Home Best Of Five Top 10 Hospitals in India | ఇండియాలో ఉన్న టాప్ 10 హాస్పిటల్స్ ఇవే…

Top 10 Hospitals in India | ఇండియాలో ఉన్న టాప్ 10 హాస్పిటల్స్ ఇవే…

0
114
Top 10 Hospitals in India | Best Hospitals in India | ఇండియాలో ఉన్న టాప్ 10 హాస్పిటల్స్ ఇవే...
Top 10 Hospitals in India | Best Hospitals in India | ఇండియాలో ఉన్న టాప్ 10 హాస్పిటల్స్ ఇవే…

దేశంలోని TOP 10 Hospitals ఇవే..

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో పాటే కొత్త కొత్త వ్యాధులు సోకుతున్నాయి. కాలంతో పాటు జీవనశైలిలో మార్పుల కారణంగానో.. లేదా జన్యుపరమైన లోపాల కారణంగానో అనేక వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు. గుండె, కిడ్నీ, కంటి, లివర్.. ఇలా ప్రతి అవయవానికి స్పెషలిస్ట్ డాక్టర్, హాస్పిటల్ ఉన్నట్టే .. దేశంలో అన్నిరకాల వ్యాధులకు ట్రీట్‌మెంట్ అందించే ఆస్పత్రులు ఉన్నాయి. వైద్యరంగంలో ఎంత సాంకేతికత అందుబాటులోకి వచ్చినా.. వ్యాధులు సైతం ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతున్న పరిస్థితులు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతికతను నిత్యనూతనంగా అందిపుచ్చుకుంటూ మెరుగైన వైద్యం అందిస్తోన్న హాస్పిటల్స్ దేశంలో చాలానే ఉన్నాయి. అయితే దేశంలో ఏ హాస్పిటల్ బెటర్..? టాప్ టెన్ హాస్పిటల్స్ ఏమున్నాయి..? తదితర వివరాలతో వీడియో రూపొందించాము. సో ఇంకేముంది ఈ వీడియో పూర్తిగా చూసి.. మీ అనారోగ్య సమస్యలకు తగిన చికిత్స తీసుకోండి.

ఇకపోతే Top 10 ప్లేస్‌లో Narayana Hrudayalaya Hospitals ఉంది. ఇది బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా Narayana Hrudayalaya Hospitals 22 బ్రాంచ్‌లను, 6 హార్ట్ హాస్పిటల్స్, 19 ప్రైమరీ హాస్పిటల్స్‌తో పాటు కేమాన్ దీవుల్లో అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రులను నిర్వహిస్తోంది. మొదటగా Narayana హెల్త్ గ్రూపు బెంగళూరులో దాదాపు 225 పడకల సామర్థ్యంతో హాస్పిటల్‌ను ప్రారంభించింది. ఈ హాస్పిటల్ కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ ద్వారా మెరుగైన సేవలు అందిస్తోంది. అతితక్కువ ధరలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ హాస్పిటల్స్ నడుస్తోంది. ఇప్పటివరకు Narayana హెల్త్ గ్రూపు 6 వేల పడకల సామర్థ్యంతో హాస్పిటల్స్ ఉన్నాయి.

Adress:
Narayana Institute of Cardiac Sciences
258/A, Bommasandra Industrial Area ,
Anekal Taluk, Hosur Road,
Bangalore, Karnataka – 560099.
Contact Number: 97384 97384

ఇకపోతే Top 9 ప్లేస్‌లో Jawaharlal instate of postgraduate medical education and research(JIPMER) ఉంది. ఈ హాస్పిటల్‌ను 1964లో పుదుచ్చేరిలో స్థాపించారు. దేశంలోని టాప్ టెన్ హాస్పిటల్స్‌లో ఇది ఒకటి. ఆసియాలో యూరోపియ్ వైద్యం నేర్పిన వాటిలో అతిపురాతనమైనది. ఇక్కడ రోగులకు సేవలు అందించడమే కాదు.. వైద్యవిద్యను అందిస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు వైద్యవిధ్యను బోధించడం JIPMER ప్రత్యేకత. మెరుగైన ప్రమాణాలతో స్పెషాలిటీ సేవలను అందించడంతో పాటు పరిశోధనలు చేస్తుంది. తక్కువ ధరలకే ఉచిత సేవలను అందించడంలో JIPMER తన ఉనికిని చాటుకుంటోంది. 2008లో కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి ప్రభుత్వం తీసుకురావడంతో JIPMER జాతీయ గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఇక్కడ 1500 పడకల సామర్థ్యంతో హాస్పిటల్ నడుస్తోంది.

Adress:
Jipmer Campus Rd,
Gorimedu, Dhanvantari Nagar,
Puducherry, 605006, India
Contact Number: 0413-2296562

ఇకపోతే Top 8 ప్లేస్‌లో Tata Memorial Hospital ఉంది. దీన్ని ముంబైలో 1952లో స్థాపించారు. క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ అందించడంలో Tata Memorial Hospital ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా లింఫోబ్లాస్టిక్ లుకేమియా చికిత్స అందించడం ఇక్కడి ప్రత్యేకత. దీన్ని క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్‌గానూ పిలుస్తారు. ఈ హాస్పిటల్‌లో క్యాన్సర్‌తో పాటుగా హేమాటో ఆంకాలజీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ వంటి సేవలు అందిస్తారు. క్యాన్సర్‌లో చికిత్స, పరిశోధనతో పాటు విద్యను బోధించేందుకు అధునాతన కేంద్రం (ACTREC)తో అనుసంధానం చేశారు. ఇక్కడి అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి చికిత్స, మౌలిక సదుపాయాలతో Tata Memorial Hospitalకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ హాస్పిటల్‌లో 600 పడకల సామర్థ్యంతో నడుస్తోంది.

Adress:
Dr.E,
Dr Ernest Borges Rd,
Parel, Mumbai,
Maharashtra 400012, India
Contact Number:+91-22- 24177000.

ఇకపోతే Top 7 ప్లేస్‌లో Lilavati Hospital ఉంది. ఇది ముంబైలోని బాంద్రాలోని ప్రముఖ హాస్పిటల్. దీన్ని లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ 1997లో స్థాపించింది. దేశంలోని ప్రఖ్యాత హాస్పిటల్స్‌లో ఇది ఒకటి. ఇది మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సేవలను అందిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి రోగులు ఇక్కడికి వైద్య సేవలు పొందేందుకు వస్తుంటారు. Lilavati Hospital మొదటగా 10 పడకలు, 22 మంది వైద్యులతో ప్రారంభమై.. ఇప్పుడు 323 బెడ్స్, 12 ఆపరేషన్ థియేటర్లతో కొనసాగుతోంది. ఇక్కడ 1800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. Lilavati Hospitalలో ప్రతిరోజూ దాదాపు 300 మంది ఇన్ పేషంట్లు, 1500 మంది ఔట్ పేషంట్లు వస్తుంటారు.

Adress:
Lilavati Hospital,
A-791, Bandra Reclamation Rd,
Bandra West, Mumbai,
Maharashtra 400050, India
Contact Number:022 2675 1000

ఇకపోతే Top 6 ప్లేస్‌లో Postgraduate Institute of Medical Education and Research(PGIMER) ఉంది. దీన్ని 1962లో  Chandigarhలో ప్రారంభించారు. ప్రొఫెసర్ తులసీదాస్, బాలకృష్ణ, సంతోఖ్ సింగ్ ఆనంద్, సంత్ రామ్ దాల్, బీఎన్ అయికత్, పీఎన్ చుట్టాని ఈ PGIMERను స్థాపించారు. సమాజానికి సేవ, అందరికీ మేలు చేసే పరిశోధన, నిరుపేదల సంరక్షణ అనే నినాదంతో ఈ హాస్పిటల్ నడుస్తోంది. అన్నివర్గాల ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే దీని లక్ష్యం. యూరాలజీ, మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేయడంలో PGIMER ప్రత్యేకతను సంపాదించింది. ఈ PGIMERను 1967లో కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా గుర్తింపునిచ్చింది. వైద్య సేవలతో పాటు వైద్యవిద్యను అన్ని శాఖల్లో బోధించడం ఇక్కడి ప్రత్యేకత.

Adress:
Madhya Marg, Sector 12,
Chandigarh, 160012, India
Contact Number:0091-172-2746018

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Medanta The Medicity ఉంది. ఇది దేశంలోని అతిపెద్ద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఒకటి. ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నరేశ్ ట్రెహాన్ అతితక్కువ ధరలకు ప్రపంచస్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ హాస్పిటల్‌ను 2009లో స్థాపించారు. ఈ హాస్పిటల్ గుర్గావ్‌లో 45 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఉంది. ఇక్కడ రోబోటిక్ రాడికల్ ప్రోస్టేటెక్టమీ, స్టెంట్ ఇంప్లాంట్ తదితర సేవలతో పాటు ఇతర ఆరోగ్య సేవలను అత్యాధునిక సాంకేతికతతో అందిస్తారు. ఈ హాస్పిటల్‌ 1250 పడకల సామర్థ్యంతో రోగులకు సేవలు అందిస్తోంది.

Adress:
Olympus, CH Baktawar Singh Rd,
Sector 38, Gurugram,
Haryana 122001, India
Contact Number: 0124 414 1414

ఇకపోతే Top 4 ప్లేస్‌లో Fortis Hospitals ఉంది. ఇది దేశంలోని అత్యుత్తమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఒకటి. ఇక్కడ సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణులతో పాటు పారామెడికల్ సిబ్బంది సైతం ఉన్నారు. Fortis Hospitalsను 1988లో ఢిల్లీలో స్థాపించారు. దాదాపు 160 పడకల సామర్థ్యంతో రోగులకు ప్రపంచస్థాయిలో ఆరోగ్య సేవలు అందుతున్నాయి. జనరల్ సర్జరీల దగ్గరి నుంచి మొదలుకుని యూరాలజీ, సైకియాట్రి, క్లినికల్ సైకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి తదితర సేవలను అందించడంలో ప్రత్యేకతను సంపాదించుకుంది. వాస్తవంగా Fortis Hospitals ప్రముఖ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా కొనసాగుతోంది. మూడు దశాబ్దాలకు పైగా వారసత్వంతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల గ్రహీతలతో సహా ప్రముఖ వైద్యులెందరో సేవలు అందించారు.

Adress:
Okhla road,
Sukhdev Vihar Metro Station, New Delhi,
Delhi 110025, India
Contact Number:+91 76695 84409

ఇకపోతే Top 3 ప్లేస్‌లో The Christian Medical College(CMC) ఉంది. ఇది దేశంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి.  The Christian Medical College తమిళనాడులోని వెల్లూరులో ఉంది. ఇది కేవలం హాస్పిటల్ మాత్రమే కాదు. మెడికల్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌గానూ పనిచేస్తుంది. ఈ హాస్పిటల్ వెల్లూరు సమీపంలోని పలు ఆస్పత్రుల నెట్‌వర్క్ గ్రూపును కలిగి ఉందని చెప్పాలి. The Christian Medical Collegeని 1990 సంవత్సరంలో డాక్టర్ ఎస్ స్కూడర్ స్థాపించారు. ఈ కాలేజీ వైద్యరంగంలో ప్రముఖ స్థానం సంపాదించుకోవడమే కాదు. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందుపుచ్చుకుని సరసమైన ధరలకే చికిత్స అందించడం ఇక్కడి ప్రత్యేకత. ఇందులో గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరో సైన్సెస్, హెమటాలజీలో ప్రత్యేక చికిత్స అందిస్తారు. ప్రపంచస్థాయి వైద్యాన్ని పేదలకు అందించడమే Christian Medical College నినాదమని చెప్పాలి. ఇక్కడ 2600 పడకల సామర్థ్యంతో 11 ఐసీయూలు ఉన్నాయి. 1799 మంది డాక్టర్లతో పాటు 9500 మంది సిబ్బంది రోగులకు సేవలు అందిస్తున్నారు. Christian Medical College పరిశోధనా కేంద్రంగా ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించింది.

Adress:
IDA Scudder Rd,
Vellore, Tamil Nadu 632004, India
Contact Number:0416 228 1000

ఇకపోతే Top 2 ప్లేస్‌లో Apollo Hospital ఉంది. దీన్ని డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి 1983లో చెన్నైలో నెలకొల్పారు. Apollo Hospital దేశంలోనే తొలి కార్పొరేట్ హాస్పిటల్‌గా గుర్తింపు పొందింది. ఇది ప్రైవేటు హాస్పిటల్ రంగంలో ఓ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఆసియాలోనే సమగ్రమైన ఆరోగ్య సేవలు అందించే సంస్థగా గుర్తింపు పొందింది. Apollo Hospitalను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 140 దేశాలకు చెందిన 150 మిలియన్ల మంది నమ్మకాన్ని సంపాదించగలిగింది. దేశంలోనే కార్డియాలజీ సేవలందిస్తోన్న అతిపెద్ద సంస్థ Apollo Hospital.రోగుల్లో సీవీడీ ముప్పును 5 నుంచి 7 సంవత్సరాలు ముందుగానే గుర్తించేలా చేసే ఏపీఐ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ విధానంలో ఇప్పటివరకు  2 లక్షల మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు. అపోలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. ఓ ఆరోగ్య సంస్థకు ఈ తరహా గౌరవం దక్కడమనేది చాలా అరుదు. ఈ క్రమంలోనే Apollo Hospital చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి దేశంలోని రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ను అందుకోవడం గమనార్హం.

Adress:
21, Greams Lane,
Off Greams Road Chennai – 600006
Contact Number:91 44 2829 3333

ఇకపోతే Top 1 ప్లేస్‌లో All India Institute of Medical Sciences(AIIMS) ఉంది. దేశంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో AIIMS ఒకటి. దీన్ని 1956 సంవత్సరంలో స్థాపించారు. ఇక్కడ అనేక రకాల వ్యాధులకు సంబంధించిన అత్యుత్తమ వైద్యులతో పాటు పరిశోధనా సౌకర్యాలు ఉన్నాయి. వైద్యవిద్యార్థుల కోసం ప్రత్యేకంగా AIIMS మెడికల్ కాలేజీ నడుస్తోంది. ఇక్కడ చదివేందుకు ఇండియాలోని విద్యార్థులంతా భారీ స్థాయిలో పోటీ పడుతుంటారు. విదేశాల నుంచి సైతం రోగులు తీవ్ర అనారోగ్య సమస్యలతో AIIMS ప్రభుత్వ హాస్పిటల్‌కు వస్తున్నారంటే ఏలాంటి సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2014లో ఇండియా టుడే గ్రూప్ AIIMSను ఢిల్లీతో పాటు దేశంలోనే అత్యుత్తమ హాస్పిటల్‌గా ప్రకటించింది. ప్రస్తుతం AIIMSలో 1760 పడకల సామర్థ్యంతో సేవలు అందిస్తున్నారు.

Adress:
Sri Aurobindo Marg,
Ansari Nagar, Ansari Nagar East,
New Delhi, Delhi 110029
Contact Number:+91-11-26588500 / 26588700

Leave your vote

More

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings

close

Log In

Forgot password?

Forgot password?

Enter your account data and we will send you a link to reset your password.

Your password reset link appears to be invalid or expired.

Log in

Privacy Policy

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.