మనం మల్టీమిడియా స్పీకర్స్ గురించి తెలుసుకుందాం.. వీటిలో 2.1 ఛానల్ లేదా 4.1 ఛానెల్ అని అమ్ముతుంటారు.ఈ సిస్టమ్‌లో సౌండ్ బాక్సలతో పాటు ఒక వూఫర్‌ని కూడా ఇస్తారు. 2.1 అంటే రెండు లెఫ్ట్ అండ్ రైట్ శాటిలైట్ స్పీకర్స్ ఇచ్చి ఒక వూఫర్ ఇస్తారు. అలాగే 4.1లో నాలుగు శాటిలైట్ స్పీకర్స్ ఇచ్చి ఒక వూపర్ ఇస్తారు.
ఇవి లో బడ్జెట్‌లో మనం ఫీలయ్యే హోమ్ థియేటర్స్, కానీ వీటి సౌండ్‌ను డెడికేటెడ్ హోమ్ థియేటర్ సౌండ్ అనుకోవడం పొరపాటే. ఇవి మనం రెగ్యులర్‌గా వినే టివీ సౌండ్ కంటే కొంచెం బెటర్‌గా ఉంటాయ్ అంతే. ఒక స్టీరియో సౌండ్‌ను మనం వీటితో ఎక్సిపీరియన్స్ చెయొచ్చు. అలాగే కన్వెన్షన్ టైప్ హోమ్ థియేటర్ గురించి తెలుసుకుందాం. ఇవి రెగ్యులర్‌గా మనకు కనిపించే సామ్‌సంగ్, సోనీ, ఎల్జీ లాంటి కంపెనీలు ఎక్కువగా ఈ కన్వెన్షన్ టైప్ హోమ్ థియేటర్లను తయారు చేస్తాయి. ఈ మోడల్‌లో ఒక డివిడీ ప్లేయర్ లేదా బ్లూరే ప్లేయర్‌తో పాటుగా ఒక ప్రీ యాంప్లిఫయర్ సర్క్యూట్‌ను అందులో ఇన్‌సెర్ట్ చేస్తారు. వీటిలో డాల్బీ డిజిటల్ డీటీఎస్, సౌరండెడ్ సౌండ్ సిస్టమ్ లాంటివి వాడుకోవచ్చు.
వీటిలో ఎక్కువగా 5.1, 7.1, 9.1 టైప్ ఉంటాయి. 5.1 లో ఒకటి సెంటర్, ఫ్రెంట్ లెఫ్ట్, ఫ్రెంట్ రైట్ అలాగే సౌరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ స్పీకర్లు ఇస్తారు. 7.1 లో సెంటర్‌లో ఆడిషనల్‌గా రెండు స్పీకర్లు ఇస్తారు. వూఫర్ అన్నింటికి ఒకేలా ఉంటుంది. స్పీకర్స్ ఎక్కువయ్యే కొద్ది మనకు సౌండ్‌లో కొద్దిగా బెటర్‌మెంట్ కన్పిస్తుంది. ఇక 5.2, 7.2 అనే టైప్ హోమ్ థియేటర్లలో వూఫర్లనేవి రెండు ఉంటాయి. మంచి పంచ్ సౌండ్ లైక్ చేసే వాళ్లకు ఈ రెండు వూఫర్లు ఉండే హోమ్ థియేటర్లు మంచి మజానిస్తాయ్. ఇక నెక్స్ట్ నేను ఎక్స్‌ప్లైన్ చేయబోయేది ప్రొఫెషనల్ హోమ్ థియేటర్స్ లేదా ఏవీ రిసీవర్స్ హోమ్ థియేటర్లలో ది బెస్ట్ సౌండ్ ఎక్విప్‌మెంట్ ఈ ఏవీ రిసీవర్స్‌లో ఉంటుంది. సౌండ్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తుంది.
ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఏదైనా చూస్తునప్పుడు మనం ఆ ఫీల్‌ని ఎక్స్‌పీరియన్స్ చెయొచ్చు. వీటిలో కన్వెన్షన్ హోమ్‌థియేటర్ మాదిరి డీవీడి ప్లేయర్ సెట్అప్ ఉండదు. ఒక ఆంప్లీఫయర్ ఉంటుంది. దీన్ని ఏవీ రిసీవర్ అంటాం. హెచ్‌డీఎమ్ఐ, ఆప్టికల్,కాంపోనెంట్ కేబుల్స్ ద్వారా ఈ ఆంప్లిఫయర్‌కు ఇన్‌పుట్‌ని ఇవ్వొచ్చు. ఒక్కసారి ఈ సౌండ్‌ని మీరు ఎక్సీపీరియన్స్ చేస్తే థియేటర్‌కు కూడా వెళ్లారు. అంతా అల్టీమేట్ ఆడియో అవుట్‌పుట్ మనం ఎక్సీపీరియన్స్ చెయొచ్చు. ఇప్పుడు సౌండ్ బార్స్ గురించి తెలుసుకుందాం.
ఇంట్లో ఎక్కువ స్పేస్‌లేదు. బట్ నాకు థియేటర్ ఎక్సీపీరియన్స్ ఉండే హోమ్ థియేటర్ సెట్అప్ కావాలనుకునే వాళ్లు ఈ సౌండ్‌బార్స్‌ని ప్రిపర్ చేస్తే బెటర్. వీటిలో స్టీరియో కమ్ 5.1 లేదా 7.1 అవుట్‌పుట్ ప్రొవైడ్ చేసేవి కూడా ఉంటాయి. వీటిలో ఒక టవర్ బార్‌తో పాటు వూఫర్ కూడా ఇస్తారు. ఈ టవర్ బార్‌ని మనం టీవీ కింద ప్లేస్ చేస్కొటానికి అవకాశం ఉంటుంది. ఇదంతా వైర్‌లెస్ సిస్టమ్. దీనిలో ట్వీటర్, మిడ్ స్పీకర్ కలిసి ఉంటాయి. వీటిలో ఉండే విర్ట్చువల్ ఎక్స్ టెక్నాలజీ వల్ల సౌండ్ మనకు బౌన్సింగ్ అయి రీచ్ మన ఇయర్స్‌కి రీచ్ అవుతుంది. అయితే ఇటువంటి క్వాలీటీ మనకు మినిమం ప్రైస్‌లో ఉండే సౌండ్ బార్స్‌లో ఉండదు. బాగా హై ఎండ్‌లో ఉండే కంపెనీలు మాత్రమే ఈ తరహా సౌండ్‌ను ఇవ్వగలుగుతాయి.