రోషన్‌ మేకా బయోగ్రఫీ |Actor Roshan Meka Biography In Telugu

127
0
రోషన్‌ మేకా బయోగ్రఫీ | Actor Roshan Meka Biography | Roshan Srikanth Life Story
రోషన్‌ మేకా బయోగ్రఫీ | Actor Roshan Meka Biography | Roshan Srikanth Life Story

పెళ్లిసందD హీరో రోషన్ బయోగ్రఫీ

ఫ్యామిలీ హీరోగా వందకు పైగా సినిమాల్లో నటించిన శ్రీకాంత్ తన నట వారసుడిగా రోషన్‌ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. శ్రీకాంత్‌ ఈమద్య కాలంలో హీరోగా అవకాశాలు దక్కించుకోలేక పోతున్నాడు. ఈ సమయంలో కొడుకు రోషన్ ను రంగంలోకి దించాడు. రోషన్‌ హీరోగా మొదటి సినిమానే రాఘవేంద్ర రావుతో చేసే అవకాశం దక్కించుకున్నాడు. శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్ర రావు నిర్మించి.. దర్శకత్వ పర్యవేక్షణ చేసిన పెళ్లి సందడి సినిమాతో రోషన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో రాఘవేంద్ర రావుతో కలిసి నటించే అవకాశంను కూడా రోషన్‌ దక్కించుకున్నాడు. హీరోగా రోషన్ కు పెళ్లి సందడి కమర్షియల్‌ బ్రేక్‌ ఇవ్వకున్నా కూడా ఇండస్ట్రీలో రోషన్‌ భవిష్యత్తులో మంచి హీరోగా నిలుస్తాడనే నమ్మకంను మాత్రం అందరిలో కలిగించాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేలా మొదటి సినిమాలో మంచి నటనతో మెప్పించాడు. హీరోగా ముందు ముందు మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్న అప్‌ కమింగ్‌ స్టార్‌ హీరో రోషన్‌ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రోషన్‌ తల్లిదండ్రులు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. తండ్రి శ్రీకాంత్ కాగా తల్లి శివ రంజిని అలియాస్ ఊహా. శ్రీకాంత్‌, ఊహా దంపతులకు 1999 మార్చి 13న రోషన్ మొదటి సంతానంగా జన్మించాడు. అప్పుడప్పుడే టాలీవుడ్‌ హైదరాబాద్ కు షిప్ట్‌ అవుతుంది. రోషన్‌ జన్మించడానికి ముందు శ్రీకాంత్ చెన్నైలోనే ఉండేవాడు. కొడుకు పుట్టిన తర్వాత హైదరాబాద్‌ కు శ్రీకాంత్‌ కుటుంబంతో సహా వచ్చేశాడు. రోషన్‌ పుట్టిన సమయంలో శ్రీకాంత్‌ హీరోగా ఫుల్‌ స్వింగ్ లో ఉన్నాడు. రోషన్‌ జన్మించిన 1999 లో శ్రీకాంత్‌ ఏకంగా ఎనిమిది సినిమాల్లో నటించాడు. ఆ సినిమాల్లో పలు మంచి విజయాలను దక్కించుకున్నాయి. రోషన్ కు ఒక చెల్లి మేధ మరియు తమ్ముడు రోహన్ లు ఉన్నారు. ఇక రోషన్‌ బాల్యం మొత్తం కూడా హైదరాబాద్‌ లోనే సాగింది. తండ్రి సినిమాల్లో ఉండటం వల్ల ఎప్పుడు చూసినా కూడా సినిమా ముచ్చట్లు వింటూ ఉంటేవాడు. చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుండే షూటింగ్‌ లకు వెళ్లడం.. ఎక్కువగా సినిమాలు చూడటం వల్ల రోషన్ లో సినిమాలపై ఆసక్తి పెరిగింది. రోషన్‌ కు క్రికెట్‌ అంటే కూడా చాలా ఆసక్తి ఉండేది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మ్యాచ్ లు జరిగిన సమయంలో అప్పుడప్పుడు రోషన్ ఆడటం కూడా జరిగింది. కాలం గడుస్తున్నా కొద్ది రోషన్‌ కు క్రికెట్‌ పై ఆసక్తి తగ్గి సినిమాలపై ఆసక్తి పెరిగింది. చిన్నప్పుడే సినిమాలు ఎక్కువగా చూడటం.. ఇండస్ట్రీలో ఉండటం వల్ల సినిమాల్లో నటించాలనే భావన బలంగా అతడిలో ముద్రించుకు పోయినట్లుగా ఉంది. అందుకే ఇంటర్ చదివే రోజుల్లోనే రోషన్ రుద్రమదేవి సినిమాలో చిన్న పాత్రను పోషించాడు.

గుణ శేఖర్‌ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా నటించిన ఆ సినిమా లో రానా చాలుక్య వీరభద్ర పాత్రలో నటించిన విషయం తెల్సిందే. రానా చిన్నప్పటి పాత్ర కోసం ఎంతో మంది కుర్రాళ్లను పరిశీలించిన తర్వాత గుణశేఖర్ కు శ్రీకాంత్ తనయుడు రోషన్‌ అయితే బాగుంటుందని అనిపించింది. రోషన్‌ కూడా ఇంట్రెస్ట్‌ చూపించడంతో సరదాగా ఆ సినిమాలో నటింపజేశారు. ఆ వెంటనే టాలీవుడ్‌ లోనే పెద్ద నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో.. స్టార్‌ హీరో నాగార్జున నిర్మాతగా నాగ కోటేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన సినిమా నిర్మల కాన్వెంట్‌ లో నటించాడు. అప్పటికి రోషన్‌ చదువుతున్నది ఇంటర్ మాత్రమే. నాగార్జున నిర్మాత అవ్వడంతో పాటు కథ నచ్చడం వల్ల శ్రీకాంత్ ఆ సినిమా లో రోషన్ నటించేందుకు ఓకే చెప్పాడు. మొదటగా ఆ కథను అఖిల్‌ కోసం దర్శకుడు నాగ కోటేశ్వరరావు రాసుకున్నాడు. నాగార్జునకు కథ చెప్పి అఖిల్ తో చేయాలనుకుంటున్నట్లుగా చెప్పాడట. కథ బాగుంది కాని అఖిల్ ను మాస్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమాతో పరిచయం చేయాలనుకుంటున్నట్లుగా నాగ్ చెప్పాడట. అయితే కథ నచ్చడంతో ఈ సినిమాను మరెవ్వరితో అయినా నేను నిర్మిస్తాను.. అంతే కాకుండా ఈ సినిమాలో నేను నటిస్తాను అంటూ హామీ ఇచ్చాడట. దాంతో నాగ కోటేశ్వరరావు 15 ఏళ్ల కుర్రాడి కోసం చాలా అన్వేషించాడు.

ఎంతో మంది కుర్రాళ్ల ఆడిషన్స్ కూడా తీసుకున్నాడట. కాని కథ అనుసారం కాస్త తెలిసిన కుర్రాడు అయితే బాగుంటుందని.. అలాగే చూడగానే భలే ఉన్నాడే అనిపించేలా ఉండాలని భావించాడు. ఆ క్వాలిటీస్ ఉన్న కుర్రాడు ఆయనకు దొరకలేదు. చివరకు శ్రీకాంత్ తనయుడు రోషన్ అయితే ఈ కథకు బాగుంటుందనిపిస్తుందని నాగార్జునకు చెప్పాడట. దర్శకుడి మాటలతో ఏకీభవించిన నాగార్జున కూడా రోషన్ అయితే బాగుంటుందనే ఫీల్‌ అయ్యాడట. శ్రీకాంత్ కు కథ నచ్చడంతో పాటు నాగార్జున చెప్పడంతో కాదనలేక పోయాడు. ఊహ కూడా మంచి బ్యానర్ లో సినిమా చేస్తే తప్పకుండా ఫ్యూచర్ లో బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఓకే చెప్పిందట. తల్లిదండ్రులకు నచ్చడంతో రోషన్‌ కూడా ఇంట్రెస్ట్‌ ను చూపించి హీరోగా నటించేందుకు కెమెరా ముందుకు నిర్మలా కాన్వెంట్‌ సినిమా కోసం వచ్చాడు. ఆ సినిమా లో రోషన్‌ కు జోడీగా శ్రియ శర్మ నటించింది. ఆ సినిమా కు మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది కాని జనాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కమర్షియల్ హిట్ ను దక్కించుకోలేక పోయింది.

సినిమా టాక్ తో సంబంధం లేకుండా కుర్రాడు భలే ఉన్నాడే అంటూ రోషన్ గురించి జనాలు మాట్లాడుకున్నారు. దాంతో రోషన్‌ కు వరుసగా ఆఫర్లు వచ్చాయి. గెస్ట్ రోల్‌ లో.. ఇంకా హీరో గా కూడా రోషన్ ను నటింపజేయాలని శ్రీకాంత్‌ ను అడిగారట. కాని శ్రీకాంత్‌ మాత్రం రోషన్ ఇప్పట్లో మళ్లీ నటించడని సున్నితంగా చెప్పేవాడట. చదువుకుంటున్నాడు.. చదువు పూర్తి అయ్యాక మళ్లీ సినిమాలు చేస్తాడని దాదాపుగా పది ఆఫర్లను సున్నితంగా తిరష్కరించాడట. చదువు పూర్తి చేసిన తర్వాత రోషన్ అమెరికా లో యాక్టింగ్‌ పై శిక్షణ తీసుకున్నాడు. అక్కడ ఫిల్మ్‌ మేకింగ్‌ పై ట్రైన్ అయిన రోషన్ కొన్నాళ్ల పాటు ప్రభుదేవా దర్శకత్వ శాఖలో పని చేశాడు. సల్మాన్ ఖాన్‌ నటించిన దబాంబ్ 3 సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్ గా రోషన్ చేశాడు. సినిమాల్లో రాణించాలంటే కేవలం బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదనే విషయం రోషన్ కు మరియు అతడి తండ్రి శ్రీకాంత్‌ కు ముందే తెలుసు. అందుకే అమెరికాలో నటనపై ట్రైనింగ్ ఇప్పించడంతో పాటు దర్శకత్వ శాఖలో పని చేయించాడు. అంతే కాకుండా డాన్స్ మరియు మార్షల్‌ ఆర్ట్స్‌ లో కూడా రోషన్‌ ట్రైనింగ్‌ అయ్యాడు. ఒక కమర్షియల్‌ హీరోకు కావాల్సిన లక్షణాలు అన్ని కూడా రోషన్ లో ఇప్పుడు ఉన్నాయి అనుకున్న సమయంలో పెళ్లి సందడి సినిమాకు శ్రీకాంత్ ఓకే చెప్పాడు.

తన సుదీర్ఘమైన కెరీర్‌ లో శ్రీకాంత్‌ ఎన్నో సినిమాల్లో నటించాడు. వాటిలో చాలా సూపర్‌ హిట్ అయ్యాయి. వాటిలో ప్రత్యేకంగా నిలిచే సినిమా పెళ్లి సందడి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆ సినిమా రూపొందింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రాఘవేంద్ర రావు పెళ్లి సందడి ఆలోచన చేసి ఆ సినిమాకు రోషన్‌ ను హీరోగా అనుకోవడం.. శ్రీకాంత్ ను పిలిచి ఆ విషయం చెప్పడం జరిగిందట. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న రోషన్‌ కు ఇది ఖచ్చితంగా మంచి ఎంట్రీ అవుతుందనే ఉద్దేశ్యంతో శ్రీకాంత్‌ మరో ఆలోచన లేకుండా రాఘవేంద్ర రావు తో.. అంతకంటే అదృష్టం ఏముంటుంది గురువు గారు.. మా అబ్బాయిని మీ చేతిలో పెడతాను.. వాడికి మీరు మంచి భవిష్యత్తు ఇస్తారనే నమ్మకం నాకు ఉంది అంటూ పెళ్లి సందడి కి రోషన్‌ ను రంగంలోకి దించాడు. కరోనా కారణంగా గత ఏడాదిలోనే రోషన్ సినీ రంగ ప్రవేశం జరగాల్సి ఉన్నా కూడా ఈ ఏడాదికి వాయిదా పడింది. మొత్తానికి 22 ఏళ్ల వయసులో రోషన్ పూర్తి స్థాయి హీరోగా తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమా రుద్రమదేవి ఆ తర్వాత నిర్మల కాన్వెంట్‌ సినిమాలతో క్యూట్ కుర్రాడు అనిపించుకున్న రోషన్‌ పెళ్లి సందడి సినిమాలో హ్యాండ్సమ్‌ గా ఉన్నాడే అనే టాక్ ను దక్కించుకున్నాడు. రోషన్ స్కిన్‌ టోన్‌ మరియు ఆ కళ్లకు లక్షల మంది అమ్మాయిలు ఫిదా అవుతున్నారు. మంచి కథలు ఎంపిక చేసుకుని మంచి దర్శకుడి చేతిలో పడాలే కాని రోషన్‌ టాలీవుడ్‌ హృతిక్‌ రోషన్ అవ్వడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave your vote

More

Previous articleRaghu Rama Krishnam Raju Biography in Telugu |Real Life Story
Next articleబిగ్ బాస్ 5 ప్రియ లైఫ్ స్టోరీ |Bigg Boss Season 5 Priya Biography in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here