కె ఏ పాల్ బయోగ్రఫీ | KA Paul Biography In Telugu

114
0
కె ఏ పాల్ బయోగ్రఫీ | KA Paul Biography In Telugu | K. A. Paul Real Life Story
కె ఏ పాల్ బయోగ్రఫీ | KA Paul Biography In Telugu | K. A. Paul Real Life Story

కేఏ పాల్ బయోగ్రఫీ

కిలారి ఆనంద్‌ పాల్ అంటే వెంటనే ఎవరు గుర్తించలేక పోవచ్చు కాని కేఏ పాల్‌ అంటే వెంటనే ప్రతి ఒక్కరు కూడా గుర్తించేస్తారు. కేఏ పాల్‌.. ఈ పేరును తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ను ఆరాధించే వారు ఉంటారు.. అభిమానించే వారు ఉంటారు.. జోకర్ అంటూ లైట్ తీసుకునే వారు ఉంటారు.  కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దాదాపుగా వంద దేశాల అధినేతలతో మాట్లాడిన ఘనత ఆయనకే దక్కింది అనడంలో సందేహం లేదు. ఒక క్రైస్తవ మత ప్రచారకుడిగా ఆయన్ను దేశ అధ్యక్షుల నుండి మొదలుకుని ప్రతి ఎంతో మంది అభిమానిస్తారు. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఆయన తినడానికి తిండి లేక బొగ్గులు ఏరుకున్నాడు.. కుల్లిపోయిన ఆహారం తిన్నాడు.. అలాంటి పాల్ ఛార్టెడ్ ప్లైట్‌ లో తిరిగిన గొప్ప చరిత్ర కలిగి ఉన్నాడు. జైలుకు వెళ్లాడు.. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు.. వందల దేశాలు తిరిగి మత ప్రచారం చేశాడు. ఒక రాజకీయ పార్టీ పెట్టి పరువు పోగొట్టుకున్నాడు.. ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే ఒక జోకర్ మాదికిగా మారిపోతాడు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ఎవరేం అనుకున్నా కూడా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటూ వెళ్తాడు. ఎక్కువగా విదేశాల్లో ఉండే ఈయన అమెరికా వంటి దేశాల్లో గొప్ప మత ప్రచారకుడిగా పేరు దక్కించుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అధ్యక్షులతో  చాలా ఈజీగా కమ్యూనికేట్‌ అవ్వగల కేఏపాల్‌ అమెరికా వంటి అగ్ర రాజ్య అధ్యక్షుడితో కూడా కావాలనుకుంటే వెంటనే మాట్లాడగల సమర్థుడు. ఆయన గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. ఆయన పూర్తి బయో గ్రఫీని ఇప్పుడు చూద్దాం.

కేఏపాల్ ఆంద్రప్రదేశ్ లోని విశాఖ జిల్లా చిట్టి వలస అనే చిన్న గ్రామంలో బర్నదాస్ సంతోషమ్మ దంపతులకు 1963 సెప్టెంబర్ 25న జన్మించాడు. పాల్ తల్లిదండ్రులు మొదట హిందువులుగానే ఉన్నారు. పాల్ రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి అనారోగ్యంతో బాధ పడ్డారట. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా.. ఎన్ని దేవాలయాలు తిరిగినా కూడా ఆయన ఆరోగ్యం బాగు పడలేదట. చివరకు పాల్ తండ్రి మెంటల్ గా కూడా డిస్ట్రబ్ అవ్వడం మొదలు అయ్యిందట. అనారోగ్య బాధతో ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపించేంత అశాంతి అతడిలో ఉండేదట. మూడేళ్ల పాటు ఆ నరక యాతనను పాత్ తండ్రి అనుభవించాడట. ఆ సమయంలో ఒక క్రిస్టియన్ ఫాదర్ పాల్ తల్లిదండ్రులకు కలిసి ఎన్నో దేవాలయాలకు మీరు వెళ్తున్నారు… ఎన్నో ఆసుపత్రులు తిరుగుతున్నారు. ఒక్క సారి మీరు ఏసు ప్రభుని నమ్మి మనసారా ప్రార్థించి మీ సమస్యలు తీరి పోవాలని కోరుకోండి అన్నాడట. ఆయన సలహా మేరకు గ్రామంలో ఉన్న చర్చిలో ఏసు ప్రభు ప్రార్థనలో పాల్గొన్నారట. ఏసు ప్రభును నమ్మిన పాల్ తల్లిదండ్రులకు అంతా మంచే జరిగింది. మెల్ల మెల్లగా పాల్‌ తండ్రి అనారోగ్య సమస్యలు దూరం అయ్యాయి. దాంతో వారు 1966 లో క్రిస్టియన్‌ లుగా మారారు.  ఆ తర్వాత కొన్నాళ్లకు మార్చి 1971 లో పాల్ కూడా క్రిస్టియన్ గా మారాడు. కిలారి ఆనంద్ క్రిస్టియన్ గా మారిన తర్వాత కిలారి ఆనంద్ పాల్ గా మారిపోయాడు.  8 ఏళ్ల వయసులో పాల్‌ క్రిస్టయన్ గా మారి చదువుకునే రోజుల్లోనే క్రిస్టియన్ మతం ను ప్రచారం చేసే కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. స్కూల్ కు వెళ్లే సమయంలో కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా జూట్ మిల్లు వద్ద బొగ్గులు ఏరుకుని వాటిని అమ్మి కుటుంబ పోషణలో తన వంతు సాయం చేసేవాడు.

తోటి స్నేహితులు చదువుకుంటూ ఆడుకుంటూ ఉంటే పాల్ మాత్రం చదువుకుంటూ పని చేశాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినందుకు పాల్‌ చిన్నతనంలో చాలా అవస్థలు.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొన్ని సార్లు ఆకలితో కుల్లిపోయిన అరటి పండ్లు.. పాడై పోయిన ఆహారం తిన్న రోజులు కూడా ఉన్నాయంటూ పాల్‌ పలు సందర్బాల్లో గుర్తు చేసుకున్నాడు. ఒక వైపు చదువు మరో వైపు పని వల్ల చదువు సరిగా సాగలేదు. పాల్ చదువు అంతంత మాత్రమే.. ఆయన పదవ తరగతి రెండు సార్లు ఫెయిల్‌ అయ్యాడు. మళ్లీ పరీక్ష రాసి పాస్ అయ్యాడు. కష్టపడి ఏదోలా పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్ లో జాయిన్ అయ్యాడు. ఇంటర్‌ నర్సీపట్నంలో చదివాడు. ఇంటర్ చదివే రోజుల్లో కూడా తన ఆర్థిక అవసరాల కోసం ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు. కష్టపడి పని చేసుకుంటూ కష్టపడి చదువుతూ ఇంటర్ పూర్తి చేశాడు. ఇంటర్ తర్వాత అనకాపల్లి ఏఎన్‌ఎం కాలేజ్ లో చేశాడు. ఆ కాలేజ్ లో ఉన్న సమయంలో కూడా ఆర్థికంగా చాలా అవస్థలు పడ్డాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్‌ మాట్లాడుతూ డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఒకానొక సమయంలో చేతిలో ఉన్న 15 పైసలతో ఏకంగా 30 రోజులు గడిపాడట. ఆ సమయంలోనే అతడిలో చాలా మార్పు వచ్చినట్లుగా చెబుతుంటారు. డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి సంఘాల్లో ఉండటంతో పాటు నక్సలైట్ ఉద్యమానికి కూడా ఆకర్షితుడు అయ్యాడు. వారితో కొన్నాళ్ల పాటు తిరిగాడు. ఆ సమయంలో పలు నక్సల్స్‌ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నట్లుగా చెబుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనేక ఇతర కారణాల వల్ల డిగ్రీని మద్యలోనే వదిలేశాడు.

డిగ్రీ వదిలేసి ఇంటికి తిరిగి వెళ్లిన పాల్‌ కు అవమానాలు ఎదురయ్యాయి. ఉద్యోగం లేక.. చదువు పూర్తి చేయక పోవడంతో పాల్‌ ను కుటుంబ సభ్యులతో పాటు అంతా కూడా ఏదో విధంగా విమర్శిస్తూ ఉండేవారు. ఆ సమయంలో పాల్‌ ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించాడట. చనిపోవాలనుకున్న సమయంలో స్థానికంగా ఉన్న ఒక జూట్‌ మిల్లులో లంచం ఇవ్వడంతో ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగంతో నెలకు 300 రూపాయలు రావడం మొదలు అయ్యింది. జూట్ మిల్లులో ఉద్యోగం చేయడం ఆయన వల్ల కాలేదు. కొన్నాళ్లకే అక్కడ నుండి బయట పడ్డాడు. ఆ సమయంలో పాల్ తండ్రి మత ప్రచారకుడిగా పాస్టర్ గా పని చేస్తున్నాడు. తాను కూడా మత ప్రచారకుడిగా మారాలనే ఆలోచన అప్పట్లోనే పాల్ కు వచ్చినట్లుగా ఉంది. అందుకే ఉద్యోగం మానేసిన పాల్‌ తండ్రితో ఊరు ఊరు తిరుగుతూ మత ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. పాల్‌ మత ప్రచారకుడిగా పాల్ తండ్రితో మొదట్లో తిరిగి ఆ సమయంలో వ్యాఖ్యం చెప్పడం నేర్చుకున్నాడు. కొంత మేరకు చదువుకోవడంతో పాటు.. తెలుగు స్పష్టంగా మాట్లాడటం వచ్చిన పాల్‌ వ్యాఖ్యం చెప్తూ ఉన్న సమయంలో అంతా అలా చూస్తూ ఉండేవారు. పాల్ తండ్రిని కొందరు ఫారినర్స్‌ వ్యాఖ్యం చెప్పడం కోసం తమ తమ దేశాలకు ఆహ్వానించారు. అలా పాల్ తండ్రి విదేశీ పర్యటనలు చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో పాల్‌ కూడా ఆయన తండ్రితో తిరుగుతూ వచ్చాడు.

విదేశీ పర్యటనల సందర్బంగా పాల్ కు ఇంగ్లీష్ పై పట్టు వచ్చింది. ఇంగ్లీష్‌ లో పట్టు సాధించిన పాల్ తన వ్యాక్యలను ఇంగ్లీష్ లో చెప్పడం వల్ల ఇండియన్స్ మాత్రమే కాకుండా విదేశీయులు కూడా ఆకర్షితులు అయ్యారు. చెప్పే విషయంను స్పష్టంగా అద్బుతంగా చెప్పగల భాష ప్రతిభ ఆయనకు దక్కింది.  ఇంగ్లీష్‌ లో మంచి పట్టు సాధించడంతో పాటు ఒక మంచి ప్లో లో వ్యాఖ్యలు చెప్పడంతో తక్కువ సమయంలోనే తండ్రిని మించిన పాస్టర్ గా మత ప్రచారకుడిగా పాల్ ఎదిగాడు. దాంతో ఆయనకు విదేశాల్లో సందేశాలు ఇవ్వడానికి ఆహ్వానాలు రావడం మొదలు అయ్యింది. ఎన్నో దేశాల నుండి పాల్‌ కు వచ్చే ఆహ్వానాలు ఆయన స్థాయిని పెంచేశాయి. అమెరికా పాస్టర్‌ ల ను మించి పాల్ మత ప్రచారం చేయడంతో పాటు.. ఎంతో మందికి క్రిస్టియన్ మతంపై ఆయన అవగాహణ కల్పించారు. ఇండియాలో దళితులను చులకనగా చూస్తున్న సమయంలో వారిని క్రిస్టియన్‌ మతంలోకి ఆహ్వానించి వారికి సముచుతి స్థానం కల్పిస్తామని వ్యాఖ్యం చెప్పి ఎంతో మందిని మతం మార్చుకునేలా పాల్‌ చేశారు.

విదేశీ క్రిస్టియన్‌ సంస్థలు ఇండియాలో పాల్ ద్వారా కోట్లు కుమ్మరించి లక్షల మందిని క్రిస్టియన్స్ గా మార్చేశాడు. విదేశాల్లో వందల కోట్ల ఆదాయాలు ఉన్న క్రిస్టియన్‌ సంస్థలు పాల్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను ఇండియాలో చేయడం మొదలు పెట్టడమే కాకుండా బడుగు బలహీన వర్గాల వారిని క్రిస్టియన్‌ మతంలోకి అడుగు పెట్టేలా చేశాయి. అలా ఇండియాలో పాల్ అంటే క్రిస్టియన్‌.. క్రిస్టియన్‌ అంటే పాల్‌ అన్నట్లుగా మారింది. ఇండియాలో ఏ పాస్టర్‌ సభలు పెట్టినా.. వ్యాఖ్యం చెప్పినా కూడా జనాలు పెద్దగా వచ్చే వారు కాదు. కాని పాల్‌ సభలకు పెద్ద ఎత్తున జనాలు వచ్చే వారు. దాంతో అమెరికన్ క్రిస్టియన్ సంస్థలు పాల్ కు వందలు వేల కోట్ల నిధులు ఇచ్చి ఇండియాలో క్రిస్టియన్ మతంను పెంచేందుకు ప్రయత్నించాయి. పోప్‌ జాన్ పాల్ 2 వద్ద కూడా పాల్ కు మంచి గుర్తింపు దక్కింది. స్వయంగా పాల్‌ ఆదేశాలతో విదేశాల్లో పాల్ మత ప్రచారం మొదలైంది. పోప్ ఆదేశాలతో పాల్ మత ప్రచారం మొదలు పెట్టడంతో ఆయన సభలకు లక్షల్లో జనాలు హాజరు అయ్యేవారు. అలా దేశ విదేశాల్లో కేఏ పాల్‌ అత్యంత ప్రజాధరణ దక్కించుకున్న క్రిస్టియన్‌ మత ప్రచారరకుడిగా పేరు దక్కించుకున్నాడు. పదుల సంఖ్యల దేశాల అధినేతలతో మాట్లాడటమే కాకుండా వారి నిర్ణయాలను ప్రభావితం చేసేంతటి బలంను ఆయన దక్కించుకున్నాడు.

ఎన్నో దేశాల మద్య విభేదాలు తొలగించడంలో ఈయన మ్యదవర్తిగా వ్యవహరించినట్లుగా చెప్పుకుంటూ ఉంటాడు. లక్షల మంది కోట్ల మంది అభిమానులు మరియు మద్దతుదారులు ఉన్న కేఏపాల్ జీవితం ఎన్నో సంఘటనల మద్య సాగుతూ వచ్చింది. విదేశాల్లో హీరో అయిన కేఏపాల్ స్వదేశంలో మాత్రం పలు సందర్బాల్లో జీరో.. కమెడియన్‌ అనిపించుకున్నాడు. హత్య కేసుతో పాటు పలు కేసులు ఎదుర్కొన్న పాల్ జైలు జీవితంను కూడా గడిపాడు. ప్రస్తుతం పూర్తిగా అమెరికాకే పరిమితం అయిన కేఏ పాల్‌ ఎన్నికలు వచ్చిన సమయంలో మాత్రం ఇండియాకు వచ్చి హడావుడి చేస్తూ ఉంటాడు. ఆయన రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో ప్రజా శాంతి అనే రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేశాడు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. కాని అది వర్కౌట్‌ అవ్వలేదు. ఆయన పార్టీ రాజకీయంగా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చాడు. కాని ప్రతి ఎన్నికల్లో కూడా పాల్ పార్టీ కనిపించకుండానే పోయింది. కనీసం ఆయన కూడా గెలవలేదు. ఎన్నికల సమయంలో ఆయన చేష్టలు మరియు ఆయన మాటలు విని ఆయన్నో పెద్ద జోకర్ అంటూ తెలుగు వారు పరిగణలోకి వచ్చేశారు.

తెలుగు రాష్ట్రాలను రాత్రికి రాత్రే అభివృద్ది చేయగల సత్తా తనకు ఉందని.. తనను నమ్మి ఓట్లు వేస్తే పది దేశాల అధ్యక్షులను తీసుకు వచ్చి మీ ముందు ఉంచుతాను అంటూ ఏవో వ్యాఖ్యలు చేశాడు. నామినేషన్ కూడా సరిగా వేయలేని కేఏ పాల్ రాజకీయాల్లో ఎలా ఉండే అర్హత కలిగి ఉన్నాడంటూ కొందరు  అంటూ ఉంటారు. ఎవరేం అనుకున్నా కూడా మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి పాల్‌ మళ్లీ ఇండియా వస్తాడు.. తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో ఆ కొన్ని నెలలు హడావుడి చేస్తాడు. ఆయన హుందాగా రాజకీయాలు చేస్తే మెచ్చే వారు.. అభిమానించే వారు ఉంటారు. కాని ఆయన రాజకీయం ఏమాత్రం ప్రజామోధయోగం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పాల్ మత ప్రచారకుడిగా హీరో అయినా కూడా రాజకీయ నాయకుడిగా జీరో అంటూ ఉంటారు. ఇప్పటికి కూడా ఆయన ఒక గొప్ప మత ప్రచారకుడిగా అమెరికా వంటి దేశాల్లో పేరు దక్కించుకున్నాడు. అమెరికాలో ఇప్పటికి ఆయన మత ప్రచార సభ అంటే వేల మంది హాజరు అవుతూనే ఉంటారు. ఇండియాకు అరుదుగా వస్తూ ఉండే పాల్‌ అమెరికా మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో దేశాల్లో ముఖ్యంగా వెనుకబడిన దేశాల్లో తన వ్యాఖ్యం వినిపిస్తు వస్తున్నాడు. ఆయన జోకర్‌ అయినా.. జీరో అయినా.. వందల దేశాల అధ్యక్షులతో మాట్లాడి.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి పాల్‌ మన తెలుగు వారు అవ్వడం  ఖచ్చితంగా మన అందరికి గర్వ కారణం అనడంలో సందేహం లేదు.

Leave your vote

More

Previous articleసౌందర్య బయోగ్రఫీ | Actress Soundarya Biography
Next articleఅసలు ఎవరు ఈ ఎలిమినేటి మాధవరెడ్డి..?? | Alimineti Madhava Reddy Biography in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here