ఇలా చేస్తే నిమిషాల్లో మీ మెడ‌పై న‌లుపు మాయం | How To Get Rid Of Dark Neck Naturally in Telugu

141
0
ఇలా చేస్తే నిమిషాల్లో మీ మెడ‌పై న‌లుపు మాయం | How To Get Rid Of Dark Neck Naturally
ఇలా చేస్తే నిమిషాల్లో మీ మెడ‌పై న‌లుపు మాయం | How To Get Rid Of Dark Neck Naturally

హాయ్ వ్యూవ‌ర్స్ ఈ రోజు మీకు స్కిన్ కు సంబంధించి అంద‌రికి ఉప‌యోగ‌ప‌డే హెల్త్ టిప్స్ చెప్ప‌బోతున్నా.

అదేంటంటే మ‌నంలో చాలా మందికి మెడ‌పై, మోచేతుల‌పై డార్క్ స్పాట్స్ క‌నిపిస్తుంటాయి.

 వాటివ‌ల్ల మ‌న శ‌రీరంలో మిగ‌తా స్కిన్ అంతా తెల్ల‌గా మెరుస్తున్న అక్క‌డ‌క్క‌డ ఉండే ఈ డార్క్ స్పాట్స్ వ‌ల్ల ఇబ్బందిగా ఉంటుంది. 

వాటిని క‌వ‌ర్ చేయ‌డానికి ఏవోవో మేక‌ప్ కోటింగ్స్ వేస్తుంటాం. కానీ కొన్ని సార్లు చెమ‌ట వ‌ల్ల మేక‌ప్ చెరిగిపోవ‌చ్చు. 

సో మ‌రి ఇలా క‌వ‌ర్ చేసుకునే ఇబ్బందులు లేకుండా నేను చెప్పే ఈ సింపుల్ చిట్కాతో నిమిషాల్లో ఆ డార్క్ స్పాట్స్ అండ్ లైన్స్  పోయి మెరిసిపోయే చ‌ర్మం మీ సొంతం అవుతుంది. 

సో అందుకే ఈ వీడియోను స్కిప్ చేయ‌కుండా చివ‌రిదాకా చూసేయండి. అలాగే కొత్త వాళ్లు ఎవ‌రైనా మ‌న ఛాన‌ల్ ఈ వీడియోను చూస్తున‌ట్ట‌యితే వెంట‌నే స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి. 

సో ముందుగా అస‌లు ఈ నెక్ డార్క్‌నెస్‌ అనేది ఎందుకొస్తుందో కారణాలు తెలుసుకుందాం.

* మెడ‌లో మంగ‌ళ‌సూత్రం వేసుకోవ‌డం,  అలాగే స‌న్ ట్యానింగ్ వ‌ల్ల మ‌న మెడ‌పై ఈ న‌ల్ల‌టి చార‌లు ఏర్ప‌డ‌తాయి. 

* అలాగే బ‌రువు పెర‌గ‌డం త‌గ్గ‌డం వ‌ల్ల కూడా మెడ‌పై డార్క్ స్పాట్స్ వ‌స్తుంటాయ్‌. వ‌యసు పెరిగేకొద్ది కూడా డార్క్ స్పాట్స్ క‌నిపిస్తుంటాయ్‌..

ఒకే ఇప్పుడు రెమెడీ ఏంటో చూసేద్దాం..

ఈ ప్రాసెస్‌లో ముందుగా మ‌నం డార్క్ స్పాట్స్ ఉన్న మెడ భాగాన్ని స్టీమ్ చేసుకోవాలి. దానికి గానూ ఒక బౌల్‌లో హాట్ వాట‌ర్ తీసుకుని శుభ్రంగా ఉన్న ఒక క్లాత్ ను అందులో ముంచాలి. 

ఇప్పుడు ఆ క్లాత్‌ను పిండి డార్క్ స్పాట్స్ ఉన్న మెడ భాగంపై కాసేపు ఉంచండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ భాగంలో ఉన్న నూనె గ్రంధులు తెరుచుకునేలా చేస్తుంది. 

అలాగే మ‌నం స్క్ర‌బ్బింగ్ చేసేట‌ప్పుడు స్కిన్‌పై ఉండే డెత్ స్కిన్ సెల్స్ ఈజీగా రిమూవ్ అవుతాయ్‌. అలా ఒక 5 మినిట్స్ పాటు మెడ‌భాగాన్ని స్టీమ్ చేసుకుంటే మంచిది. 

ఇక next స్టెప్ వ‌చ్చేసి scrubbing చేయ‌డం.

దీనికి మ‌న‌కు ఒక పొటాటో కావాలి. పొటాటోను ఎందుకు వాడ‌తున్నామంటే వాటిలో ఉండే బ్లీచింగ్ క్వాలీటీస్ వల్ల స్క్ర‌బ్బింగ్ చాలా ఎఫెక్టివ్‌గా అవుతుంది. 

సో పొటాటోను నీట్ గా తోలు తీసేయండి. ఆ త‌ర్వాత ముక్క‌లుగా చేసి మిక్స‌ర్ ప‌ట్టేయండి. ఇప్పుడు ఆ పేస్ట్ నుంచి జ్యూస్‌ను సెప‌రేట్ చేసేయండి.

ఇప్పుడు పొటాటో జ్యూస్ రెడీగా ఉంది క‌దా. ఇక నెక్స్ట్ ఒక టేబుల్ టీ స్ఫూన్ షుగ‌ర్ తీసుకుని ఎక్కువ పౌడ‌ర్‌లా కాకుండా కొంచెం గ‌రుకుగా ఉండేలా క్రష్ చేయండి. 

షుగ‌ర్ ఎందుకంటే మ‌న స్కిన్ ను స్మూత్‌గా ఉంచ‌డానిక‌న్న‌మాట‌.  ఆ క్ర‌ష్ చేసిన షుగ‌ర్‌కు ఒక ఒక బ‌ద్ద నిమ్మ‌కాయ ర‌సాన్ని యాడ్  చేసి మొత్తం మిక్స్ చేయండి. 

నిమ్మ‌కాయం ర‌సంలో ఉండే సిట్రిక్ యాసిడ్ వ‌ల్ల ఆ న‌లుపు ప్రాంతంలో ఉండే మృత క‌ణాలు ఎంత క‌ఠిన‌మైనవైనా ఈజీగా రిమూవ్ అవుతాయ్‌. 

ఇప్ప‌డు క‌లిపి ఉంచిన ఆ మిశ్ర‌మానికి ఒక టేబుల్ స్ఫూన్ coconut oil, అలాగే మ‌నం అప్ప‌టికే తీసి ఉంచుకున్న పొటాటో జ్యూస్‌ను క‌ల‌పండి. అస‌లు కోకోన‌ట్ ఆయిల్ ఎందుకు మిక్స్ చేస్తున్నామో చెప్ప‌లేదు క‌దా. 

సో ఎందుకంటే కొకోన‌ట్ ఆయిల్‌లో ఉండే యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ వంటి నేచ‌రుల్ క్వాలీటీస్ ఉండ‌ట‌మే కాకుండా, మ‌న చ‌ర్మాన్ని మాయిశ్చ‌రైజింగ్ చేయ‌డానికి చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

అలాగే చ‌ర్మంపై ముడ‌త‌ల‌ను కూడా కొబ్బ‌రినూనే త‌గ్గిస్తుంది. సో ఇక స్క్ర‌బ్బింగ్ విష‌యానికొస్తే మ‌నం త‌యారు చేసి పెట్టుకున్న ఈ మిశ్ర‌మాన్ని చేత్తో తీసుకుని న‌ల్ల‌గా ఉన్న మెడ‌భాగంపై బాగా స్క్ర‌బ్ చేయాలి.

 ఆ త‌ర్వాత ఒక డ్రై క్లాత్‌ను తీస‌కుని ర‌బ్ చేయండి. ఇలా చేసిన త‌ర్వాత కొంత‌సేప‌టికి మీరు గ‌మ‌నిస్తే ఈ స్క్ర‌బ్బింగ్ ఎఫెక్ట్ క‌చ్చితంగా కనిపిస్తుంది. 

డార్క్ స్పాట్స్ పోయిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

ఇక త‌ర్వాత స్టెప్ వ‌చ్చేసి నెక్‌పై ప్యాక్ వేయ‌డం

 ఈ ప్యాక్ కోసం మ‌న‌కు ఒక టేబుల్ స్ఫూన్ కాఫీ పౌడ‌ర్, ఒక టేబుల్ స్ఫూన్ వీట్ పౌడ‌ర్‌, అలాగే ఒక టేబుల్ స్ఫూన్ పొటాటో జ్యూస్. 

మూడు ఇంగ్రిడెయంట్స్‌ను బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోండి. ఒక‌సారి మ‌నం ఈ ప్యాక్ రెమెడీలో వాడిన ఇంగ్రిడియెంట్స్ ఉప‌యోగాలేంటో  తెలుసుకుందాం. 

కాఫీ పౌడ‌ర్‌లో ఉండే యాంటీ ఆక్సెంట్ వ‌ల్ల మ‌నం చ‌ర్మం సాగిపోకుండా ఉంటుంది. ఫ్రీ ర్యాడిక‌ల్ నుంచి మ‌న చ‌ర్మాన్ని ర‌క్షిస్తుంది. 

అలాగే స్కిన్ బ్రైట్ గా మెరవ‌టానికి కార‌ణం అవుతుంది. ముఖ్యంగా మ‌న స్కిన్‌పై ఉండే ట్యాన్ రిమూవ్ చేయ‌డానికి చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న‌మాట‌. 

ఇక రెండోది వీట్ ఫ్లోర్ ఏ స్కిన్ టోన్ వారికైనా క‌ల‌ర్ ఇంప్రూవ్ చేయ‌డానికి ది బెస్ట్ ఆప్ష‌న్ ఈ వీట్ ఫ్లోర్‌. 

ఇక మూడోది పొటాటో జ్యూస్ ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టుగానే  డార్క్‌నెస్ త‌గ్గించ‌డానికి పొటాటో జ్యూస్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ఇప్పుడీ ఈ ఫేస్ ప్యాక్ మిశ్ర‌మాన్ని మెడ‌కు చేతుల్తోనో లేదా ఒక బ్ర‌ష్ తీసుకునే బాగా ప‌ట్టించాలి. అది డ్రై అయ్యేదాకే అలాగే ఆర‌నివ్వండి. 

అలా ఒక 20 మినిట్స్ త‌ర్వాత ఒక క్లాత్‌ను కొంచెం త‌డిపి ఈ ప్యాక్ ను మెల్లిగా రిమూవ్ చేసుకోవాలి. 

ప్యాక్ రిమూవ్ చేశాక ఒక్క‌సారి మీ నెక్ చూసుకున్న‌ట్ల‌యితే తేడా స్ప‌ష్టంగా మీకే తెలుస్తుంది. 

కచ్చితంగా ఎన్నాళ్లగానో ఉన్న మీ నెక్ డార్క్‌నెస్ స‌మ‌స్య‌ను నిమిషాల్లో ప‌రిష్కారం చూపిన‌ట్లే. 

ఇలా వీక్లీ 2 టైమ్స్‌గానీ, 3 టైమ్స్‌గానీ యూజ్ చేస్తే మీ నెక్ బ్రైట్‌నెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంది. చెప్పాలంటే 100% రిజ‌ల్ట్స్ క‌నిపిస్తుంది. 

ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్‌లో ఎలాంటి కెమిక‌ల్స్ లేవు కాబ‌ట్టి  ఏ స్కిన్ టోన్ వారైనా ట్రై చేయ‌వ‌చ్చు. 

అయితే చిన్న‌పిల్ల‌ల‌కు వాడేట‌ప్పుడు మాత్రం ఒక్క‌సారి ప్యాక్ టెస్ట్ చేసుకుంటే మంచిది. ప్యాక్ ఆప్లై చేసిన 24 అవ‌ర్స్ త‌ర్వాత ఆ ప్రాంతంలో ర్యాషెష్ కానీ, రెడ్‌గా గానీ రాక‌పోతే నిర‌భ్య‌రంత‌రంగా ట్రై చేయొచ్చు. 

చూశారు క‌దా మీకు క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డే హెల్త్‌టిప్‌. ఇలాంటి మ‌రికొన్ని చిట్కాల‌తో మ‌రిన్ని వీడియోలు చేసేస్తాం.

 సో మ‌న నోటిఫికేష‌న్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే, మేం వీడియో అప్లోడ్ చేసిన వెంట‌నే మీకు నోటిఫికేష‌న్ వ‌స్తుంది. 

మ‌రింత యూజ్‌ఫుల్ ఇన్ఫ‌ర్మేష‌న్ మీకు తెలుస్తుంది. సో వెంట‌నే క్లిక్ చేసేయండి.

Leave your vote

More

Previous articleముఖంపై ఉన్న కొవ్వు పోవాలంటే..? |How to Lose Face Fat in Telugu
Next articleముఖంపైన నల్ల మచ్చలు పోవాలంటే |Home Remedies for Dark Black Spots on Face in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here