Hello Everyone, here we are showing simple home remedies for the foot pain epidemic. Here you know that how to relieve your foot, heel, and plantar fasciitis pain AT HOME, and it’s shown in a easy to follow step-by-step guide. These home remedies will help you to get rid of foot pain fast!
మనలో చాలామందికి నడుస్తున్నప్పుడు పాదాల నొప్పి వస్తుంటుంది. ముఖ్యంగా కాలి మడం దగ్గర వచ్చే నొప్పిని అస్సలు భరించలేం. ఆలాంటి ఇబ్బందిని కొన్ని సహజమైన పద్దతులు, remedies తో శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. అవేంటే ఈ వీడియోలో మీకు explain చేస్తాను.
* మనం ధరించే చెప్పులు కానీ , షూ కానీ లైట్‌వెయిట్‌గా ఉండేలా చూసుకోవాలి
*ఎప్పుడూ షూ వేసుకుని ఉండేవారి పాదాలు కొన్నిసార్లు బొబ్బలు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. దీనికి కారణం పాదాలకు గాలి తగలకపోవడం. కొన్ని home remediesతో ఈ బొబ్బలను సులభంగా తగ్గించుకోవచ్చు.
* అవాలు.. పాదాల నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్‌ను మెరుగుపరుస్తాయి. శరీరంలోని ట్యాక్సిన్, వాటర్‌ను తగ్గించి వాపును నివారిస్తుంది. పాదాల మంటను తగ్గిస్తుంది. ఒక గుప్పెడు ఆవాలను మెత్తగా పేస్ట్ చేసి ఒక అర బకెట్టు గోరువెచ్చని నీటిలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ వాటర్‌లో మీ పాదాలను ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత బయటకు తీసి ఒక పొడి టవల్‌తో తుడవండి. ఇలా చేస్తే మీ పాదాల నొప్పి నిమిషాల్లో తగ్గిపోతుంది.
* stretching తో కూడా పాదాల నొప్పిని పోగొటొచ్చు. ఒక చైర్‌లో కూర్చుని కాళ్లను బాగా చాపి పాదాలు నేలకు అదిమి పెట్టి ఉంచండి. అలా నిమిషంపాటు ఉండి మళ్లీ కాసేపు నార్మల్ పొజిషన్‌లో ఉంచండి. అలా రోజుకు ఐదు సార్లు అంతకంటే ఎక్కువగా చేస్తూ ఉంటే మీ పాదాలనొప్పి కంట్రోల్ అవుతుంది.
* లవంగం నూనె, నువ్వెలనూనె మిక్స్ చేసి మీ పాదాలకు gentleగా మసాజ్ చేయండి. పాదాల నొప్పిని తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. ఇలా రోజులో మూడు సార్లు చేస్తూ ఉండండి. ఫలితం మీకే తెలుస్తుంది.
* ఐస్ మసాజ్‌తో కూడా మీ పాదాలనొప్పిని పోగొట్టుకోవచ్చు. ఏదైనా ప్లాస్టిక్ కవర్‌లోగాని, ఐస్‌బ్యాగ్‌లో గానీ కొంత ఐస్‌ను తీసుకుని పాదాలపై మసాజ్ చేయండి. ఇలా చేస్తే పాదాలవాపు తగ్గి నొప్పి తొలిగిపోతుంది. అయితే ఈ ఐస్ మసాజ్‌ను 5 నిమిషాలకు మించి ఎక్కువగా చేయకండి. ఎందుకంటే ఐస్ మీ నరాలను, స్కిన్ ను డ్యామేజ్ చేస్తుంది.
* అలాగే మీ పాదాలను వాటర్‌లో ఉంచి మసాజ్ చేసుకోవడం ద్వారా కూడా పాదాల నొప్పిని తగ్గించొచ్చు.
* మరో పద్దతిలో రెండు టబ్‌లలో చల్లనినీరు, గోరువెచ్చని నీటిని తీసుకోండి. మొదట మీ పాదాలను ఐదు నిమిషాల పాటు చల్లని నీటిలో డిప్ చేయండి, ఆ తర్వాత ఐదు నిమిషాలపాటు గోరువెచ్చని నీటిలో డిప్ చేయండి. ఇలా చేయడం వల్ల పాదాల రక్తనాళాల్లో రక్త ప్రసరణ జరిగి కండరాలు వదులవుతాయి. తద్వారా పాదాలనొప్పిని దూరం చేసుకోవచ్చు.
GIPHY App Key not set. Please check settings