Home Best Of Five Top 10 Hospitals in Vizag | వైజాగ్ లో ఉన్న టాప్ 10 బెస్ట్...

Top 10 Hospitals in Vizag | వైజాగ్ లో ఉన్న టాప్ 10 బెస్ట్ హాస్పిటల్స్ ఇవే

0
113
Top 10 Hospitals in Vizag | Best Hospitals in Vizag | వైజాగ్ లో ఉన్న టాప్ 10 బెస్ట్ హాస్పిటల్స్ ఇవే
Top 10 Hospitals in Vizag | Best Hospitals in Vizag | వైజాగ్ లో ఉన్న టాప్ 10 బెస్ట్ హాస్పిటల్స్ ఇవే

వైజాగ్‌లోని Top 10 Hospitals ఇవే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మారిన జీవనశైలికి అనుగుణంగానే ఆహారపు అలవాట్లు మారాయి. ఇంతటి ఆధునిక యుగంలో జంక్ ఫుడ్‌దే హవా. ఆ జంక్ ఫుడ్‌తో పాటు మారిన జీవన విధానం వల్ల కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అయితే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తినా.. హాస్పిటల్‌కు పరిగెత్తడం కామన్ అయిపోయింది. చిన్నపాటి జ్వరం దగ్గరి నుంచి గుండె, కిడ్నీ, లివర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకునేందుకు మంచి హాస్పిటల్‌కు వెళ్లాలి. అయితే కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ప్రైవేటు హాస్పిటల్స్ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ వచ్చాయి. అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల మాటున నకిలీ వైద్యుల బెడద లేకపోలేదు. నిపుణులైన వైద్యుల పేరు చెప్పి రూ.లక్షలు దండుకుంటున్నారు. డబ్బులు పోయినా ఫర్వాలేదు గానీ ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏది మంచి హాస్పిటల్..? ఏ హాస్పిటల్‌లో ఎవరు స్పెషలిస్ట్..? ఎక్కడ మంచి వైద్యం దొరుకుతుంది..? అనే తదితర ప్రశ్నలు ప్రశ్నార్థకంగానే మారుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వైజాగ్‌లోని Top 10 Hospitals వివరాలను మీకోసం వీడియో రూపంలో సమగ్రంగా అందిస్తోంది మీ Aadhan Telugu.

ఇకపోతే Top 10 ప్లేస్‌లో Nikitha Hospital ఉంది. ఇది వైజాగ్‌లోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. దాదాపు 60 పడకల సామర్థ్యంతో వైజాగ్‌లోని సీతమ్మధారలో హాస్పిటల్ ఏర్పాటయ్యింది. Nikitha Hospitalలో గైనకాలజీ, జనరల్ సర్జరీ, లాపరోస్కోపీ, ఆర్థోపెడిక్ సర్జరీ, యూరాలజీ విభాగాల్లో రోగులకు నాణ్యమైన సేవలను అందిస్తోంది. ఈ హాస్పిటల్ 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తోంది. అతితక్కువ ఖర్చుతోనే పేదలకు నాణ్యమైన సేవలు అందిస్తూ అందరి మన్ననలను పొందుతుంది. డాక్టర్ కె.రమేశ్ నాయుడు, డాక్టర్ కె.సుధారాణిలు నిత్యం అందుబాటులో ఉంటూ చికిత్స చేస్తుంటారు.

Address:
Nikitha Hospital,
54-13-6, Beside S.B.I.,
Seethammadhara junction,
Visakhapatnam-500013
Contact Number: 089125 01501

ఇకపోతే Top 9 ప్లేస్‌లో Indus Hospitals ఉంది. ఇది వైజాగ్‌లోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. సమాజంలోని అన్నివర్గాలకు అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో Indus Hospitals నడుస్తోంది. వైజాగ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో Indus Hospitalsను స్థాపించారు. ఈ హాస్పిటల్‌లో కార్డియో సర్జరీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరో సర్జరీ, ఈఎన్‌టీ, అనస్థీషియా, డెర్మాటాలజీ, యూరాలజీ తదితర వైద్యసేవలను నిరంతరాయంగా అందిస్తోంది.

Address:
KGH Down Road,
Near Jagadamba Junction,
Maharani Peta, Visakhapatnam,
Andhra Pradesh 530002
Contact Number:098487 24365

ఇకపోతే Top 8 ప్లేస్‌లో Mahatma Gandhi Cancer Hospital & Research Institute ఉంది. ఇది క్యాన్సర్ నివారణ, సంరక్షణ కోసం అత్యుత్తమ కేంద్రంగా స్థాపించబడింది. దేశంలోని అతిపెద్ద క్యాన్సర్ కేంద్రాల్లోని ఇది ఒకటి. ఈ హాస్పిటల్‌ను విశాఖపట్నంలో 2005లో డాక్టర్ మురళీకృష్ణ స్థాపించారు. ఇక్కడ క్యాన్సర్ రోగుల అవసరాలను తీర్చేందుకు డయాగ్నోస్టిక్, సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సింప్టమ్ మేనేజ్‌మెంట్‌తో సహ అత్యాధునిక చికిత్సలను అందిస్తోంది. క్యాన్సర్ రోగుల అవసరాలకు అనుగుణంగా స్నేహాపూర్వక వాతావరణాన్ని అందించేందుకు నిరంతరం కృషి  చేస్తోంది. క్యాన్సర్ పేషంట్లకు మెరుగైన వైద్యం అందించేందుకు గీతం యూనివర్సిటీతో 2020లో ఎంఓయూ కుదుర్చుకుంది. 2019లో ‘Best Cancer Hospital Of The Year in Andhra Pradesh’ awardను సొంతం చేసుకుంది. 2019 ఆగస్టులో ఓ 13 సంవత్సరాల బాలికకు The First Bone Marrow Transplant Treatment అందించి రికార్డు సృష్టించింది. ఇలాంటి అనేక అవార్డులను Mahatma Gandhi Cancer Hospital & Research Institute సొంతం చేసుకుంది.

Address:
Plot No:1,
Sector:7, MVP Colony,
Visakhapatnam, Andhra Pradesh 530017
Contact Number:089128 78787

ఇకపోతే Top 7 ప్లేస్‌లో Care Super Speciality Hospital ఉంది. ఇది కేర్ హాస్పిటల్స్ గ్రూపులో అంతర్భాగం. 1999 నుంచి వైజాగ్‌లోని రామ్‌నగర్‌లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తోంది. ఇక్కడ కార్డియాక్, కార్డియోథొరాసిక్ వ్యాధుల కోసం ప్రత్యేక చికిత్స అందిస్తూ మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం మల్టీడిసిప్లినరీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా రూపొందింది. 160 పడకల సామర్థ్యంతో కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, క్రిటికల్ కేర్, గైనకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్, యూరాలజీ, ఈఎన్‌టీ, జనరల్ సర్జరీ, ఫిజియోథెరపీ తదితర విభాగాల్లోనూ నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తున్నారు. రోగులకు అందుబాటు ధరల్లోనే అత్యాధునిక సాంకేతికతతో మెరుగైన వైద్యం అందించేందుకు కేర్ హాస్పిటల్ కృషిచేస్తోంది.

Address:
AS Raja Complex,
10-50-11/5,
Waltair Main Rd, Ram Nagar,
Visakhapatnam, Andhra Pradesh 530002
Contact Number:040 6810 6589

ఇకపోతే Top 6 ప్లేస్‌లో Sevenhills Hospital ఉంది. ఇది వైజాగ్‌లోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. ఈ హాస్పిటల్ 20 సంవత్సరాలకు పైగా వైద్య సేవలు అందిస్తోంది. విశాఖపట్నంలో 1986లో Sevenhills Hospital తన సేవలను ప్రారంభించింది. కేవలం దేశీయ రోగులకు మాత్రమే కాకుండా విదేశాల నుంచి వచ్చే రోగులకు సైతం నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. రోగులకు సేవలందించడంలో ఈ హాస్పిటల్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్(ఎన్ఏబీహెచ్) గుర్తింపుతో పాటు ఎన్ఏబీఎస్, అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్ గుర్తింపు పొందింది. Sevenhills Hospital 2015లో 2వేలకు పైగా కార్డియాక్ సర్జరీలు చేసిన ఘనతను సాధించింది.

Address:
SevenHills Hospital,
Rockdale Layout,
Waltair Main Road,
Visakhapatnam – 530002
Andhra Pradesh.
Contact Number: 0891- 667 7777

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Queen’s NRI Hospital ఉంది. ఇది వైజాగ్‌లోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. గత 20 సంవత్సరాలుగా Queen’s NRI Hospital వైజాగ్ వాసులతో పాటు చుట్టూపక్కల ప్రజలకు 24 గంటల పాటు నిరంతరాయ సేవలను అందిస్తోంది. 380 పడకల సామర్థ్యంతో క్రిటికల్ కేర్ సేవలతో పాటు ఆంకాలజీ, కార్డియాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ ట్రీట్‌మెంట్ అందిస్తోంది. 50 కంటే ఎక్కువ పడకలతో 6 ప్రత్యేక ఐసీయూ గదులను ఏర్పాటు చేశారు. ప్రతినెలా 1000కి పైగా డయాలసిస్ కేసులను పరిష్కరిస్తుంది. డాక్టర్ రంగారావు చలసాని, డాక్టర్ విజయలక్ష్మీ చలసాని దంపతులు 1994లో Queen’s NRI Hospitalను వైజాగ్‌లో స్థాపించారు.  2017లో స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డును దక్కించుకున్నారు.

Address:
D.no, 50-53-14,
Gurudwara Rd, Balayya Sastri Layout,
Seethammadara,
Visakhapatnam, Andhra Pradesh 530013
Contact Number:089128 27777

ఇకపోతే Top 4 ప్లేస్‌లో Medicover Hospitals ఉంది. ఇది వైజాగ్‌లోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. ఒక్క వైజాగ్‌లోనే నాలుగు బ్రాంచ్‌లుగా హాస్పిటల్ నడుస్తోంది. ఇందులో మల్టీ సూపర్ స్పెషాలిటీ సదుపాయంతో పాటు మహిళలు, గర్భిణీలు, పిల్లలకు అత్యంత ఆధునాతన సేవలను అందిస్తోంది. ప్రధానంగా కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, నెఫ్రాలజీ, న్యూరోసైన్సెస్, ఎమర్జెన్సీ కేర్ సేవలను ప్రత్యేకంగా అందిస్తోంది. వాస్తవానికి మెడికవర్ గ్రూప్‌ 12 నగరాల్లో 18 హాస్పిటల్స్‌కను నడిపిస్తోంది. ఇందులో 10కి పైగా కాథ్ ల్యాబ్స్, 70 ఆపరేషన్ థియేటర్లు, 4వేలకు పైగా పడకలు, 18 లక్షల కన్సల్టేషన్ పేషంట్లకు సేవలందిస్తోంది.

Address:
18-1-3,
KGH Down Rd,
Besides Lepakshi Handicrafts,
Jagadamba Junction,
Visakhapatnam, Andhra Pradesh 530002
Contact Number: 04068334455

ఇకపోతే Top 3 ప్లేస్‌లో OMNI HOSPITALS ఉంది. ఇది విశాఖపట్నంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. వైజాగ్ నడిబొడ్డున 150 పడకల సామర్థ్యంతో ఏర్పాటయ్యింది. గత 20 సంవత్సరాలుగా వైద్య సేవలను అందిస్తూ OMNI HOSPITALS అందరి ప్రశంసలు పొందుతుంది. ఇందులో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, 26 పడకల ఎస్ఐసీయూ, 24 పడకల నియో నాటల్ ఐసీయూ, 14 పడకల ఎస్ఐసీయూలు అందుబాటులో ఉన్నాయి. 24 గంటల పాటు క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మెరుగైన వైద్య సేవలు అందిస్తారు. OMNI HOSPITALSలో ప్రధానంగా కార్డియాలజీ, CT సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆర్థో ఆంకాలజీ, పీడియాట్రిక్ మరియు నియోనాటల్ కేర్, జనరల్ మెడిసిన్ మరియు జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ, గైనకాలజీ మరియు ప్రసూతి సేవలు, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, లాపరోస్కోపిక్ సర్జరీలతో సహా 30 ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడం గమనార్హం.

Address:
Waltair Main Rd,
opp. Lions Club Of Ram Nagar,
Visakhapatnam, Andhra Pradesh 530002
Contact Number:0891 308 0300

ఇకపోతే Top 2 ప్లేస్‌లో APOLLO HOSPITALS ఉంది. ఇది వైజాగ్‌లోని రామ్‌నగర్‌లో ఏర్పాటయ్యింది. ఇది విశాఖపట్నంలోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. ఈ హాస్పిటల్ అపోలో హాస్పిటల్స్ గ్రూపులో ఒక భాగం. దేశవ్యాప్తంగా అనేక బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ గ్రూప్‌ను డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 1983లో స్థాపించారు. దేశంలోనే మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్‌గా అపోలో గుర్తింపుపొందింది. APOLLO HOSPITALSలో ప్రధానంగా కార్డియాలజీ, డెర్మటాలజీ, డయాబెటాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, గైనకాలజీ, హెపాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ, ఆప్తామాలజీ, పీడియాట్రిక్ తదితర సేవలను అందిస్తోంది. ఈ హాస్పిటల్ 24 గంటల పాటు నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోంది. విదేశాల నుంచి రోగులు అపోలో హాస్పిటల్స్‌కు వస్తుంటారు.

Address:
Door No 10,
Executive Court, 50-80,
Waltair Main Rd,
opp. Daspalla, Ram Nagar,
Visakhapatnam, Andhra Pradesh 530002
Contact Number:089127 27272

ఇకపోతే Top 1 ప్లేస్‌లో KIMS HOSPITALS ఉంది. ఇది వైజాగ్‌లోని ఉత్తమ హాస్పిటల్స్‌లో ఒకటి. ప్రపంచస్థాయి సాంకేతికతతో సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తోంది. ఇక్కడ ఆధునాతన సాంకేతికత, వైద్య చికిత్స విధానాలు, నిపుణులైన వైద్య సిబ్బందితో అత్యున్నత ఆరోగ్య సేవలను అందిస్తోంది. KIMS HOSPITALSలో 434 పడకల సామర్థ్యంతో 12 ఆపరేషన్ థియేటర్లతో అన్నిరకాల వైద్యసేవలతో నిరంతరం ప్రజలకు చేరువగా ఉంటోంది. అనస్థిషీయా, చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, డెర్మటాలజీ, కార్డియాలజీ, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ మెడిసిన్, డెంటల్ సేవలను అందిస్తోంది. కిమ్స్ హాస్పిటల్ పెద్ద నెట్‌వర్క్ గ్రూప్. KIMS HOSPITALS వైద్యసేవలతో పాటు వైద్యవిద్యను అందిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిమ్స్ హాస్పిటల్స్‌ను దశాబ్దాల కాలంగా విజయవంతంగా నడిపిస్తూ వైద్యరంగంలో ఎన్నో ఆవిష్కరణలను చేస్తోంది.

Address:
Iconkrishi Institute of Medical Sciences Private Limited,
# 32-11-02, Sheela Nagar,
BHPV Post, Vishakhapatnam,
Visakhapatnam – 530026,
Andhra Pradesh, India.
Contact Number: 0891 353 6379

Leave your vote

More

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings

close

Log In

Forgot password?

Forgot password?

Enter your account data and we will send you a link to reset your password.

Your password reset link appears to be invalid or expired.

Log in

Privacy Policy

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.