ఇమ్మ్యూనిటీని పెంచే డ్రింక్ ఇదే |How to Make Immunity Boost Drink at home in Telugu

214
0
ఇమ్మ్యూనిటీని పెంచే డ్రింక్ ఇదే | How to Make Immunity Boost Drink at home | Telugu Health Tips
ఇమ్మ్యూనిటీని పెంచే డ్రింక్ ఇదే | How to Make Immunity Boost Drink at home | Telugu Health Tips

Easy way to make Immunity Boost Drink at home to strengthen your immune system. immune system is your body’s “defense team.” This well-organized squad is constantly at work defending your body against bacteria, viruses, parasites and other invaders. This video explains about the natural ways to boost immunity power in human body. Here we have discussed many ways to boost your immunity power naturally using simple diet plan. There are many immunity boosting foods available that can help you boost your immunity power naturally.

హాయ్ వ్యూవర్స్ ఈరోజు మీకు ఇమ్యూనిటీ బూస్టింగ్ పెంచే ఒక కషాయం గురించి చెప్పబోతున్న. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఈ కషాయం మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా మన వంటింట్లో అందుబాటులో ఉండే వాటితోనే ఈ కషాయం తయారు చేసుకోవచ్చు. ఈ కషాయం తాగడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఆ కషాయాన్ని ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. అందుకే ఈ వీడియోని skip చేయకుండా చూడండి. కావలసిన పదార్థాలు:

* అల్లం ఒక స్పూన్

*పసుపు పావు స్పూన్

*దాల్చిన చెక్క ఒక స్పూన్

*లవంగాలు ఒక స్పూన్

*వాము ఒక స్పూన్

*జీలకర్ర ఒక స్పూన్

*మిరియాలు ఒక స్పూన్

*బెల్లం ఒక స్పూన్

*ఒక గిన్నె

*రెండు గ్లాసుల నీళ్లు

ముందుగా ఒక ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు తీసుకుని అందులో దాల్చిన చెక్క వేసి బాగా మరగబెట్టాలి. ఆ తర్వాత లవంగాలను అందులో కలపాలి. దాల్చినచెక్క యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తే, లవంగాలు యాంటీబ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. దాంతో పాటు మంచి సువాసన కూడా ఇస్తాయి. ఇప్పుడు మరుగుతున్న ఆ మిశ్రమంలో అల్లం వేసుకోవాలి . ఈ అల్లం కడుపులో వికారాన్ని తగ్గిస్తుంది. అలాగే మిరియాలు, జీలకర్ర వేసుకోవాలి. మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరిస్తే , జీలకర్ర ఒంట్లో ఉండే నులు పురుగుల్ని చంపేస్తుంది. అలాగే వాము కూడా ఆహారం త్వరగా జీర్ణం చేసేందుకు సహాయపడుతుంది. ఇప్పుడు పసుపు , బెల్లం దాంట్లో వేయాలి. పసుపు క్రిమిసంహారిణిగా మనందరికీ తెలిసిందే . అలాగే బెల్లం లో ఐరన్ కంటెంట్ జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు దోహద పడుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. దీంతో ఇంగ్రిడియంట్స్ లో ఉండే ఔషధ గుణాలన్నీ ఆ ద్రావణంలో కి చేరతాయి. మరిగిన ఆ ద్రావణాన్ని కొద్దిసేపు చల్లార్చి వడగట్టాలి. వీలున్నప్పుడల్లా ఇలాంటి కషాయం తయారుచేసుకొని తాగితే శ్వాసకోస సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకొని కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Leave your vote

More

Previous articleఇలా చేస్తే గురక రమ్మన్నా రాదు |How to Stop Snoring in Telugu
Next articleమీ రోగనిరోధక శక్తి పెరగాలంటే |Immunity Booster Food in Telugu | How to boosting Immunity in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here