హైదరాబాద్‌లో Top 10 Resorts ఇవే..
Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.
ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో క్షణం తీరిక లేకుండా పోయింది. నిత్యం ఉరుకుల పరుగుల జీవితమే. ఆఫీసు వర్కింగ్ టైమ్‌లోనే కాకుండా ఇంట్లో ఉన్న సమయంలోనూ కుటుంబ సభ్యులతో పట్టుమని పది నిమిషాలు హ్యాపీగా గడిపే పరిస్థితులు లేకుండా కాలం మారింది. స్మార్ట్ ఫోన్ మనిషికి ఎంత చెరువ అయ్యిందో అంతకు వంద రేట్లు కుటుంబాలతో గడిపే కాలం హరించుకుపోయిందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులను అధిగమించి కుటుంబాలను గడిపేందుకు రోటీన్ జీవితానికి భిన్నంగా టూర్‌లకు వెళుతుండేవారు. గతంలో గోవా, బెంగళూరు తదితర ప్రాంతాల్లోని రిసార్ట్స్‌కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే అత్యాద్భుతమైన రిసార్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. వారమంతా బిజీ లైఫ్ గడిపే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారస్తులు వీకెండ్‌లో తమ ఫ్యామిలీస్‌తో గడిపేందుకు రిసార్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. కొత్తగా పెళ్లి అయిన జంటలు, యువత సైతం రిసార్ట్స్‌లో రిలాక్స్ అవుతున్నారు. అలాంటి రిసార్ట్స్ కోసం ఎక్కడికో వెళ్లకుండా మన హైదరాబాద్ నగరంలో Top 10 Resorts ఏమున్నాయి..? వాటిని ఏలా సంప్రదించాలి.? అవి ఏయే సమయాల్లో అందుబాటులో ఉంటాయి..? తదితర వివరాలు తెలుసుకోవడం ఏలాగో అర్థం కావట్లేదా. అయితే ఈ వీడియో మీ కోసమే. హైదరాబాద్‌లోని Top 10 Resorts వివరాలను మీ కోసం ఈ వీడియో రూపంలో సమగ్రంగా అందిస్తున్నాం. ఈ వీడియోను పూర్తిగా చూసి Top 10 Resortsలో మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి మధురానుభూతులను సొంతం చేసుకోండి.
ఇకపోతే Top 10 ప్లేస్‌లో Button Eyes Resort ఉంది. రోజువారీ బిజీ లైఫ్ నుంచి రెస్ట్ తీసుకోవాలనుకునేవారికి Button Eyes Resort మంచి వేదికని చెప్పొచ్చు. ఈ రిసార్ట్స్‌కు వచ్చిన వారికి మంచి అనుభూతులను మిగుల్చుతుంది. ఇక్కడ బ్యాచిలర్ పార్టీలకు ఫేమస్. హైదరాబాద్ నగరంలోని ఎక్కవ మంది జంటలు ఈ రిసార్ట్స్‌లోకి వస్తుంటారు. Button Eyes Resortలో క్రిస్టల్ క్లియర్ స్విమ్మింగ్ పూల్, చిన్న తోటలు, దట్టమైన పచ్చిక బయళ్లతో రిసార్ట్స్ పరిసరాలన్నీ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. Button Eyes Resortలో విలాసవంతమైన గదులు, సూట్ రూమ్‌లు, విల్లాలు, కాటేజీలతో ఉన్నతస్థాయి వసతి సౌకర్యాలు వినియోగించుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్‌లో గడపడం.. ప్రభాత సూర్యుడి అందాలను వీక్షించడం.. ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ వివాహ కార్యక్రమాలతో పాటు వ్యాపార సమావేశాలను నిర్వహించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. Button Eyes Resortలో గడిపిన ప్రతిఒక్కరూ మరిచిపోలేని మధురానుభూతులతో ఇంటికి తిరిగి వెళ్లడం ఖాయం. ఈ రిసార్ట్‌లో స్విమ్మింగ్ పూల్, బార్, ఫ్రీ పార్కింగ్, రూమ్ సర్వీస్, కాఫీ షాప్, ఇండోర్ గేమ్స్, హాకీ, టేబుల్ టెన్నిస్, స్నూకర్ తదితర ఆటలతో ఉల్లాసంగా గడపొచ్చు. ప్రైవేటు స్విమ్మింగ్ పూల్‌తో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కాటేజీ సైతం అందుబాటులో ఉంది. Button Eyes Resortను చేరుకోవాలంటే.. హైటెక్ సిటీ నుంచి 34 కిలోమీటర్లు, ఏయిర్ పోర్టు నుంచి 38 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక్క రాత్రికి రూ.3500 ఛార్జీ చేస్తారు.
Location:
Moinabad Tehsil,
RangaReddy District,
Tolkatta, Telangana
Contact Number:090105 70780
ఇకపోతే Top 9 ప్లేస్‌లో Lahari Resort ఉంది. Lahari Resort హైదరాబాద్ రిసార్ట్స్‌లోని ఉత్తమ రిసార్ట్స్‌లో ఒకటి. ఇది ప్రకృతి అందాల మధ్య విశాలమైన ప్రశాంత వాతావరణంలో ఉంది. ఇందులో హాలీడేస్‌ను ఎంజాయ్ చేసేందుకు అన్ని వయస్సుల వారికి ప్రత్యేక వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు సాహస క్రీడలను సైతం పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తారు. Lahari Resortను పటాన్‌చెరు సమీపంలోని భానూర్‌లో 2006లో ఏర్పాటు చేశారు. కొత్తగా పెళ్లయిన జంటలు, కుటుంబ సభ్యులు, కార్పొరేట్ విహార యాత్రికులకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది. రిసార్ట్స్ సందర్శకుల కోసం మంచి ఆహారం అందుబాటులో ఉంచుతారు. వివాహాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు 1500 మందికి సరిపడా సమావేశ మందిరం ఈ రిసార్ట్‌లో ఉంది. Lahari Resortలో వసతి కోసం డీలక్స్ సూట్, క్వీన్ సూట్, కింగ్స్ సూట్, ప్రెసిడెంట్ సూట్, రాయల్ సూట్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి ధరలు ప్యాకేజీని బట్టి ఒక్కో విధంగా ఉంటాయి. Lahari Resortను చేరుకోవాలంటే హైటెక్ సిటీ నుంచి 17 కిలోమీటర్లు, ఎయిర్ పోర్టు నుంచి 26కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక్క రాత్రికి రూ.6700 ఛార్జీ చేస్తారు.
Adress:
Bhanoor,
Near Patancheru,
Hyderabad,
Telangana 502305.
Contact Number: 040 4142 6666
ఇకపోతే Top 8 ప్లేస్‌లో Celebrity Resort ఉంది. Celebrity Resort 20 సంవత్సరాలకు పైగా అతిథ్య పరిశ్రమలో తన అసమాన సేవలను అందిస్తోంది. ఈ రిసార్ట్‌లో 70 గదులతో పాటు సూట్లు, విల్లాలో వసతి కల్పిస్తారు. రూముల్లో మినీ ఫ్రిడ్జ్, డైరెక్ట్ డయల్ ఫోన్, టీవీ, అటాచ్డ్ బాత్‌రూమ్ ఫెసిలిటీ ఉన్నాయి. రెస్టారెంట్, బార్ సౌకర్యంతో పాటు కాన్ఫరెన్స్ హాల్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నగరం నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండానే వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ రిసార్ట్ మంచి ఎంపిక. ఇది కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం రూపొందించిన అద్భుతమైన గేట్ వే. బడ్జెట్‌కు అనుగుణంగా సూట్ రూమ్స్, లగ్జరీ రూమ్స్, విల్లాలను బట్టి ప్యాకేజీ ధరలు ఉంటాయి. స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్‌తో పాటు డ్యాన్స్ చేసేందుకు డ్యాన్స్ ఫ్లోర్, టెలివిజన్ లాంజ్ ఉండడం ఇక్కడి ప్రత్యేకత. Celebrity Resortను చేరుకోవాలంటే.. హైటెక్ సిటీ నుంచి 41 కిలోమీటర్లు, ఎయిర్ పోర్టు నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక్క రాత్రికి రూ.2800 ఛార్జ్ చేస్తారు.
Adress:
Survey No.1222,
ORR Circle, Karimnagar Highway Shamirpet,
Medchal, Hyderabad,
Telangana 500101
Contact Number: 9949736035
ఇకపోతే Top 7 ప్లేస్‌లో Pragati Resorts ఉంది. Pragati Resorts దేశంలోనే ప్రత్యేకతను సంపాదించుకుంది. ఒకప్పుడు కేవలం బంజరు భూమిగా ఈ ప్రాంతాన్ని మానవ నిర్మిత పర్యావరణ గ్రామంగా తీర్చిదిద్దారు. ఈ రిసార్ట్ పూర్తిగా గ్రీనరీతో నిండి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. 2500 ఎకరాల విస్తీర్ణంలో ఏలాంటి రసాయనాలు వినియోగించకుండా అద్భుతమైన గ్రీన్ బెల్ట్ ను సృష్టించారు. హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు ఇక్కడికి వచ్చేవారికి ఎన్నో మధురానుభూతులు మిగిలేలా ఈ ట్రిప్ ఉపయోగపడుతుంది. రిసార్ట్ మొత్తం అడుగడుగునా అందమైన శిల్పాలు, పక్షుల కిలకిలరావాలు, ఫౌంటెన్లతో కొత్త ప్రపంచంలో విహరించిన అనుభూతిని పొందొచ్చు. ఈ రిసార్ట్ ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన చిలుకూరు బాలాజీ టెంపుల్ కు అతి సమపంలో ఉంటుంది. ప్రైవేటు టాక్సీలు, పుష్పక్ బస్సుతో పాటు స్థానికంగా ఉండే ఆటోల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. Pragati Resortsను చేరుకోవాలంటే హైటెక్ సిటీ నుంచి 34 కిలోమీటర్లు, ఎయిర్ పోర్టు నుంచి 40 కిలోమీటర్ల దూరం నుంచి చేరుకోవచ్చు. ఈ రిసార్ట్ లో గడిపేందుకు ఒక్కరోజు రూ.3700 ఛార్జ్ చేస్తారు.
Adress:
Proddutur Village,
Chilukuru Balaji Temple Road,
Shankarpally Mandal,
Ranga Reddy District,
Hyderabad, Telangana 501203
Contact Number:9848910056
ఇకపోతే Top 6 ప్లేస్‌లో Mrugavani Resort & Spa ఉంది. Mrugavani Resort & Spa హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉంది. ఇది పర్యావరణ పర్యాటక ప్రదేశంగా మంచి గుర్తింపు పొందింది. పర్యాటకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వాస్తవానికి మృగవాణి రిసార్ట్ మరియు స్పా అనేది పర్యావరణ మరియు పర్యాటక ప్రాజెక్ట్. ఇది ప్రకృతి మరియు ఆధునికత మిశ్రమం. ఇది 1006 ఎకరాలలో విస్తరించి ఉన్న మృగవాణి నేషనల్ పార్క్‌లో అంతర్భాగం. ఈ గ్రీన్ రిసార్ట్ IT హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ మరియు ఇతర చారిత్రక మరియు టూరిస్ట్ స్పాట్‌లకు సమీపంలో ఉంది. ఇది నగరం నడిబొడ్డు నుండి 18 కి.మీ దూరంలో ఉంది. అంతేకాకుండా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 15 నిమిషాల డ్రైవింగ్‌లో చేరుకోవొచ్చు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌తో పర్యావరణ పర్యాటక రంగంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో Mrugavani Resort & Spa ఏర్పడింది.
Mrugavani Resort & Spa ప్రత్యేకతలు ఇవే..
Class: 3-Star Resort
Location:
National Deer Park,
Chilkur Balaji Temple Rd,
Opp. Mrugavani,
Aziz Nagar, Hyderabad
Price: 2500 per night
Distance: 17 km from Hi-Tec City, 20 km from the airport
Activities/Attractions: Horse riding, Tennis Court, Volleyball, Swimming Pool, Indoor/Outdoor games and many more.
Private Swimming Pool: Yes, Semi-private pool in Lagoon cottage.
ఇకపోతే Top 5 ప్లేస్‌లో Palm Exotica ఉంది. శంకర్‌పల్లి హైలైండ్స్‌లో ఏర్పాటు చేసిన పామ్ ఎక్సోటికా బోటిక్ రిసార్ట్ & స్పా పర్యావరణ అనుకూలమైన విలాసవంతమైన హాలిడే రిసార్ట్. ఇది అద్భుతమైన దృశ్యాలు, అసమానమైన వసతి ఎంపిక, భోజన అనుభవాలు, వినోద కార్యకలాపాలు, థీమ్ పార్క్, స్పా & బాంకెట్‌లతో మిమ్మల్ని ఆకట్టుకునేలా రూపొందించబడింది. కుటుంబ సభ్యులతో విహారం, కొత్త జంటలకు హనీమూన్, కార్పొరేట్ కంపెనీలు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా అద్భుతంగా ఈ రిసార్ట్ ను తీర్చిదిద్దారు. ఈ రిసార్ట్‌లో ఒక్క రోజుకు రూ.5900 దగ్గరి నుంచి రూ.25వేల వరకు ఛార్జ్ చేస్తారు. అయితే ఒక్కో ప్యాకేజీలో ధర ఒక్కో విధంగా ఉంటుంది.
Adress:
PALM EXOTICA
Sy.No.125, MASANIGUDA VILLAGE
SHANKARPALLI, RANGA REDDY DIST.
HYDERABAD – 501203
Contact Number: 7893823111
ఇకపోతే Top 4 ప్లేస్‌లో BROWN TOWN RESORT ఉంది. మీ రోజువారీ బిజీ లైఫ్‌తో మీరు విసుగు చెందుతున్నారా..? బిజీ షెడ్యూల్ నుండి విరామం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ BROWN TOWN RESORT మంచి వేదిక అని చెప్పాలి. ప్రకృతికి చాలా దగ్గరగా ఉండే సౌకర్యవంతమైన బస ఎలా ఉంటుందనే దాన్ని బ్రౌన్ టౌన్ రిసార్ట్ సందర్శించడం ద్వారా తెలుసుకోవొచ్చు. హైదరాబాద్‌లోని టాప్ రిసార్ట్‌లలో ఇది ఒకటి. ప్రకృతిని మీ జీవనానికి దగ్గరగా తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ రిసార్ట్ రూపొందించబడింది.
BROWN TOWN RESORT ప్రత్యేకతలు ఇవే..
Class: 3-Star Resort
Location:
Survey No 224/u,
Moinabad, Kanakamamidi,
Telangana 501504
Price: 6000 per night
Distance: 31 km from Hi-Tech City, 27 km from Airport
Activities/Attractions: Dedicated Verandas, Swimming Pool, Spa, Tennis Court, Volleyball Court, Squash, Badminton Court, Table Tennis, Pool Table, Cricket Nets, Board Games, and Cycling Spot
Private Swimming Pool: No, only public pool.
ఇకపోతే Top 3 ప్లేస్‌లో The Golkonda Resorts and Spa ఉంది. వీకెండ్‌ను ప్రకృతి ఒడిలో గడిపి పరవశించిపోవాలనుకునేవారికి The Golkonda Resorts and Spa మంచి ప్రదేశం. ఈ రిసార్ట్ లోని ఆధునిక సౌకర్యాలతో మంచి మధురానుభూతులను సొంతం చేసుకోవచ్చు. దాదాపు 13 ఎకరాల్లో విస్తరించి ఉన్న The Golkonda Resorts and Spa హైదరాబాద్‌లోని అత్యుత్తమ రిసార్టలలో ఒకటిగా చెప్పొచ్చు. ఓవైపు ఉస్మాన్ సాగర్ నది.. మరోవైపు ప్రకృతి అందాలతో పర్యాటకులు మంత్రముగ్ధులవుతారు. రిసార్ట్ మొత్తంలో 40 విల్లాలు, 4 సూట్ రూములు అందుబాటులోని ఉన్నాయి. ఇదిలావుంటే.. The Golkonda Resorts and Spa ఇప్పటి వరకు 3 అవార్డులను గెలుచుకుంది. ఇక్కడి రెస్టారెంట్‌లోని భోజనం నిజంగా అమృతాన్ని తలపిస్తుంది.
The Golkonda Resorts and Spa ప్రత్యేకతలు..
Class: 4-Star Resort
Location:
Sagar Mahal Complex,
Near Osman Sagar Lake,
Gandipet, Hyderabad
Price: INR 10,300 per night
Distance: 15 km from Hi-Tec City, 28 km from the airport
Activities/Attractions: 2 Swimming Pools for adults, 1 Kids Pool, Spa and Wellness Centre, Salon, Tennis Court, Volleyball Court, Squash, Badminton Court, Table Tennis, Pool Table, Board Games and souvenir store.
Private Swimming Pool: Yes, in Pool Villa
ఇకపోతే Top 2 ప్లేస్‌లో Aalankrita Resort ఉంది. చుట్టూ తోటలు, పచ్చిక బయళ్లతో ఒక సరికొత్త వాతావరణంలో Aalankrita Resort ఆహ్లాదకరంగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని పర్యావరణ అనుకూలమైన రిసార్ట్‌లలో ఇది ఒకటి. ఆతిథ్య రంగంలో ఇప్పటికే Aalankrita Resort పలు వార్డులను గెలుచుకుంది. అలంకృత రిసార్ట్ అతిథులను విలాసవంతమైన వినోద కార్యక్రమాలతో నిరంతరం విలాసపరుస్తోంది. Aalankrita Resortను డాక్టర్ డిఎస్ దీనదయాళ్, డాక్టర్ మమత స్థాపించారు. పర్యాటకులు స్నేహితులు, కుటుంబ సభ్యులు, కొలిగ్స్‌తో గడిపిన క్షణాలు జీవితంలో గొప్ప అనుభూతులుగా నిలిచిపోతాయి. ఈ రిసార్ట్‌లో మూడు రెస్టారెంట్లు, ఇండోర్, అవుట్ డోర్ స్పోర్ట్స్, బాంకెట్ హాల్, కాన్ఫరెన్స్ హాల్స్, స్పా, జిమ్, స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు.
Aalankrita Resort ప్రత్యేకతలు..
Class: 4-Star Resort
Location:
Thumkunta Village,
Shamirpet, Secunderabad,
Hyderabad
Price: INR 3600 per night
Distance: 43 km from Hi-Tec City, 73 km from the airport
Activities/Attractions: Water park, Swimming Pools, Children Play Area, Indoor and Outdoor games such as Badminton Court, Beach Volleyball, Cricket Ground, X-Box, PS 2, PS 3, Foosball, Carrom, Billiards, tennis court, throwball and many more.
Private Swimming Pool: Yes, in Pool Villa
Contact Number:91–08418–309999
ఇకపోతే Top 1ప్లేస్‌లో Leonia Holistic ఉంది. అన్ని వయస్సుల పర్యాటకులకు ఉత్తేజకరమైన హాలిడే స్పాట్‌గా Leonia Holisticగా నిలుస్తోంది. హైదరాబాద్‌లోని అత్యుత్తమ రిసార్ట్‌లలో ఇది ఒకటి. రిసార్ట్‌లో చుట్టూ పచ్చదనం.. సహజమైన రాతి నిర్మాణాల మధ్య హాలిడే ఎంజాయ్ చేయడం మరిచిపోలేని అనుభూతి. ఇక్కడి 10 రెస్టారెంట్లు, బార్లలో భారతీయ వంటకాలే కాకుండా అంతర్జాతీయ వంటకాలతో భోజనం అదిరిపోతుంది. మసాజ్ సౌకర్యంతో పాటు ఆయుర్వేదిక్, ఇతర చికిత్సలతో బాడీని ఉత్సహపరుచుకోవచ్చు. దీంతో పాటు సాహస ప్రియుల కోసం 50కి పైగా అడ్వెంచర్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వివాహాలు, రిసెప్షన్, ఇతర సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.
Leonia Holistic ప్రత్యేకతలు..
Class: 5-Star Resort
Location:
Bommaraspet,
Shamirpet, Hyderabad
Price: 3100 per night
Distance: 43 km from Hi-Tec City, 74 km from the airport
Activities/Attractions: Fitness centre, children dedicated games, free parking, airport transportation, bar/lounge, special suites for couples and more.
Private Swimming Pool: Yes, in Cascade Suite
Contact Number: 040 6640 0000
GIPHY App Key not set. Please check settings