మొటిమలు తగ్గాలంటే ఇలా చెయ్యండి |How to get rid of Acne

115
0
మొటిమలు తగ్గాలంటే ఇలా చెయ్యండి | How to remove pimples overnight | How to get rid of Acne
మొటిమలు తగ్గాలంటే ఇలా చెయ్యండి | How to remove pimples overnight | How to get rid of Acne

హాయ్ వ్యూవ‌ర్స్‌… ఈ రోజు వీడియోలో మీకు పింపుల్స్‌కు పూర్తిగా చెక్ పెట్ట‌గ‌లిగే ట్రీట్‌మెంట్స్‌, రెమిడీస్ అలాగే కొన్ని సింపుల్ చిట్కాల గురించి explain చేయ‌బోతున్నా. 

అస‌లు ఈ పింపుల్స్ స‌మ‌స్య గురించి చెప్పాలంటే, ముఖ్యంగా టీనేజ్‌లో ఉండే వారు ప‌డే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  

చ‌ర్మంపై ఉండే డ‌స్ట్ వ‌ల్ల‌నో, టీనేజ్‌లో జ‌రిగే హార్మోన‌ల్ ఛేంజెస్ కార‌ణంగానూ మొటిమ‌లు వ‌స్తుంటాయ్‌. 

ఇలా మొటిమ‌లు  వ‌చ్చిన‌ప్పుడు చాలామంది ముఖాన్ని క‌వ‌ర్ చేసుకుంటూ ఒక అత్మ‌న్యూన‌త భావంతో బాధ‌ప‌డుతుంటారు. 

కొంద‌రైతే కాన్ఫిడెన్స్‌ను కూడా కోల్పోతారు. అంతేకాకుండా ఊరికే పింపుల్స్‌ని గిల్ల‌డం వల్ల ఇత‌ర చ‌ర్మ‌వ్యాదుల బారిన కూడా ప‌డుతుంటారు. 

అలాగే  పూర్తిగా వివరాలు తెలియ‌కుండా instant treatment కోసం ఏవోవో లోష‌న్స్‌, జెల్స్ వాడి ఇబ్బంది పడుతుంటారు.  

మేక‌ప్‌తో క‌వ‌ర్ చేసుకుందామ‌ని చేసే ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ఏ పార్టీకో, బంధ‌వుల ఇళ్ల‌కు వెళ్ల‌ల‌న్నా కొంద‌రు భ‌య‌ప‌డుతుంటారు.

 వీటిన్నింటికి ప‌రిష్కారంగా ఈ వీడియోలో పింపుల్స్ స‌మ‌స్య‌ను శాశ్వ‌తంగా దూరం చేసే ట్రీట్‌మెంట్ కు సంబంధించి వాల్యుబుల్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ ఇచ్చేస్తా. 

సో అందుకే వీడియోను ఎక్క‌డా స్కిప్ చేయ‌కుండా మొత్తం చూసేయండి. అలాగే మ‌న ఛాన‌ల్‌ని స‌బ్‌స్క్రైబ్ చేసుకుంటే వెంట‌నే సబ్‌స్క్రైబ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి..

ఇంకా లేటు చేయ‌కుండా ఆ ట్రీట్‌మెంట్స్ క‌థేంటో తెలుసుకుందాం.

వీటిలో మొద‌టి చిట్కా వ‌చ్చేసి స్టీమింగ్‌

ముఖానికి బాగా ఆవిరిప‌ట్టడం వ‌ల్ల డెడ్ సెల్స్ ఓపెన్ అయ్యి వాటిలో ఆయిల్ కంటెంట్ అలాగే బ్యాక్టీరియా వంటివి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి. 

ఆ త‌ర్వాత రోజ్‌వాట‌ర్‌ను ఒక కాట‌న్ తీసుకుని ముఖానికి ప‌ట్టిస్తే డార్క్‌స్పాట్స్ పోయి ఆ ఏరియా మొత్తం క్లీన్ అవుతుంది. అలాగే మ‌న స్కిన్ టోన్ కూడా ఎంతో బ్రైట్‌గా అవుతుంది.

అలాగే అలోవెరా జెల్‌ను వారానికి రెండుసార్లు ముఖానికి రాసిన‌ట్ల‌యితే మ‌న‌కు మొటిమ‌ల బాధ త‌ప్పుతుంది. 

కొంత‌మంది స్కిన్ ఆయిలీ టైప్‌లో ఉంటుంది. అలాంటివారి స్కిన్‌కి డ‌స్ట్ ఈజీగా ప‌ట్టేస్తుంది. 

ఈ అలోవెరా జెల్ మ‌న చ‌ర్మాన్ని మాయిశ్చ‌రైజ్ చేసి చ‌ర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. జెల్ అప్లై చేసి రెండు గంట‌ల సేపు ఉంచితే స‌రిపోతుంది.

మ‌రొక ట్రీట్‌మెంట్‌లో మొట‌మ‌లను కంట్రోల్ చేసే ఫేస్‌ప్యాక్ గురించి తెలుసుకుందాం. 

దీనికోసం 

ఒక చెంచా ప‌సుపు

ఒక చెంచా ముల్లాన్ మ‌ట్టి

ఒక అర‌స్ఫూను తేనే

అలాగే కొద్దిగా గులాబివాట‌ర్‌

ఆ ఇంగ్రిడియెంట్స్‌ను మొత్తం ఒక బౌల్‌లో తీసుకుని ఆ మిశ్ర‌మాన్ని బాగా మిక్స్ చేయాలి. సో ఈ మిశ్ర‌మాన్ని మ‌నం ముఖంపై మొటిమ‌లు ఎక్క‌డైతే ఉన్నాయో అక్క‌డ రాయండి. 

ముఖ‌మంతా ఫేస్‌ప్యాక్ వేయ‌క్క‌ర్లేదు. ముల్తాన్ మ‌ట్టిలో ఉండే oil absorbing properties చ‌ర్మంలోని ఎక్నో కండీష‌న్‌ను త‌గ్గిస్తుంది. 

అలాగే పసుపు సంగ‌తి తెల‌సిందే యాంటీ బ్యాక్టీరీయా, యాంటి ఫంగ‌ల్ ప‌నిచేస్తుంది. అలాగే డెత్ సెల్స్‌ను రిమూవ్ చేస్తుంది. 

అలాగే తేనే మ‌న చ‌ర్మాన్ని గ్లోగా ఉంచుతుంది. అలాగే రోజ్ వాట‌ర్ మ‌న స్కిన్ హైడ్రేట్‌గా ఉండేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

 సో ఇలాంటి ఫీచ‌ర్స్ ఉన్న ఫేస్‌ప్యాక్‌ను నైట్ అంతా ఉంచి ఉద‌యం చ‌ల్ల‌ని నీటితో క‌డిగేసుకుంటే స‌రి.

అలాగే ఇంకో సింపుల్ ఫేస్‌ప్యాక్ గురించి తెలుసుకుందాం.

ఇందుకోసం

ఒక హాఫ్ టీస్ఫూన్ జాజికాయ పొడి

ఒక టేబుల్ టీస్ఫూన్ గంథం

రెండు లేదా మూడు చుక్క‌ల టీ ట్రీ ఆయిల్‌

అలాగే వీట‌న్నింటిని మిక్స్ చేసి పేస్ట్ చేయ‌డానికి త‌గినంత రోజ్ వాట‌ర్‌

సో ముందు చెప్పిన రెమిడీలాగానే ఈ ఇంగ్రిడియెంట్స్ అన్నీంటిని క‌లిపి ముఖంపై ఎక్క‌డైతే మొటిమ‌లు ఉంటాయో అక్క‌డ మాత్ర‌మే రాస్తే స‌రిపోతుంది. 

ఒక నైటంతా ఉంచుకుని ఉద‌యం స్వ‌చ్చ‌మైన నీటితో క‌డిగేసుకోండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసిన‌ట్ల‌యితే మీకు మొటిమ‌లు స‌మ‌స్యే ఉండ‌దు. 

సో ఈ రెమెడీలో మ‌నం వాడిన ఇంగ్రిడియెంట్స్ ఎలా ప‌నిచేస్తాయో తెలుసుకుందాం.

జాజాకాయ‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామెట్రీ, యాంటీ మైక్రోబియ‌ల్ ప్రాప‌ర్టీస్ ఇవి మొటిమ‌లు రావాడానికి కార‌ణ‌మ‌య్యే స్పాట్స్‌ను కంట్రోల్ చేస్తాయి. 

అలాగే గంధం మ‌న ఫేస్ హీల్ చేస్తుంది. ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. దీంతో చ‌ర్మం ఆయిలీ కండీష‌న్ లేకుండా స్మూత్‌గా ఉంటుంది. 

ఇక టీ ట్రీ ఆయిల్ విష‌యానికొస్తే యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు క‌లిగిఉండి పింపుల్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది.

ఇంకా మ‌రికొన్ని సింపుల్ చిట్కాలేంటో తెలుసుకుందాం

* ఫేస్‌ను ఎప్పుడూ క్లీన్ గా ఉంచేందుకు ప్ర‌య‌త్నించండి

* అప్పుడ‌ప్ప‌డూ ఐస్‌తో ఫేస్‌పై ర‌బ్ చేస్తూ ఉండండి. దీనివ‌ల్ల చ‌ర్మంలో వేడి త‌గ్గి మొటిమ‌లు రాకుండా 

ఉంటాయి.

* ముఖాన్ని తుడుచుకోవడానికి ఎప్పుడూ శుభ్ర‌మైన ట‌వ‌ల్స్‌నే వాడండి

* నీరు ఎక్కువ‌గా తాగుతూ ఉండాలి

* ఫుడ్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. జంక్ ఫుడ్స్ కు వీలైంత‌వ‌ర‌కు దూరంగా ఉండండి

* అద్దంలో చూసుకున్న‌ప్పుడు మొటిమ‌లు ఇబ్బందిగా అనిపిస్తాయి.

 దీంతో కొంద‌రు వాటిని గిల్లేస్తారు. అందువ‌ల్ల ఆ పింపుల్ లో ఉండే ఆయిల్ చ‌ర్మంపై కారి మ‌రిన్ని కొత్త పింపుల్స్ వ‌చ్చేందుకు కార‌ణం అవుతుంది

* గ్రీన్ టీ తాగ‌డం ద్వారా మొట‌మ‌లు కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే గ్రీన్ టీలో ఉండే యాంటీ బ్యాక్టీర‌యా గుణాలు మ‌నం చ‌ర్మంలో ఉండే బ్యాక్టీరియాను పూర్తిగా తొలగిస్తాయి

* అలాగే హాట్‌వాట‌ర్‌లో డిప్ చేసిన గ్రీన్ టీ ప్యాకెట్ల‌ను మొట‌మల‌పై స్మూత్‌గా ర‌బ్ చేసిన instant cure అవుతుంది.

*సో పింపుల్స్‌ను గిల్ల‌డం మాత్రం చేయ‌కండి

* బాగా నిద్ర‌పోండి, అలాగే ఒత్తిడిగా ఫీల్ అవ‌కండి.

సో నేనిప్ప‌టిదాకా చెప్పిన టిప్స్ అలాగే ఫేస్‌ప్యాక్ రెమెడీల‌ను ట్రై చేసి మీ మొటిమ‌ల సమ‌స్య‌ను దూరం చేసుకోండి. హ్యాపీగా ఫంక్ష‌న్ల‌కు, పార్టీల‌కు వెళ్లండి. And be confident

Leave your vote

More

Previous articleBest Cancer Specialists in Hyderabad
Next articleTop 5 Gastroenterologists in Hyderabad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here