ఆర్ఆర్ఆర్ రివ్యూ… కళ్ల ముందు అద్బుతం
నాలుగు సంవత్సరాలుగా జక్కన్న దర్శకత్వంలో ఎన్టీఆర్ మరియు చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా అంటూ ఆర్ ఆర్ ఆర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు జనాలు. కరోనా ఇతరత్ర కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. 2020 సంవత్సరం లో ఖచ్చితంగా విడుదల చేస్తానంటూ ప్రకటించిన జక్కన్న రెండేళ్లు ఆలస్యంగా విడుదల చేశాడు. ప్రపంచం మొత్తం ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ : గోండు జాతి కాపరి అయిన కొమురం భీమ్ (ఎన్టీఆర్) మరియు బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ అయిన (రామ్ చరణ్) బద్ద శత్రువులగా మొదట తలపడి.. ఆ తర్వాత వారి మద్య స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహితులు ఇద్దరు బ్రిటీష్ పై యుద్దం చేస్తారు. ఆ యుద్దం ఏ స్థాయి లో వారు చేశారు? వారిద్దరు కలిసిన నాటకీయ పరిణామాలు ఏంటీ అనేది సినిమా కథ.
నటీనటుల నటన :
ఈగతో కూడా అద్బుతంగా నటించగల సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. అలాంటి రాజమౌళి ఎలాంటి నటుడితో అయినా తనకు కావాల్సింది పిండుకుంటాడు అనడంలో సందేహం లేదు. ఒకసారి సరిగా రాకుంటే రెండవ సారి రెండవ సారి సరిగా రాకుంటే… పదుల సార్లు కూడా మొహమాటం లేకుండా రీటేక్ లు చేయిస్తూనే ఉంటాడు. కనుక ఇద్దరి హీరోల నటన కూడా కెరీర్ బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాత్రల కోసం వారు మారిన తీరు అద్బుతం. ఒక హీరో గ్రేట్ మరో హీరో తక్కువ అనే టాపిక్ ఎక్కడ రాకుండా దర్శక ధీరుడు జాగ్రత్త పడ్డాడు. ప్రతి హీరోకు ది బెస్ట్ సన్నివేశాలు పడ్డాయి.. వాటిల్లో అద్బుతమైన యాక్టింగ్ తో అదరగొట్టారు. ఆలియా భట్ లుక్స్ తో పాటు నటనతో కూడా వావ్ అనిపించింది. అజయ్ దేవగన్ మరియు శ్రియ శరన్ ల నటన కూడా చాలా బాగుంది. వీళ్లు మాత్రమే కాకుండా ఎక్కడో ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టులను పరిశీలించినా కూడా ది బెస్ట్ ఔట్ పుట్ ను వారు ఇచ్చారు అనడంలో సందేహం లేదు.
టెక్నికల్ :
ఇండియాస్ గ్రేటెస్ట్ టెక్నీషియన్ గా ఇప్పటికే రాజమౌళికి పేరు పడి పోయింది. ఈ సినిమా తో ఆయన మరో సారి తన యొక్క గొప్పతనంను మాటలతో కాకుండా చేతలతో చెప్పాడు. అద్బుతమైన తన డైరెక్షన్ పని తీరు.. మరియు అంత భారీ తారాగణం మరియు టెక్నికల్ టీమ్ ను లీడ్ చేయడం అద్బుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతర టెక్నికల్ అంశాలు అన్ని కూడా హై స్టాండర్స్ లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా అది జక్కన్న యొక్క గొప్పతనం అనడం లో సందేహం లేదు. కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. ఇక ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒల్లు గగుర్లు పొడిచే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ మాయాజాలం కనిపించింది. విజువల్స్ ను అద్బుతమైన విజనరీతో చిత్రీకరించినట్లుగా అనిపించింది. నిర్మాణాత్మక విలువల గురించి ఎంత మాట్లాడుతుకున్న తక్కువే అవుతుంది. ఎడిటింగ్ కొన్ని సన్నివేశాల్లో చేసే అవకాశం ఉంది. మూడు గంటలకు పైగా ఉన్న సినిమా లోని కొన్ని ల్యాగ్ సీన్స్ ను కట్ చేసి ఉండవచ్చు. మొత్తంగా పర్వాలేదు అనుకోచ్చు.
ప్లస్ పాయింట్స్ :
హీరోల నటన,
రాజమౌళి దర్శకత్వం, స్క్రీన్ ప్లే,
విజువల్ ఎఫెక్ట్స్,
సినిమాటోగ్రఫీ,
యాక్షన్ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్ :
హీరోయిన్ స్క్రీన్ స్పేస్,
సెకండ్ హాఫ్ కాస్త స్లో అయ్యింది
విశ్లేషణ :
జక్కన్న సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్రం మొదలు పెట్టినప్పటి నుండి కూడా అద్బుతాన్ని జక్కన్న ఆవిష్కరించబోతున్నాడు అంటూ అంతా చాలా నమ్మకంగా అనుకున్నారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. ప్రతి ఒక్కరి విజనరీ ని.. అంచనాలను జక్కన్న అందుకునేలా ఈ సినిమాను తెరకెక్కించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అద్బుతమైన విజువల్స్ తో సినిమా చూస్తున్న ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకు వెళ్లినట్లుగా జక్కన్న చేశాడు. ఇక ఇద్దరు స్టార్ హీరోలను ఈయన ఎలా మేనేజ్ చేస్తాడో అంటూ అంతా అనుకున్నారు. ఆ విషయం లో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. ఇద్దరు హీరోలకు సమానమైన స్క్రీన్ టైమ్.. ప్రాముఖ్యత అన్నట్లుగా కాకుండా కథానుసారంగా వారి వారి పాత్రలు ఉన్నాయి. ఏ ఒక్కరిని తగ్గించినట్లుగా అనిపించలేదు. ముఖ్యంగా ఇద్దరు హీరోల కాంబో సన్నివేశాలు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడికి కూడా కన్నుల విందు అనడంలో సందేహం లేదు.
రేటింగ్ : 3.75/5.0
RRR Movie Review By Aadhan: https://youtu.be/uEOeKMAcFSo
GIPHY App Key not set. Please check settings