Top 10 Hospitals in Vijayawada

97
0
Top 10 Hospitals in Vijayawada | Best Hospitals in Vijayawada | Best Hospitals in Guntur
Top 10 Hospitals in Vijayawada | Best Hospitals in Vijayawada | Best Hospitals in Guntur
ప్రస్తుతం కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తినా.. హాస్పిటల్‌కు పరిగెత్తడం కామన్ అయిపోయింది. చిన్నపాటి జ్వరం దగ్గరి నుంచి గుండె, కిడ్నీ, లివర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకునేందుకు మంచి హాస్పిటల్‌కు వెళ్లాలి. అయితే కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ప్రైవేటు హాస్పిటల్స్ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ వచ్చాయి. అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల మాటున నకిలీ వైద్యుల బెడద లేకపోలేదు. నిపుణులైన వైద్యుల పేరు చెప్పి రూ.లక్షలు దండుకుంటున్నారు. డబ్బులు పోయినా ఫర్వాలేదు గానీ ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏది మంచి హాస్పిటల్..? ఏ హాస్పిటల్‌లో ఎవరు స్పెషలిస్ట్..? ఎక్కడ మంచి వైద్యం దొరుకుతుంది..? అనే తదితర ప్రశ్నలు ప్రశ్నార్థకంగానే మారుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ, గుంటూరు నగరాల్లోని Top 10 Hospitals వివరాలను మీకోసం వీడియో రూపంలో సమగ్రంగా అందిస్తోంది మీ Aadhan Telugu.

ఇకపోతే Top 10 ప్లేస్‌లో Dr.Pinnamaneni Siddhartha Institute of Medical Sciences and Research Hospital ఉంది. ఈ హాస్పిటల్‌ను 2003లో విజయవాడ పరిసరాల్లో స్థాపించారు. 2017 సంవత్సరంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించగా, ప్రస్తుతం 890 పడకల సామర్థ్యంతో అన్ని విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తోంది. ఇక్కడ అత్యాధునిక లేబరేటరీస్‌ను రూపొందించడంతో పాటు అవయవ మార్పిడి, మోకాలి మార్పిడి చికిత్సలను విజయవంతంగా చేస్తారు. బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, పాథాలజీ విధానాల్లో డయాగ్నిస్టిక్ సేవలు అందిస్తుండడం గమనార్హం. తక్కువ ఖర్చుతో పేదలకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ హాస్పిటల్‌లో 128 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి. నార్మల్ వైద్య సేవలతో పాటుగా ఆపరేషన్స్ ఛార్జీల్లోనూ రాయితీ కల్పిస్తుంటారు. దీంతో పాటు ప్రతినెలా 100 కంటి శుక్లాల ఆపరేషన్లు చేస్తారు. అర్హులైన వారందరికీ మెడిసిన్ మినహా ఆస్పత్రి సేవలను లాభాపేక్ష లేకుండా అందిస్తారు. హాస్పిటల్ లో ‘అన్న ప్రసాదం పథకం’ కింద ఇన్ పేషంట్లందరికీ ఉచితంగా ఆహారాన్ని అందిస్తారు. రోగులకు ఈఎస్ఐతో పాటు బీమా కంపెనీల ఇన్సూరెన్స్‌లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి.

Address:
Dr.Pinnamaneni Siddhartha Institute of Medical Sciences and Research Foundation,
Chinna Avutapalli,
Vijayawada, Andhra Pradesh-521286.
Contact Number:08676 257311 to 16


ఇకపోతే Top 9 ప్లేస్‌లో Sentini Hospital ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ ఆస్పత్రుల్లో ఒకటి. నగరంలోని 150 పడకల సామర్థ్యంతో రోగులకు సేవలు అందిస్తోంది. డాక్టర్ పద్మ మొవ్వ యూఎస్ఏ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన అనంతరం సొంత ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే దృక్పథంతో విజయవాడ నడిబొడ్డున  Sentini Hospitalను స్థాపించింది. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక వైద్యం, నిపుణులైన వైద్య బృందం, డెడికేటెడ్ సిబ్బందితో పేషంట్ల ఆరోగ్య సంరక్షణను చూస్తోంది. ఇక్కడ ప్రధానంగా క్రిటికల్ కేర్, ట్రామా కేర్, బెరియాట్రిక్, పల్మనాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, ఈఎన్‌టీ, కాస్మోటిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జన్ తదితర సేవలను అందిస్తోంది.

Address:
54-15-5 B&C,
Ring Rd, beside Vinayak Theatre,
Vijayawada, Andhra Pradesh 520008
Contact Number: 0866 667 7869


ఇకపోతే Top 8 ప్లేస్‌లో Latha Super speciality Hospital ఉంది. ఇది విజయవాడ నగరంలోని అత్యుత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. మెడికల్ సూపర్ స్పెషాలిటీలో మెడికల్ ఎక్సలెన్స్ ద్వారా ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించడమే లక్ష్యంగా ఈ హాస్పిటల్ నడుస్తోంది. నగరంలో 150 పడకల సామర్థ్యంతో బహుళ వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు అనుసంధానించబడింది. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్‌కు 3 కిమీల దూరంలో ఉంది. నగరంలో ఎక్కడ ఉన్నా.. మేము అన్ని రోడ్డు రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. క్లినికల్, సర్జికల్ వైద్యం అందించడంలో నిపుణులైన వైద్యులు సేవలు అందించడం ఇక్కడి ప్రత్యేకత. Latha Super speciality Hospitalలో ప్రధానంగా న్యూరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, ప్రసూతి సేవలు ప్రత్యేకంగా అందిస్తారు. విజయవాడలోనే గత 15 సంవత్సరాలుగా విజయవంతంగా ప్రాక్టీస్ చేస్తున్న అనుభవజ్ఞుడైన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ప్రమోద్ చలసాని న్యూరాలజీ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు.

Address:
Road no:5,
Prakasham Road, Suryaraopeta,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number:082972 55515

ఇకపోతే Top 7 ప్లేస్‌లో AIIMS Mangalagiri ఉంది. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అనేది ఒక వైద్య పరిశోధన ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ. ఈ వైద్య కళాశాల ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉంది. 2014 జూలైలో ప్రకటించిన నాలుగు ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఇది ఒకటి. ఇది గుంటూరు, విజయవాడ మధ్యలో ఉంది. 2018లో విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో తాత్కాలిక క్యాంపస్ అయినప్పటికీ, 2019 మార్చిలో గుంటూరులోని మంగళగిరిలోని పర్మినెంట్ క్యాంపస్‌లో OPD సేవలు ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఎయిమ్స్ ఏర్పాటయ్యింది. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ పలు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు.

Address:
OPD Block,
All India Institute of Medical Sciences,
Old TB Sanatorium Road, Mangalagiri
Guntur (AP), 522503
Contact Number: +91 0866 2454500


ఇకపోతే Top 6 ప్లేస్‌లో AAYUSH HOSPITALS ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. 200 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ సేవలను అందిస్తోంది. ఇది గత ఏడేండ్లుగా విజయవంతమైన సేవలు అందిస్తోంది.  AAYUSH HOSPITALS చుట్టూ 60 కిలోమీటర్ల వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సేవలు అందిస్తోంది. నిత్యం ఇక్కడ 250 మంది కంటే ఎక్కువ ఔట్ పేషంట్లు వస్తుంటారు. ఇక్కడ ప్రధానంగా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ, అనస్థీషియాలజీ, క్రిటికల్ కేర్, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ప్రసూతి, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల్లో ప్రపంచ వ్యాప్తంగా నిపుణులైన చికిత్స అందిస్తోంది.


Address:
48-13-3 3A
Ring Road Opp.Siddhartha Medical College,
Sri Ramachandra Nagar,
Vijayawada, Andhra Pradesh 520008
Contact Number:096039 29292



ఇకపోతే Top 5 ప్లేస్‌లో Kamineni HOSPITALS ఉంది. విజయవాడలోని ఆస్పత్రుల్లో తనకంటూ ఓ గొప్ప స్థానాన్ని కామినేని హాస్పిటల్స్‌ చేజిక్కించుకుంది. దాదాపు 1600 బెడ్స్‌లతో వివిధ విభాగాల్లో పలుచోట్ల ఆసుపత్రులను నిర్వహిస్తూ కామినేని హాస్పిటల్స్‌ పలువురి మన్ననలను అందుకుంది. అనారోగ్యంతో వచ్చిన పేషెంట్స్‌ తిరిగి వెళ్ళేటప్పుడూ నవ్వుతూ వెళ్ళాలన్న ఆశయంతో కామినేని హాస్పిటల్స్‌లోని సిబ్బంది, డాక్టర్లు పని చేస్తున్నారు. కార్డియాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్టోపెడిక్స్‌ ఇతర విభాగాల్లో ప్రత్యేకమైన వైద్యసేవలను డాక్టర్లు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్స్‌ ఆధునిక వైద్యవసతులను, డాక్టర్ల నైపుణ్యాన్ని గమనించి విజయవాడలోనివారే కాకుండా, ఇతర నగరాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా పేషెంట్లు ఈ ఆసుపత్రులకు వస్తున్నారు. ఉజ్బెకిస్తాన్‌, నైజీరియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మలేషియా నుంచి కూడా పేషెంట్లు వచ్చి ఇక్కడ చికిత్స చేయించుకుని వెళ్ళారు. నొప్పులకు సంబంధించి ఎపిడ్యురోస్కోప్‌ను కామినేని హాస్పిటల్స్‌ కలిగి ఉంది. దక్షిణాదిలోనే తొలిసారిగా ఇలాంటి సదుపాయం కామినేనిలోనే ప్రవేశపెట్టారు. దీంతో పాటు కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, కామినేని ఇన్‌స్టిట్ట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌, కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారా మెడికల్‌ సైన్సెస్‌, కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నర్సింగ్‌లను కూడా ఈ హాస్పిటల్స్‌ యాజమాన్యం నిర్వహిస్తోంది.

Address:
100 Feet New Autonagar Road,
Main Road, Tadigadapa,
Vijayawada, Andhra Pradesh 521137
Contact Number: 0866 246 3333

ఇకపోతే Top 4 ప్లేస్‌లో Ramesh Hospitals ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. Ramesh Hospitalsను 1996 నుంచి విజయవాడ నగరంతో పాటు చుట్టూపక్కలా ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. దాదాపు 160 పడకల సామర్థ్యంతో న్యూరాలజీ, పీడియాట్రిక్ కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, డయాబెటాలజీ, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ సేవలను అందిస్తోంది. ఇక్కడ ప్రముఖ కార్డియాలజిస్ట్ పి.భాస్కర్ నాయుడు, నళినీ ప్రసాద్ ఇప్పెల, డాక్టర్ కుమారవేలు, సోమసుందరం వంటి నిపుణులైన వైద్యులు కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తారు. Ramesh Hospitals సోమవారం నుంచి ఆదివారం వరకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.

Address:
ITI College Road,
Jayaprakash Nagar
Landmark: Near ITI College Bus Stop & Near Andhra Loyola College
Benz Circle, Vijayawada
Contact Number:918662463463


ఇకపోతే Top 3 ప్లేస్‌లో American Oncology Institute ఉంది. విజయవాడలోని కానూరులో అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నాగార్జున క్యాన్సర్ సెంటర్‌లో సేవలు అందిస్తోంది. ఈ హాస్పిటల్‌లో దాదాపు 100 పడకలకు పైగానే సామర్థ్యం ఉంది. ఇది క్యాన్సర్‌కు అత్యుత్తమ హాస్పిటల్‌‌లో ఒకటిగా ఉంది. అన్ని స్పెషాలిటీ నిపుణులను ఒకేచోటకు చేర్చి మల్టీడిసిప్లినరీ టీమ్‌గా సేవలు అందిస్తోంది. యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ మెడికల్ సెంటరులో ప్రముఖ ఆంకాలజిస్ట్‌ల బృందం నేతృత్వంలో అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ దక్షిణాసియా అంతటా సేవలను విస్తృతం చేసింది. అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ విజయవాడలో రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్, మెడికల్, హెమటాలజీ ఆంకాలజీ సేవలను అందిస్తోంది. ఈ హాస్పిటల్ యూఎస్పీ అత్యాధునిక సాంకేతికతతో రోగులకు సంతృప్తికరమైన సేవలు అందించడంలో ముందుంది.

Address:
American Oncology Institute,
At Nagarjuna Hospital Compound,
NTR Marg, near Mana Kalyana Vedika,
Endowments Colony, Chalasani Nagar,
Kanuru, Vijayawada, Andhra Pradesh 520007
Contact Number:1800 208 2000


ఇకపోతే Top 2 ప్లేస్‌లో Manipal Hospital ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఒకటి. ఇందులో 250 సాధారణ పడకలు, మరో 50 ఐసీయూ పడకల సామర్థ్యంతో నడుస్తోంది. Manipal Hospitalలో 24 గంటల పాటు ఎమర్జెన్సీ సేవలు, ల్యాబ్, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్, అంబులెన్స్ సదుపాయం అందుబాటులో ఉంది. విజయవాడలోనే కాకుండా దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ Manipal Hospital అనుబంధంగా బ్రాంచ్‌లు ఉన్నాయి. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్‌ను 1953లో స్థాపించారు. కర్ణాటకలోని మణిపాల్‌లో కస్తూర్భా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయగా, 1991లో విజయవాడ, బెంగళూరులో మణిపాల్ హాస్పిటల్స్ ఒక సంస్థగా ఏర్పాటయ్యింది. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో 7600 పడకల సామర్థ్యంతో 27 హాస్పిటల్స్ కొనసాగుతున్నాయి.

Address:
Manipal Hospital Vijayawada,
# 12-570 near vardhi By pass road
Tadepalli Guntur District,
Andhra Pradesh 522501
Contact Number:086456 69966


ఇకపోతే Top 1 ప్లేస్‌లో NRI hospital ఉంది. ఇది గుంటూరు మంగళగిరిలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. ఇది కేవలం వైద్యశాలగానే కాకుండా మెడికిల్ కాలేజీగాను సేవలు అందిస్తోంది. ఇక్కడ ప్రముఖ యురాలజిస్ట్ డాక్టర్ సురేశ్ బాబు వేదాల, డాక్టర్ మల్లికార్జునరెడ్డి మందపాటిలు కన్సల్టెంట్ సేవలు అందిస్తారు. NRI hospitalలో జనరల్ గైనకాలజీ, డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్, డయాగ్నోస్టిక్ పాథాలజీ, డిజిటల్ రేడియోగ్రఫీ – (CBCT), పిలోనిడల్ సైనస్ ట్రీట్‌మెంట్ తదితర సమస్యలకు చికిత్స అందించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ మెడికల్ కాలేజీతో పాటు జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీ అందుబాటులో ఉండడం గమనార్హం. NRI hospital లో 2003-2004 విద్యాసంవత్సరంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఫార్సుల మేరకు 100 మంది విద్యార్థులతో మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యింది. 8 భవనాల్లో 1050 పడకల సామర్థ్యంతో టీచింగ్ హాస్పిటల్ అనుసంధానించడం ఇక్కడి ప్రత్యేకత.

Address:
Near National Highway
NRI Hospital Road,
Chinakakani, Mangalagiri,
Andhra Pradesh – 522503.
Contact Number:086452 30101
ReplyReply allForward

Leave your vote

More
Previous articleTop 5 Cancer Hospitals in Vijayawada
Next articleTop 5 Hepatologists in Vijayawada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here