మీ శరీరంలో కొవ్వు గడ్డలు,కంతులను పూర్తిగా కరిగించే అద్భుతమైన ఆయుర్వేదిక్ టిప్ | Lipoma Home Remedies

155
0
మీ శరీరంలో కొవ్వు గడ్డలు,కంతులను పూర్తిగా కరిగించే అద్భుతమైన ఆయుర్వేదిక్ టిప్ | Lipoma Home Remedies
మీ శరీరంలో కొవ్వు గడ్డలు,కంతులను పూర్తిగా కరిగించే అద్భుతమైన ఆయుర్వేదిక్ టిప్ | Lipoma Home Remedies

ఈ రోజూ వీడియోలో మ‌న శ‌రీరంపై అక్క‌డ‌క్క‌డ ఉబ్బిన‌ట్టు క‌నిపించే కొవ్వుగ‌డ్డ‌లు క‌ణుతులు వ‌ల్ల‌ వ‌చ్చే health issues, 

వాటిని స్టార్టింగ్‌లోనే కంట్రోల్ చేయ‌డానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, natural remedies గురించి  explain చేయ‌బోతున్నా..

సాధార‌ణంగా చాలామంది ..ఆ ప‌ర్లేదులే కొవ్వుగ‌డ్డ‌లే క‌దా..కొన్నాళ్ల‌కు అవే క‌రిగిపోతాయ్‌..అని చాలా లైట్ తీసుకుంటారు. 

కానీ వాటి వ‌ల్లే మ‌న‌కు క్యాన్స‌ర్ సోకే అవ‌కాశం ఉంది. ఈ కొవ్వుగ‌డ్డ‌ల‌ను లిపోమా అని కూడా అంటారు.

అస‌లు ముందుగా మ‌న శ‌రీరంలో ఈ కొవ్వుగ‌డ్డ‌లు ఎందుకొస్తాయో తెలుసుకుందాం..

మ‌నం తీసుకునే ఆహారం ద్వారా అనేక చెడు ప‌దార్థాలు శ‌రీరంలోకి చేర‌తాయి. 

అవి ర‌క్తంలో క‌లిసిపోయి అక్క‌డ‌క్క‌డ పేరుకుపోయి కుప్ప‌లాగా ఉండిపోతాయి. 

ఇవే త‌ర్వాత కొవ్వుగ‌డ్డ‌లుగా మార‌తాయి. ఈ కొవ్వుగ‌డ్డ‌లు లేదా క‌ణుతులు మ‌న శ‌రీరంలో ఎక్క‌డైనా రావ‌చ్చు. 

ముఖ్యంగా చేతులపై, పొట్ట‌, వీపు మీద ఇవి ఎక్కువ‌గా క‌న్పిస్తుంటాయ్‌. చాలా వ‌ర‌కు వీటివ‌ల్ల ప్ర‌మాదం లేక‌పోయినా అప్పుడప్పుడు న‌రాల మీద ఇవి వ‌స్తుంటాయి. 

అందువ‌ల్ల ఆ న‌రాలు ఒత్తిడి గుర‌య్యి బాగా నొప్పిగా ఉంటుంది. ఇవి కాల‌క్ర‌మేణా క్యాన్స‌ర్‌గా మారే ప్ర‌మాదం కూడా  ఉంటుంది.

వీటి గురించి మ‌నం డాక్ట‌ర్ల‌ని consult అయిన‌ప్పుడు, వాళ్లు సిజేరియ‌న్ చేసి ఆ లిపోమా గ‌డ్డ‌ల‌ను తొల‌గిస్తామ‌ని suggest  చేస్తారు. 

అయితే అలా ఆప‌రేష‌న్ చేసి తీసేసిన కూడా మ‌ళ్లీ వ‌చ్చే అవకాశం లేక‌పోలేదు. 

కానీ ఇప్పుడు మేము సూచించే కొన్ని ఆయుర్వేద ప‌ద్ద‌తుల, హోమ్ రెమిడీస్  స‌హాయంతో వాటిని శాశ్వ‌తంగా తొల‌గించుకునే  అవ‌కాశం ఉంది. 

అందుకే ఈ వీడియోను స్కిప్ చేయ‌కుండా పూర్తిగా చూసేయండి.

1

ఫ‌స్ట్ హోమ్ రెమెడీలో మ‌న‌కు కావాల్సింది క‌ల‌బంద‌, ఒక వెల్లుల్లి పాయ అలాగే ఒక టేబుల్‌స్ఫూన్ ప‌సుపు. 

ముందుగా క‌ల‌బంద‌లోని జెల్‌ను సెప‌రేట్ చేసుకుని రోట్లోనో లేదా మిక్స‌ర్‌లోనో వేసుకుని పేస్ట్‌లాగా చేసుకోండి. 

ఆ త‌ర్వాత ఒక వెల్లుల్లి పాయ పొట్టు తీసేసి దాన్ని ఈ క‌ల‌బంద పేస్ట్‌తో క‌లిపి బాగా మిక్స్ చేయండి. 

ఇప్పుడు ఈ మిశ్ర‌మానికి టేబుల్ స్ఫూన్ లేదా అర స్ఫూన్ ప‌సుపు అంటే మ‌న ఒంటిపై ఉండే లిపోమా గ‌డ్డ‌ల ప‌రిణామం బట్టి క‌లిపి బాగా మిక్స్ చేయండి. 

ఇలా చేసిన రెమెడీని మ‌నం వారం రోజుల పాటు వాడొచ్చు.ఇప్పుడీ మిశ్ర‌మాన్ని  మ‌న శ‌రీరంపై క‌ణ‌త‌లు ఎక్క‌డైతే ఉన్నాయో అక్క‌డ బాగా మందంగా ప‌ట్టించి  ఒక 30 నుంచి 45 నిమిషాల వ‌ర‌కు  ఉంచాలి. 

అయితే ఒక్క‌టి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మిశ్ర‌మాన్ని అప్లై చేసేముందు వేడి చేయండి. అలా వేడిచేస్తేనే అది బాగా ప‌నిచేస్తుంది. 

ఇలా డైలీ రెండు సార్లుగా వారం రోజుల పాటు అప్లై చేస్తే లిపోమా గ‌డ్డ‌లు త్వ‌ర‌గా క‌రిగిపోతాయి. మ‌ళ్లీ వ‌చ్చే అవ‌కాశం కూడా ఉండ‌దు.

2

ఇక రెండో రెమెడీ గురించి తెలుసుకుందాం..

ఈ రెమెడీ చేసేందుకు మ‌న‌కు కావాల్సిన  మొక్క పేరు రెడ్డివారి నానుబాలుగు లేదా ప‌చ్చ‌బొట్ల చెట్టు. 

ఈ మొక్క లిపోమా గ‌డ్డ‌ల‌ను క‌రిగించ‌డంలో ఒక దివ్యావుష‌ధం అని చెప్పుకోవ‌చ్చు. ఈ మొక్క కొమ్మ‌ను తుంచిన‌ప్పుడు పాల‌లాంటి ప‌దార్థం బ‌య‌ట‌కు వ‌స్తుంది.

 ఆ పాల‌ను మ‌న‌కు ఎక్క‌డైతే లిపోమా గ‌డ్డ‌లుంటాయో అక్క‌డ బాగా రుద్దుకోవాలి. 

ఇలా కొంత‌కాలంపాటు చేసిన‌ట్ల‌యితే లిపోమా గ‌డ్డ‌లు ఈజీగా క‌రుగుతాయి.

3

ఇక మూడో రెమెడీలో మ‌న‌కు కావాల్సింది మున‌గ చెట్టు బెరుడు..మ‌నంద‌రికి అందుబాటులో ఉండేది. 

ఈ బెరుడును తీసుకుని మిక్స‌ర్‌లోనో, రోట్లోనో వేసి బాగా పొడిలాగా చెయ్యాలి. ఆ పొడి ఒక గంధం మాదిరిగా త‌యారువుతుంది. 

ఈ పొడిని మ‌న శ‌రీరంపై ఉండే లిపోమా గ‌డ్డ‌ల‌పై ప్ర‌తిరోజూ రాసుకుంటూ ఉండాలి. ఇలా కొన్నాళ్ల త‌ర్వాత దాని ఫ‌లితం మ‌న‌కు క‌న్పిస్తుంది. 

ఇంకో ప‌ద్ద‌తిలో ఈ మున‌గ చెట్టు బెర‌డుల‌ను నీటిలో వేసి ఆ నీరు స‌గం అయ్యేదాకా మ‌ర‌గించాలి. 

ఇప్పుడా ఆ నీటిని వ‌డ‌గ‌ట్టి వేరుచేసి తాటిబెల్లం అందులో క‌ల‌పాలి. ఈ ద్రావాణాన్ని ప్ర‌తిరోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి.

 ఇలా రెండునెల‌ల పాటు చేసిన‌ట్ల‌యితే మ‌నం ర‌క్తంలో ఉండే చెడుప‌దర్థాల‌ను తొల‌గించి, వ్య‌ర్థంగా ఉండే కొవ్వును కూడా క‌రిగిస్తుంది.

4

అలాగు నాల్గో రెమెడీలో మ‌న‌కు కావాల్సిన ప‌దార్థాలు మందార‌పు ఆకు, జామాయిల్ ఆకు. ఈ రెండు ఆకుల‌ను బాగా మిక్స్ చేసి పేస్టేలాగా చేసి మీ శ‌రీరంపై ఉండే క‌ణుతుల‌పై రాస్తూ ఉంటే  ఈ లిపోమా గ‌డ్డ‌లు క్ర‌మేపీ క‌నుమ‌రుగ‌వుతాయి.

వీటితో పాటు మ‌నం తినే ఆహారంలో కొన్ని ప‌ద్ధ‌తులు పాటించ‌డం ద్వారా ఈ క‌ణుతులు ఏర్ప‌డ‌కుండా ముందుగానే కంట్రోల్ చేయొచ్చు. 

ముఖ్యంగా చేదుగా ఉండే ప‌దార్థాల‌ను మ‌న ఆహారంలో తీసుకుంటే మంచిది. కాకర‌కాయ‌, వేపాకు ర‌సం వంటివి మ‌న రోజూవారీ డైట్‌లో తీసుకుంటే చాలా మంచిది.

 అలాగే ప‌చ్చికూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, పండ్లు ఎక్కువ‌గా మీ డైట్‌లో ఉండేలా చూసుకోండి. 

ఇలా తీసుకున్న‌ట్ల‌యితే మీకు పౌష్టికాహారం ల‌భించి కొవ్వు చేర‌డానికి ఛాన్స్ ఉండ‌దు.

మేం ఇప్ప‌టిదాకా చెప్నిన హోమ్ రెమెడీస్ అలాగే ఆహార‌ప‌ద్ద‌తులు ఒక‌టి రెండు రోజుల పాటు పాటించి వ‌దిలేయ‌కుండా లాంగ్‌ర‌న్ లో ఉప‌యోగిస్తే మీకు క‌చ్చితంగా  మార్పు క‌న్పిస్తుంది.  

అలాగే ఈ వీడియో మీకు  న‌చ్చిన‌ట్ల‌యితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త‌వారు ఎవ‌రైనా మా ఛాన‌ల్‌లో వీడియోలు చూస్తున్నట్ల‌యితే స‌బ్‌స్క్రైబ్ చేస్కోండి. 

అప్పుడే మీకు ఉప‌యోగ‌ప‌డే ఇలాంటి మ‌రిన్ని వీడియోలు చేసేందుకు మాకు మోటివేష‌న్‌గా ఉంటుంది. 

అలాగే ప‌క్క‌నే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక‌పై మేము చేసే వీడియోల నోటిఫికేష‌న్లు వ‌స్తుంటాయి. మ‌రి లేటేందుకు ఇప్పుడే ఆ ప‌ని చేసేయండి. బై..

Leave your vote

-1 Points
Upvote Downvote
More

Previous articleకాళ్ళు చేతులలో తిమ్మిర్లు వస్తున్నాయా.. ఎందుకు వస్తున్నాయో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు
Next articleగ‌ర్భం వ‌చ్చేముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు | Early Signs of Pregnancy in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here