Actress Jamuna Life Story In Telugu

129
0
Actress Jamuna Life Story | Jamuna Biography | Unknown Facts About Actress Jamuna |జమున లైఫ్ స్టోరీ
Actress Jamuna Life Story | Jamuna Biography | Unknown Facts About Actress Jamuna |జమున లైఫ్ స్టోరీ

జమున బయోగ్రఫీ

రాముడు, కృష్ణుడు పాత్రలు అనగానే నందమూరి తారక రామారావు ఎంతగా గుర్తుకు వస్తారో అలాగే సత్యభామ పాత్ర అనగానే కూడా జము గుర్తుకు వస్తారు. శ్రీకృష్ణుడి భార్య అయిన సత్యభామ పాత్రకు జము చేసినట్లుగా మరెవ్వరు న్యాయం చేయలేరు అనేంతగా ఆమె ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లుగా నటించే వారు. సత్యభామ అంటే పొగరు అందం కలగలిపిన పాత్ర. అలాంటి పాత్రకు నూటికి నూరు శాతం సూట్‌ అయిన నటి జమున. మళ్లీ ఆ స్థాయి సత్యభామను తెలుగు సినిమా చూడలేదు అనడంలో సందేహం లేదు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న నటి జమున. తెలుగు రాష్ట్రంలో పుట్టకున్నా కూడా ఆమె ప్రతి తెలుగు ఇంట ఇప్పటికి ఎప్పటికి కూడా ఆమె సినిమాలు టీవీల్లో వస్తూనే ఉండటం వల్ల గుర్తుండి పోతారు. జమున 1936 ఆగస్టు 30న కర్ణాటకలోని హంపీలో జన్మించారు. వ్యాపారవేత్త అయిన నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యదేవి దంపతుల సంతానమే జమున. హంపీలో పుట్టిన కూడా జమున బాల్యం పూర్తిగా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.

జమున కు పుట్టిన వెంటనే జన్మ నక్షత్రం ప్రకారం జనాభాయి అనే పేరును పెట్టారు. అయితే జోతిష్యులు ఆమె పేరు ఏదైన నది పేరుతో కలిసే విధంగా పెడితే మంచి జరుగుతుందని.. భవిష్యత్తులో మంచి వృద్ది చెందుతుందని తెలియజేశారు. దాంతో ఉత్తరాదిన యమున నదిని జమున నది అని కూడా అంటారు. అందుకే ముందుగా నిర్ణయించిన పేరు జానా భాయి లో ము అక్షరం చేర్చి జమున అనే పేరును ఖరారు చేయడం జరిగింది. చాలా మంది హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత పేర్లు మార్చుకున్న దాఖలాలు ఉన్నాయి. కాని జమున మాత్రం పేరు మార్చుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు అని అప్పట్లో అనుకునే వారు. ఇక ఆమె సీనియర్‌ నటుడు జగ్గయ్య గ్రామంకు చెందిన వారే కావడంతో నాటకాల్లో వేసే అవకాశం వచ్చేది. అప్పటికే జగ్గయ్య నాటకాలు వేస్తూ మంచి పేరు దక్కించుకున్నారు. ఒక రోజు స్కూల్‌ నుండి నాటకాలు వేసేందుకు గాను జమునను తీసుకు వెళ్లాడు.

స్కూల్‌ డేస్ నుండే జమునకు నాటకాలు చూడటం ఆసక్తి ఉండేది.. చూడటం ఆసక్తి కాస్త నాటకాల్లో పాత్రల గురించి ఆలోచించడం.. ఆ పాత్రలు ఇలా చేస్తే బాగుండేది కదా అనే ఆలోచనలు చేసేది. అలా నాటకాలపై ఆసక్తి ఉండటం వల్ల జగ్గయ్య స్కూల్‌ నుండి నాటకాలు వేయడం కోసం తీసుకు వెళ్లిన సమయంలో వెంటనే ఓకే చెప్పింది. మొదటగా జగ్గయ్యతో కలిసి తెనాలీ సమీపంలో మండూరు గ్రామంలో ఖిల్జీ రాజ్య పతనం అనే నాటకంలో జమున నటించింది. ఆ నాటకంలో జమున నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ నాటకంలో జమున మరియు జగ్గయ్యలు మాత్రమే కాకుండా గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా నటించారు. ఆ నాటకం విషయం ఆ నోట ఈ నోట పడి మద్రాసు వరకు చేరింది. జమున అనే అమ్మాయి నాటకాలు బాగా వేస్తుంది.. ఆమె అందం అభినయం హీరోయిన్ పాత్రలకు ఉపయోగదాయకంగా ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అలా జమున ను వెతుక్కుంటూ సినిమా ఆఫర్‌ వచ్చింది. బి వి రామానందం తెరకెక్కించిన ‘పుట్టిల్లు’ అనే సినిమా లో జమునకు నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా నటిగా జమునకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ సినిమా లో నటన తో పాటు ఆమె అందంను కూడా అంతా ప్రశంసలతో ముంచెత్తారు. అలా జమున కు అప్పటి బడా స్టార్స్ సినిమాల్లో నటించే అవకాశాలు వెళ్లువెత్తాయి.

ఎన్టీఆర్‌.. ఏయన్నార్‌.. జగ్గయ్య ఇంకా ఎంతో మంది హీరోలకు జోడీగా జమున నటించే అవకాశంను దక్కించుకున్నారు. ఆమె ప్రతి సినిమాలో కూడా ప్రత్యేకంగా కనిపించేందుకు పాత్ర కోసం ప్రత్యేకంగా హోమ్‌ వర్క్ చేసేవారు. ఆమె కు కాస్త పొగరు బోతు పాత్రను ఇస్తే దాంట్లో జీవించేసేది. వినాయక చవితి అనే సినిమాలో మొదటి సారి జమున సత్యభామ పాత్రను చేయడం జరిగింది. నిజంగా సత్యభామ అంటే ఇంతే అందంగా ఇంతే పొగరుగా ఉంటుందేమో అనిపించేలా జమున నటించి మెప్పించారు. ఆ పాత్ర కు జమున పరకాయ ప్రవేశం చేసినట్లుగా నటించారు. ఆ తర్వాత సత్యభామ అంటే జమున.. జమున అంటే సత్యభామ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. శ్రీకృష్ణ తులాభారం సినిమా కేవలం ఆమె ను సత్యభామగా మరింత హైలైట్ చేసి చూపించడం కోసం తెరకెక్కించారు. ఆ సినిమా అద్బుత విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సత్య భామ పాత్రను మరెవ్వరు చేసినా కూడా జనాలు కొట్టే స్థితికి చేరారు అనడంలో సందేహం లేదు. అంతటి ప్రతిభ తో సత్యభామ పాత్రకు ప్రాణం పోశారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జమున గుర్తు ఉంది అంటే అది ఖచ్చితంగా సత్యభామ పాత్రే అంటారు సినీ విశ్లేషకులు. జమున సినీ జీవితంలో ఎన్నో అందలాలు అధిరోహించారు. అప్పట్లోనే భారీ పారితోషికంను దక్కించుకుని మద్రాసులో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేశారు అనేది టాక్. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కొన్నాళ్లకు జమున కూడా హైదరాబాద్‌ కుటుంబంతో సహా మకాం మార్చారు.

హైదరాబాద్ లో కుటుంబ సభ్యులతో ఇప్పుడు ఆమె జీవనం సాగిస్తున్నారు. జమున అనగానే సత్య భామ పాత్ర ఎలా అయితే గుర్తుకు వస్తుందో అలాగే మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, తేల మనసులు, గుండమ్మ కథ సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో అందమైన హీరోల జాబితాలో జమున మొదటి వరుసలో ఉండే వారు. బాలీవుడ్‌ హీరోయిన్స్ తో పోటీ పడే అందం జమునది అనే వారు. అందుకే జమునకు తెలుగు లోనే కాకుండా తమిళం మరియు హిందీలో కూడా నటించే అవకాశాలు వచ్చాయి. కాని ఆమె ఎక్కువగా తెలుగు లోనే నటించేందుకు ఆసక్తి చూపించారు. పలు జాతీయ స్థాయి అవార్డులను అందుకోవడంతో పాటు పలు వేదికలపై ఆమెకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్‌ అవార్డును కూడా ప్రథానం చేయడం జరిగింది. తెలుగు సినిమా తొలి తరం హీరోయిన్స్ జాబితా తీస్తే ఖచ్చితంగా అందులో మొదటి వరుసలో జమున ఉంటారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆమె పేరు చిరస్మరణీయంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక సినిమా తారలు రాజకీయాల్లోకి వస్తున్న సమయంలోనే ఆమె కూడా రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అంటే ప్రత్యేక అభిమానం ఉన్న జమున 1980 లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పట్లో ఎన్టీఆర్‌ కు పోటీగా జమున రాజకీయాలు చేస్తుందనే వాదన కూడా కొందరు చేశారు.

1989 లో లోక్ సభ ఎన్నికల్లో రాజమండ్రి నుండి పోటీ చేసి భారత పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లు జమున రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొన్నాళ్ల పాటు బీజేపీలో జాయిన్ అయ్యారు. అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ అభ్యర్థుల తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. కొన్నాళ్లకు బీజేపీ కి కూడా ఆమె దూరం అయ్యారు. ఇక ఆమె వైవాహిక జీవితం విషయానికి వస్తే 1965 లో జూలూరు రమణ రావు ను వివాహం చేసుకున్నారు. ఆయన ఎస్వీ విశ్వ విద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పని చేసేవారు. ఆయన 2014 లో గుండె పోటుతో మృతి చెందారు. జమునకు కుమారుడు వంశీ కృష్ణ మరియు కూతురు స్రవంతి ఉన్నారు. ప్రస్తుతం కొడుకు వంశీ కృష్ణ తో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆమె ఎంతో మంది నవతరం హీరోయిన్స్ కు ఆదర్శంగా నిలిచారు అనడంలో సందేహం లేదు. అద్బుతమైన నటన మాత్రమే కాకుండా ఆమె పట్టుదల మరియు ఆమె దృడ సంకల్పం ను అంతా మెచ్చుకునే వారు. ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా.. స్టార్‌ అయినా కూడా తాను చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పడం.. భయం లేకుండా మాట్లాడటం ఆమె కే చెల్లుతుందని ఆమె సమకాలీకులు అంటూ ఉంటారు. అలాంటి స్టార్‌ తెలుగు హీరోయిన్ అవ్వడం మన అందరి అదృష్టం.

.

Leave your vote

More

Previous articleకైకాల సత్యనారాయణ బయోగ్రఫీ |Kaikala Satyanarayana Life Story in Telugu
Next articleMLA Seethakka Biography/Life Story In Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here