటులో ఉండే మెంతులతో ఇలాంటి సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టొచ్చని విషయం మీకు తెలుసా. మరి ఈ వీడియోలో మెంతులు ని అనేక రకాల ఉపయోగించుకుని మన జుట్టు ని ఎలా కాపాడుకోవాలో, అలాగే ఆరోగ్యపరంగా, చర్మ సౌందర్యానికి మెంతులు ఎంత ఉపయోగకరము క్లుప్తంగా వివరించి బోతున్న. అందుకే స్కిప్ చేయకుండాఈ వీడియో మొత్తం చూసేయండి. కావాల్సిన వస్తువులు *ఒక గ్లాస్ వాటర్ *ఒక బౌల్ మెంతులు *కరివేపాకు * నాన్‌స్టిక్ పాన్ * డబుల్ ఫిల్టరైజ్‌డ్ కొబ్బరి నూనే * ఖాళీ స్ర్పే బాటిల్ * నిమ్మరసం * ఒక కప్పు పెరుగు ముందుగా మెంతులను ఉపయోగించి ఒక హెయిర్ సిరం లాంటిది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక రెండు స్పూన్ల మెంతులు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ లో ఒక రాత్రంతా నానబెట్టాలి. రెండో రోజు ఉదయం ఆ మెంతుల్ని వడగట్టి ఆ నీటిని తాగితే ఆహారం అరుగుదల సరిగా లేనివారు , అలాగే డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలాగే రక్తం శుద్ధి కూడా అవుతుంది. సాధారణంగా ఆడవారిలో కనిపించే హార్మోనల్ imbalance కూడా సరవుతుంది. 2.ఇప్పుడు హెల్త్ కు సంబంధించిన సిరం విషయానికొస్తే ఒక empty స్ప్రే బాటిల్ తీసుకొని అందులో ఈ వాటర్ ను నింపుకోవాలి. ఇప్పుడు స్ప్రే బాటిల్ సహాయంతో ఆ వాటర్ ని జుట్టు కుదుళ్ళలో స్ప్రే చేసుకోవాలి. తరువాత ఒక పది నిమిషాలు ఆగాక ఆ హెయిర్ ని దువ్వు కోవాలి. ఇలా చేయడం వలన కొన్నాళ్లకు మన జుట్టు పెరుగుదల కనిపిస్తుంది. 3. ఇప్పుడు హెయిర్ కోసం మెంతులను ఉపయోగించి ఒక హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మెంతులను అలాగే కరివేపాకును ఒక బౌల్లో తీసుకొని వాటిలోని తేమ పోయేలాగా వేయించాలి. ఆ కాంబినేషన్ ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు మన జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే వెంట్రుకలు బాగా బలంగా తయారవుతాయి. ఇప్పుడు మెంతులు కరివేపాకు కలిసిన పౌడర్ని బాగా ఫిల్టర్ చేసిన కొబ్బరి నూనెలో కలపాలి. ఇప్పుడు సన్నని సెగపై ఆ మిశ్రమాన్ని వేడి చేయాలి. దీనివల్ల ఆ పౌడర్ లో ఉండే ఔషధ గుణాలు కొబ్బరినూనెలో మిక్స్ అవుతాయి. వేడి అయిన ఆ మిశ్రమాన్ని చల్లార్చి వడగట్టుకోవాలి. ఈ ఆయిల్ ని జుట్టు కుదుళ్ల లో పోనిచ్చి సర్కులర్ మోషన్ లో మసాజ్ చేసుకోవాలి. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడ మే కాకుండా తెల్ల జుట్టు రాకుండా నియంత్రించ గలుగుతుంది. అలాగే మన జుట్టు పట్టులా మెరుస్తుంది. 4.ఇప్పుడు నానబెట్టిన మెంతులు తో ఒక హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పెరుగు, నిమ్మరసాన్ని ఈ మెంతులతో కలిపి ఒక చక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల లోపల దాకా పోనిచ్చి ఒక పదిహేను నిమిషాలపాటు అలానే వుంచుకోవాలి. అలాగే ఆడవారికైతే మిగిలిన హెయిర్ కీ కూడా ఈ ఈ పేస్ట్ని అప్లై చేయండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు గడిచాక హెయిర్ ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోండి. కాసేపయ్యాక షాంపూతో తల స్నానం చేయండి . ఇలా చేయడం వల్ల మీ హెయిర్ కి ఒక కండిషనర్ అప్లై చేసిన స్వభావం వస్తుంది. ఇలా మెంతుల్ని అనేక రకాలుగా ఉపయోగించుకుని మన ఆరోగ్య సమస్యలను అలాగే జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు.