పరిటాల రవి బయోగ్రఫీ | Paritala Ravi Biography in Telugu

360
0
పరిటాల రవి బయోగ్రఫీ | Paritala Ravi Biography in Telugu | Paritala Ravi Real Life Story
పరిటాల రవి బయోగ్రఫీ | Paritala Ravi Biography in Telugu | Paritala Ravi Real Life Story

పరిటాల రవి బయోగ్రఫీ

రాయలసీమ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షనిజం గుర్తుకు వచ్చేది.. ఫ్యాక్షనిజం అంటే పరిటాల రవీంద్ర ఫ్యామిలీ గుర్తుకు వచ్చేలా ఎన్నో సంఘటనలు జరిగాయి. పరిటాల రవి తండ్రి శ్రీరాములు మరియు ఆయన సోదరుడు ఇంకా ఎంతో మంది సన్నిహితులు మద్దతుదారులు ఫ్యాక్షన్ గొడవల్లో కన్నుమూశారు. రాయలసీమ ఫ్యాక్షనిజంను నెక్ట్స్ లెవల్ కు ఆ సమయంలో రెండు వర్గాల వారు తీసుకు వెళ్లారు. ఫ్యాక్షన్ లో అడుగు పెడితే మరణం తప్పదు అన్నట్లుగా అప్పట్లో టాక్ ఉండేది. అంతటి ఫ్యాక్షనిజం ఉన్న రాయలసీమ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది కాని అప్పటి రక్తపు మరకలు ఇంకా ఉన్నాయనడంలో సందేహం లేదు. పరిటాల రవి మరియు మద్దెల చెరువు సూరిల కుటుంబాలతో పాటు ఇంకా ఎంతో మంది కుటుంబాలు తమ వారిని కోల్పోయి జీవితాన్ని గడుపుతున్నారు. అత్యంత కర్కశంగా రాయలసీమ హత్యలు జరుగుతున్న సమయంలో పరిటాల రవి శాంతి కోసం ప్రయత్నాలు చేశాడు అంటూ ఆయన మద్దతుదారులు చెబుతూ ఉంటారు. పరిటాల రవి చేసిన ప్రయత్నాలు సఫలం కాకుండా ప్రత్యర్థి వర్గం వారు వరుసగా దాడులు చేస్తూ ఉండటం వల్ల రాయలసీమ రతనాల సీమగా కాకుండా రక్తం పారే సీమగా మారింది అంటారు పరిటాల రవి మద్దతుదారులు. పరిటాల రవి నక్సల్స్‌ ఉద్యమం వదిలి జన జీవన స్రవంతిలో కలిసిన సమయంలో రాజకీయాల్లో అడుగు పెట్టి ప్రజలకు మంచి చేయాలని చాలా ఆశ పడ్డాడు. కాని అక్కడ కూడా ఆయన్ను సరిగ్గా పని చేయనివ్వలేదు అనేది పరిటాల రవి అనుచరుల వాదన. రాయల సీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్న ఫ్యాక్షన్ గొడవలకు స్వస్థి చెప్పేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావని అంటూ ఉంటారు. ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన ఫ్యాక్షన్ గొడవల వల్లే పరిటాల రవి కూడా కన్నుమూశారు. తనం తండ్రి మరియు సోదరుడి తరహాలోనే పరిటాల రవి కూడా ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురి అయ్యాడు. ఒక ఫ్యాక్షన్ లీడర్ గా పరిటాల రవిని జనాలు చూడలేదు. అందుకే పరిటాల చనిపోయిన సమయంలో రాయలసీమలో మెజార్టీ జనాలు కన్నీరు పెట్టుకున్నారు అనడంలో సందేహం లేదు. అంతటి అభిమానంను దక్కించుకున్న పరిటాల రవి మంత్రిగా ఉన్న సమయంలో మరియు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాయల సీమకు చేసిన అభివృద్దిని ఏ ఒక్కరు మర్చిపోలేరు. రాయల సీమ అంటే ఉన్న ఒక చెడు అభిప్రాయంను తొలగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు చాలానే ఉన్నాయి. 20 ఏళ్ల వయసు నుండే జనాల్లో ఉండి.. జనాల కోసం తండ్రి బాటలో నడిచిన పరిటాల రవి 46 ఏళ్ల వయసులోనే ఫ్యాక్షన్‌ తూటాకు బలి అయ్యాడు. ఏ ఫ్యాక్షన్ ను అయితే తాను నడిపించాడో అదే ఫ్యాక్షన్‌ కు పరిటాల రవి చనిపోయాడు.. ఆయనలా ఎంతో మంది ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయారు అంటూ కొందరు పరిటాల ప్రత్యర్థులు అంటూ ఉంటారు. పరిటాల చనిపోయే వరకు ప్రజల్లోనే ఉన్నాడు.. ప్రజల కోసం పీపుల్స్‌ వార్ లో జాయిన్ అయ్యాడు.. ఆ తర్వాత కమ్యూనిస్టు భావజాలంతో పని చేశాడు.. చివరకు తెలుగు దేశం పార్టీలో కూడా పని చేశాడు. పరిటాల రవి మరియు ఆయన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా మోహన్‌ బాబు ప్రథాన పాత్రలో శ్రీరాములయ్య సినిమా రూపొందిన విషయం తెల్సిందే. ఆ సినిమాను స్వయంగా పరిటాల రవి నిర్మించగా ఎన్‌ శంకర్ దర్శకత్వం వహించాడు. సౌందర్య ఆ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ సినిమాలో శ్రీరాములయ్య భూ పోరాటం గురించి ప్రథానంగ చూపించడం జరిగింది. ఈతరంతో పాటు రాబోయే తరాల వారు కూడా తెలుసుకోవాల్సిన పరిటాల రవి పూర్తి జీవితాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయితీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో 1958 ఆగస్టు 30వ తారీకున పరిటాల శ్రీరాములు మరియు నారాయణమ్మ దంపతులకు పరిటాల రవి జన్మించాడు. పరిటాల రవి తండ్రి శ్రీరాములు భూ పోరాటంలో పాల్గొన్నారు. భూస్వామ్యులు మరియు ఫ్యాక్షనిస్టుల వద్ద ఉన్న వందల వేల ఎకరాల భూములను బడుగు బలహీన వర్గాల వారికి ఇప్పించేందుకు శ్రీరాములయ్య ఉద్యమం చేశారు. ఆ సమయంలో ఆయన పీపుల్స్ వార్‌ పార్టీకి చేరువ అయ్యాడు. పేదల కోసం పోరాటం సాగిస్తున్న పరిటాల శ్రీరాములును హత్య చేయడంతో రాయల సీమ హత్యా రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పీపుల్స్ పార్టీకి సానుభూతిపరుడు అయిన పరిటాల శ్రీరాములు హత్య కేసులో అప్పటి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రథాన నింధితుడిగా ఉన్నాడు. దాంతో పీపుల్స్ వార్‌ పార్టీ ఎమ్మెల్యే నారాయన రెడ్డిని హత్య చేసింది.

ఆ హత్య కేసులో ప్రథాన నింధితుడిగా పరిటాల రవి ఉన్నట్లుగా పోలీసులు కేసు బుక్ చేశారు. అలా పరిటాలపై హత్య కేసు నమోదు అయ్యింది. పరిటాల శ్రీరాములు బాటలోనే ఆయన తనయుడు భూ పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థులు అతడిని కూడా అత్యంత దారుణంగా హత్య చేశారు. తండ్రి మరియు సోదరుడి హత్యతో పరిటాల రవి చలించి పోయాడు. అయితే ఆ సమయంలో తల్లి మరియు కుటుంబంకు తోడు ఉండాలనే ఉద్దేశ్యంతో కొన్నాళ్ల పాటు సైలెంట్‌ గా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా మారాడు. అదే సమయంలో జరిగిన కొన్ని హత్య కేసుల్లో పరిటాల రవి ప్రథాన నింధితుడిగా ఉన్నాడు. దాంతో బెంగళూరుతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో రహస్యంగా తలదాచుకున్నాడు.

పీపుల్స్ వార్‌ లో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిటాల రవి 1992 లో జిల్లా S.P కెప్టెన్ కె. వి. రెడ్డి సమక్షంలో పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసుల ఎదుట లొంగి పోయి సామాన్య జీవనం సాగించాలని పరిటాల రవి భావించాడు. ఆ సమయంలో కూడా ప్రజలకు ఏదైనా చేయాలని భావించి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. జన జీవన స్రవంతిలో కలిసిన వెంటనే క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు పరిటాల. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఓబులరెడ్డి అరాచకాలను బహిరంగంగా ఎదురించిన మొదటి వ్యక్తి మాజీ తీవ్రవాది అయిన  షాక్ ముష్కిన్, పరిటాల రవికి అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు. అన్నగారు ఎన్టీ రామారావు గారి ఆహ్వానం మేరకు 1993 జూన్ 7న రవి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆ సమయంలో ఒక్క అనంతపురం జిల్లా మాత్రమేగాక మొత్తం రాయలసీమకు చెందినా టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులు పరిటాల రవీంద్రకు బ్రహ్మరధం పట్టారు.

పరిటాల రవి తెలుగు దేశం పార్టీ లో జాయిన్ అయిన కొన్నాళ్లకే అంటే 1993 అక్టోబరు 24న మద్దల చెరువు గ్రామంలో టి.వి బాంబు సంఘటన జరిగింది. ఆ సంఘటన మొత్తం రాష్ట్రం ఉలిక్కి పడేలా చేసింది. ఆ ఘటన పరిటాల రవి పై కొందరిలో వ్యతిరేకత వచ్చేలా చేసిందని కూడా అంటూ ఉంటారు.  ఆ పేళుడులో సూరి తమ్ముడు రఘునాధరెడ్డితో సహా ఆరుగురు చనిపోయారు. ఆ పేళుడుకు  ప్రధాన కారకుడు పరిటాల రవేనని కాంగ్రెస్ నాయకులు విమర్శల వర్షం కురిపించారు. మద్దల చెరువు గ్రామంలో బాంబు పేళుడు సంఘటనతో పాటు హైదరాబాద్ లో కూడా ఒక బాంబు పేళుడు సంఘటన జరగడం అందులో పలువురు మృతి చెందడటం జరిగింది. ఆ బాంబు పేళుడుకు కూడా పరిటాల రవి భాగస్వామ్యం ఉందని పోలీసులు నిర్థారించారు. ఆసమయంలో పరిటాల రవి అరెస్టు అయ్యి జైలుకు వెళ్లాడు. ఆ సమయంలోనే వచ్చిన ఎన్నికల్లో పరిటాల రవి పోటీ చేయడం జరిగింది.  

జైలునించే పరిటాల రవి నామినేషాన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో పరిటాల రవి పలు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. వాటన్నింటిని దాటుకున్న పరిటాల రవి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన మొదటి సారే పరిటాల రవికి ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కార్మికశాఖ మంత్రి పదవి దక్కింది.. ఆ తర్వాత కాలంలో అనంతపురం జిల్లా చరిత్ర లో పరిటాల రవీంద్ర పేరు నిలిచి పోయేలా ఆయన జర్నీ సాగింది. అధికార బలంతో శత్రుసంహారం సాగిస్తాడని విమర్శలు చేసిన ప్రత్యర్థలు నోరు మూసుకునేలా పరిటాల రవి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాడు. వివిధ గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మద్య రాజి కుదిర్చాడు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాడు… ఫ్యాక్షనిస్టులు లేకుండా మొత్తం జల్లెడ పట్టినట్లుగా వెదికాడు. మొత్తంగా జిల్లా అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాడు. ఎన్టీఆర్ ను దించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదివిని చేపట్టారు. ఆ సమయంలో తెలుగు దేశం పార్టీ కొత్త తరం అయిన చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచాడు. పరిటాల రవి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచి సత్తా చాటాడు.

1997 లో తన తండ్రి జీవితకథ ఆధారంగా స్నేహలత పిక్చర్స్ పతాకం కింద “శ్రీరాములయ్య” చిత్రం నిర్మాణం చేపట్టాడు. నవంబరు 19న సినిమా ముహూర్తం సందర్భంగా జరిగిన కారుబాంబు పేలుడుతో తీవ్రంగా గాయపడిన పరిటాల రవి ప్రాణాలతో బైటపడ్డాడు. ఆ బాంబు బ్లాస్ పరిటాల రవి కోసం ప్లాన్ చేసిందే. అయితే ఆ సమయంలో తప్పించుకున్నాడు అనేది నింధితుల మాట. ఈ దుర్ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.పరిటాల రవిని హతమార్చేందుకు మద్దలచేరువు సూరి, అతని అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడయింది. సూరితో సహా కారు బాంబు నిందుతులందరినీ పోలీసులు గావించి పట్టుకున్నారు.న్యాయస్థానం దాదాపుగా అందరికీ యావజ్జీవ శిక్ష విధించింది.

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మరియు సాదారణ రాజకీయ నేతగా ఉన్నప్పుడు కూడా పరిటాల రవి రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్ ను ప్రాలదోలేందుకు సామూహిక వివాహాలు చేయడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. 2004 సంవత్సరంలో వైఎస్సార్ ప్రభంజనంలో పరిటాల రవి ఓడి పోయాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉందని పదే పదే ప్రభుత్వంకు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోలేదు. పైగా ఉన్న సెక్యూరిటీని కుదించి ఆయనకు మరింతగా హాని కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించింది అంటూ టాక్. 2005 జనవరి 24వ తేదిన అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో పార్టీ ముఖ్యలు రావడంతో మీటింగ్ కు పరిటాల రవి హాజరు అయ్యాడు. అనేక మంది అతిరథమహరధులు వంటి పార్టీ రాష్ట్ర నాయకులు అక్కడే ఉన్నారు.

సాయుధలైన అనేకమంది అంగరక్షకులున్నారు. వందల మంది కార్యకర్తలు మరియు పోలీసు వర్గాలు ఉన్న నేపథ్యంలో మధ్యహ్న భోజనం ముగించుకుని పార్టీ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుదామని  బయట అడుగు పెట్టిన సమయంలో పరిటాల రవిపై మొద్దు శ్రీను బులెట్ల వర్షం కురిపించాడు. పోలీసులు మరియు పరిటాల వ్యక్తిగత సెక్యూరిటీ మరియు పార్టీ నాయకులు ఇంకా కార్యకర్తలు ప్రతి ఒక్కరు చూస్తుండగానే నిమిషాల్లోనే పరిటాల రవి హత్య గావించబడ్డాడు. రాయలసీమ అభ్యున్నతి కోసం.. భూపోరాటాలు సాగించిన పరిటాల రవి అశువులు బాషాడు. పరిటాల రవి హత్య అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

పరిటాల రవి హత్య అంతకు ముందు జరిగిన సంఘటనలు మరియు ఆ తర్వాత జరిగిన సంఘటనలను వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ రక్త చరిత్ర 1 మరియు రక్త చరిత్ర 2 అంటూ సినిమాలను తీశాడు. పరిటాల రవి పాత్రను సినిమాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబేరాయ్ పోషించాడు. సూరి పాత్రను సూర్య చేశాడు. పరిటాల రవి వారసత్వంతో పరిటాల శ్రీరామ్‌ రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా అసెంబ్లీ లో అడుగు పెట్టడానికి పరిటాల శ్రీరామ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజకీయంగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన పరిటాల రవి హత్య గావించబడటం ఖచ్చితంగా రాయలసీమకు పెద్ద లోటు అనడంలో సందేహం లేదు.

Leave your vote

More

Previous articleద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బయోగ్రఫీ | Dwarampudi Chandrasekhar Reddy Biography
Next articleఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ బయోగ్రఫీ | Bipin Rawat Biography in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here