హైదరాబాద్‌లోని Top 10 Cardiologists వీరే..
Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.
ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా.. మెట్లెక్కినా.. ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం.. ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. గుండె జబ్బుకు ఆడ, మగ భేదా లు లేవు. ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది. అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడయ్యింది. గుండెపోటుకు గురయ్యే వారిలో చెయ్యి లాగేయడం, ఊపిరి అందకపోవడం, చమట పట్టడం, వికారంగా ఉండ డం వంటి లక్షణాలు స్త్రీపురుషులిద్దరిలోనూ కనపడతాయని తెలుస్తోంది. అయితే ఇలాంటి గుండె సంబంధిత లక్షణాలు కలిగిన వారంతా హైదరాబాద్ మహానగరంలోని Top 10 Cardiologists సంప్రదించడం బెటర్. అయితే హైదరాబాద్‌లోని Top 10 Cardiologists ఎవరు..? వారిని ఏలా సంప్రదించాలి..? వారి ప్రత్యేకతలు ఏంటి..? అనే తదితర వివరాలతో వీడియో రూపొందించాము. ఈ వీడియోను పూర్తిగా చూసి Top 10 Cardiologistsను సంప్రదించి మీ గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.
ఇకపోతే Top 10 ప్లేస్‌లో Dr P Rajendra Kumar Jain ఉన్నారు. ఈయన కార్డియాలజీ రంగంలో సుదీర్ఘ అనుభవం సంపాదించారు. Dr. Rajendra Kumar Jain హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని పలు ఆస్పత్రుల్లో 23 సంవత్సరాలుగా కార్డియాలజీ సేవలు అందిస్తున్నారు. ఈయన 1987లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, 1991లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎండీబీఎస్ కంప్లీట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 1996లో కార్డియాలజీలో డీఎం పూర్తి చేశారు. Dr. Rajendra Kumar Jain అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ, అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉన్నారు. Dr. Rajendra Kumar Jain ప్రధానంగా గ్యాస్ట్రిటిస్ ట్రీట్‌మెంట్, ఛాతినొప్పి చికిత్స, హైపర్ కొలెస్టెరోలేమియా ట్రీట్‌మెంట్, పెటెంట్ డక్టస్ ఆర్ట్రియోసస్ డివైజ్ క్లోజర్, డైస్లిపిడెమియో తదితర విభాగాల్లో ప్రత్యేక అనుభవం సంపాదించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.500 తీసుకుంటారు.
Adress
KIMS – Krishna Institute of Medical Sciences
1-8-31/1, Minister Road,
Krishna Nagar Colony, Begumpet,
Landmark: Near Krishna Nagar Colony, Hyderabad
Contact Number: 040 6782 2362
ఇకపోతే 9వ ప్లేస్‌లో Dr. Sudhir Ramachandra Naik ఉన్నారు. ఈయన తెలంగాణలోని అత్యుత్తమ కార్డియాలజిస్టుల్లో ఒకరు. Dr. Sudhir Ramachandra Naik కార్డియాలజీ రంగంలో 38 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. 1977లో డబ్ల్యూహెచ్‌ఓలో ఫెలోగా కేరీర్‌ను మొదలుపెట్టారు. 1978 నుంచి 1999 వరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో కార్డియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2006 నుంచి అపోలో హాస్పిటల్స్‌లో కార్డియాలజీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1977లో డబ్ల్యూహెచ్ఓ ఫెలోషిప్ ఆఫ్ కార్డియో వాస్కులర్ డీసీజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఐసా నుంచి గోల్డ్ మెడల్, 1979లో కల్ వాఘ్రే ఒరేషన్ అవార్డు, 1983లో మరో గోల్డ్ మెడల్, 1988లో డాక్టర్ భలే రావు ఒరేషన్ అవార్డులను అందుకున్నారు. 1988లో రోటరీ ఇంటర్నేషనల్ అవార్డు ఆఫ్ బెస్ట్ మెడికల్ క్యాంప్ అవార్డును తీసుకున్నారు. Dr. Sudhir Ramachandra Naik ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నాం 1 గంట నుంచి రాత్రి 11.45 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజు రూ.500 ఛార్జ్ చేస్తారు.
Address:
Apollo Hospitals,
Road Number 72,
Landmark: Opposite to Bharatiya Vidya Bhavan School Lane & Near Film Nagar,
Hyderabad
Contact Number: 1860 500 4916
ఇకపోతే 8వ ప్లేస్‌లో Dr. Pratap Chandra Rath ఉన్నారు. ఈయన అత్యుత్తుమ కార్డియాలజిస్టుల్లో ఒకరు. ఈయనకు వైద్య సేవలు అందించడంలోనే కాదు. బోధన, పరిశోధనా రంగాల్లోనూ సుదీర్ఘ అనుభవం ఉంది. తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఎంతోమంది పీహెచ్‌డీ విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించారు. కార్డియాలజీ రంగంలో Dr. Pratap Chandra Rath దాదాపు 37 సంవత్సరాలకు పైగా అనుభవం సంపాదించారు. 2003-2004 మధ్యకాలంలో ఇండియన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ అధ్యక్షులుగా వ్యవహారించారు. దాంతో పాటు ఇండియన్ కార్డియాలాజికల్ సొసైటీకి సంబంధించిన ఇంటర్వేన్షనల్ కౌన్సిల్ సమావేశానికి చైర్మన్‌గానూ వ్యవహరించారు. ఇంతటి సుదీర్ఘ కాలంలో Dr. Pratap Chandra Rath అబ్ మిశ్రా అవార్డు, తిలక్ అవార్డులతో పాటు మరికొన్ని అవార్డులను అందుకున్నారు. ఎన్నో పుస్తకాలను ప్రివ్యూ చేయడంతో పాటు మరికొన్ని ప్రచురణలను ప్రచురించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా పలు ఫెల్‌షిప్‌లో భాగస్వాములయ్యారు. మరి ప్రధానంగా రోగులకు చికిత్స చేసే సమయంలో వారిపట్ల ఎంతో కేరింగ్ తీసుకుంటారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజు రూ.1500 తీసుకుంటారు.
Address:
Apollo Hospitals,
Road Number 72,
Landmark: Opposite to Bharatiya Vidya Bhavan School Lane & Near Film Nagar,
Hyderabad.
Contact Number: +91 40395 65006
ఇకపోతే 7 ప్లేస్‌లో Dr. Pramod Kumar K ఉన్నారు. ఈయనకు కార్డియాలజీ రంగంలో 23 సంవత్సరాల సుదీర్గ అనుభవం ఉంది. 1989లో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, 1994లో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ కంప్లీట్ చేశారు. 1998లో లక్నోలోని కింగ్ జార్జెస్ మెడికల్ కాలేజీలో కార్డియాలజీ విభాగంలో డీఎం పూర్తి చేశారు. 2015లో తమిళనాడు ఆలగప్ప యూనివర్సిటీ నుంచి హాస్పిటాలిటీ మెనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం విజయవాడ జనరల్ హాస్పిటల్, హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోనూ పనిచేశారు. వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హాస్పిటల్ సెంటరు, హైదరాబాద్‌లోని ఉషా మూళ్లపూడి హాస్పిటల్, అపోలో హాస్పిటల్‌లో కార్డియాలజీ విభాగంలో తన అరుదైన వైద్య సేవలను అందించారు. Dr. Pramod Kumar K ఫెలో అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ, యూరోపియన్ సోసైటీ ఆఫ్ కార్డియాలజీ, యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ పీసీఐలలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకు 50 ఆర్టికల్స్ ప్రచురణ అయ్యాయి.
Address:
Yashoda Hospitals
SECUNDERABAD
Alexander Road,
Secunderabad, Hyderabad – 500003
Contact Number: +91 40 – 4567 4567
ఇకపోతే 6 ప్లేస్‌లో Dr. Raghu C ఉన్నారు. ఈయనకు దాదాపు 20 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. దేశంలోని అత్యుత్తమ కార్డియాలజిస్టుల్లో Dr. Raghu C ఒకరు. ఇప్పటివరకు 30వేలకు పైగా డయాగ్నోస్టిక్ కాథెటరైజేషన్ చేశారు. దాంతో పాటు 14వేలకు పైగా యాంజియోప్లాస్టీ ట్రీట్‌మెంట్ చేశారు. పారిస్‌లో 1999లో ఉత్తమ క్లినికల్ పరిశోధనలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈయన కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆసియా పసిఫిక్ సొసైటీ ఆఫ్ ఇంటర్వేన్షనల్ కార్డియాలజీలతో పాటు మరికొన్ని సంస్థల్లోనూ సభ్యుడిగా ఉన్నారు. Dr. Raghu C 1991లో గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి 1994లో జనరల్ మెడిసిన్‌లో ఎండీ, నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 1998లో కార్డియాలజీలో డీఎం, పారిస్‌లోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఫెలోషిప్‌ను 2002లో కంప్లీట్ చేశారు. Dr. Raghu C ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.500 తీసుకుంటారు.
Address:
Aster Prime Hospitals
Plot Number 4, Satyam Theatre Road,
Srinivasa Nagar,
Landmark: Behind Mythrivanam Building & Beside Blue Fox Hotel, Hyderabad
Contact No: 040 4959 4959
ఇకపోతే 5 ప్లేస్‌లో Dr M Sai Sudhakar ఉన్నారు. ఈయన దేశంలోని అత్యుత్తమ కార్డియాలజిస్టుల్లో ఒకరిగా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలోనే 10వేల కంటే ఎక్కువ యాంజియోప్లాస్టీ ట్రీట్‌మెంట్ కేసులను విజయవంతంగా పూర్తి చేశారు. దేశంలోని విజయవంతమైన కార్డియాలజిస్టుల్లో Dr M Sai Sudhakar ఒకరు. మొదటగా ఈయన అమెరికా న్యూయార్క్‌లోని పలు హాస్పిటల్స్‌లో పనిచేశారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చాక అపోలో హాస్పిటల్స్‌తో కలిసి పనిచేశారు. అదే సమయంలో యూరప్, లండన్, యూఎస్ఏలోని ప్రఖ్యాత సంస్థల నుంచి కార్డియాలజీలో ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను అభ్యసించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రయోజనం చేకూర్చే మూలకణ చికిత్సపై అనేక పరిశోధనలు చేశారు. కార్డియాలజీకి సంబంధించి ఆయన రాసిన అనేక వ్యాసాలు మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 2007లో 59వ యానువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి సీఎస్ఐ ట్రావెల్ అవార్డును అందుకున్నారు. అదే సంవత్సరంలో ఏవీ గాంధీ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కార్డియాలజీలో రూ.75వేల నగదును రీసెర్చ్ గ్రాంట్‌గా అందుకున్నారు.
Address:
6-1-1070/1 to 4,
Lakdi-ka-pul,
Hyderabad – 500 004,
Telangana
Contact Number: +91 8101108108
ఇకపోతే 4 ప్లేస్‌లో Dr Anil Krishna G ఉన్నారు. ఈయన నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లె నుంచి వచ్చారు. ఈయన తల్లిదండ్రులది పూర్తిగా వ్యవసాయ నేపథ్య కుటుంబం. Dr Anil Krishna G చిన్న వయస్సులోనే కార్డియాలజీ రంగంలో గొప్పగొప్ప విజయాలు సాధించారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డీఎంలో బంగారు పతకాన్ని సాధించారు. అనతికాలంలోనే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ప్రముఖ నిపుణుల్లో ఒకరిగా గుర్తింపుపొందారు. Dr Anil Krishna G కర్ణాటకలోని ఎస్ఎస్ మెడికల్ కాలేజీ నుంచి 2002లో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. 2006లో ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి జనరల్ మెడిసిన్‌లో డీఎన్‌బీ, 2010లో అదే ఉస్మానియా మెడికల్ కాలేజీలో కార్డియాలజీ విభాగంలో డీఎంలో గోల్డ్ మెడల్ సాధించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు.
Address:
Behind Cyber Towers,
IBIS Hotels Lane,
Hitec City, Hyderabad,
Telangana – 500081.
Contact Number: 040 6833 4455
ఇకపోతే 3 ప్లేస్‌లో Dr Sanjeev Kumar ఉన్నారు. ఈయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని సన్‌షైన్ హాస్పిటల్‌లో కార్డియాలజీ హెడ్‌గా పనిచేస్తున్నారు. 9 సంవత్సరాలకు పైగా కార్డియాలజీ రంగంలో అనుభవం సంపాదించారు. గుండె సంబంధిత వ్యాధులపై అపారమైన అనుభవాన్ని Dr Sanjeev Kumar సొంతం చేసుకున్నారు. ఈయన మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఒక గోల్డ్ మెడల్, అలహాబాద్‌లోని ఎంఎన్ మెడికల్ కాలేజీ నుంచి మరో బంగారు పతకం అందుకున్నారు. ఇప్పటివరకు Dr Sanjeev Kumar సన్ షైన్ హాస్పిటల్స్‌లో 1500 కంటే ఎక్కువ కార్డియాక్ కేసులను విజయవంతంగా నిర్వహించారు. మీరట్‌లోని శర్మ ఇనిస్టిట్యూట్‌లో మెడిసిన్ చీఫ్‌గా పనిచేశారు. గత రెండు సంవత్సరాలుగా 300 కంటే ఎక్కువ పీసీఐ స్టెంటింగ్ కేసులను చూశారు. Medical management of Ischemic Heart disease, Congestive Heart Failure, Management of Hypertension, Management of various cardiac issues in Diabetic & kidney patients విభాగంలో మంచి నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు.
Address:
SUNSHINE HOSPITALS
GACHIBOWLI
45, 7-56/19,
Survey No. 40 46, Dargah Road LIG Chitrapuri Colony, Prashant Hills, Radhe Nagar, Gachibowli,
Rai Durg, Telangana 500035
Contact Number: 8008 108 108
ఇకపోతే 2 ప్లేస్‌లో Dr. Ravi Kumar Aluri ఉన్నారు. ఈయన కార్డియాలజీ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పటివరకు Dr. Ravi Kumar Aluri 9వేల డయాగ్నోస్టిక్ కాథ్ కేసులను డీల్ చేశారు. ఈయన కార్డియాలజీలో నిపుణులు మాత్రమే కాదు. ఎన్నో పీర్ రివ్యూ ఆర్టికల్స్ ప్రచురించారు. Dr. Ravi Kumar Aluri కార్డియాలజీ రంగం పట్ల ఉన్న ఆసక్తితో డాక్టర్ ఆలూరి శ్రేయా కార్డియాలజీ క్లినిక్‌ను స్థాపించారు. అక్కడ ఎంతోమంది యువ వైద్యులకు శిక్షణ ఇవ్వడంతో పాటు కార్డియాలజీ రోగులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. ఈయన కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉన్నారు. ఉత్తమ సైంటిఫిక్ పేపర్ అవార్డును సైతం అందుకున్నారు. Dr. Ravi Kumar Aluri కిమ్స్‌లో చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఈయన హైదరాబాద్‌లోని సీనియర్ ట్రాన్స్‌రేషియల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.600 తీసుకుంటారు.
Address:
KIMS Hospital
1-112/86, Survey Number 55/EE,
Kondapur Village,
Serilingampally Mandal,
Landmark: Near RTO Office & Next to Andhra Bank,
Hyderabad
Contact Number: 9848024638 / (040) 67505050
ఇకపోతే 1 ప్లేస్‌లో Dr. B. Soma Raju ఉన్నారు. ఈయన దేశంలోని అత్యుత్తమ కార్డియాలజిస్టుల్లో ఒకరిగా ఉన్నారు. Dr. B. Soma Raju హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్ మాజీ చైర్మన్. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్‌తో కలిసి లోకాస్ట్‌లో స్టెంట్‌ను అభివృద్ది చేశారు. ఈ క్రమంలోనే Dr. B. Soma Raju 2001లో పద్మశ్రీ అవార్డను అందుకున్నారు. 1997 నుంచి కేర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడిగానే కాడు పీటీసీఏ రిజిస్ట్రీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. ఈయనకు కార్డియాలజీ రంగంలో 40 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రధానంగా Dr. B. Soma Raju టీచింగ్, క్లినికల్‌తో పాటు డాక్టర్ కార్డియాలజీలో మంచి అనుభవం సంపాదించారు. ఈయన పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీని చేశారు. అయితే ఇది దేశంలోనే మొదటిది కావడం గమనార్హం. కార్డియాలజిస్టుగా మారాలనుకునే వైద్యవిద్యార్థుల కోసం ఎన్నో పాఠ్యపుస్తకాలను రచించారు. Dr. B. Soma Raju ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్‌లో కార్డియాలజీ విభాగానికి హెడ్‌గా ఉన్నారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.500 తీసుకుంటారు.
Address:
AIG Hospitals,
Plot No 2/3/4/5, Survey No 136/1,
Mindspace Road, Gachibowli,
Hyderabad, Telangana – 500032
Contact Number: 40-4244 4222 / 6744 4222