హైదరాబాద్‌లోని 10 Best Shopping Places ఇవే..
Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.
హైదరాబాద్ మహానగరం ఓ చారిత్రాత్మక ప్రాంతం. ఇక్కడ పురాతన చరిత్రకు ఎన్నో సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ అంటే మంచి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన గొల్కొండ, చార్మినార్, హుస్సేన్ సాగర్, సాలార్ జంగ్ మ్యూజియం తదితరాలే కాదు. మరెన్నో ప్రదేశాలు హైదరాబాద్ మహానగరంలో నిక్షిప్తమయ్యి ఉన్నాయి. నగరంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ప్రాంతాలే కాకుండా అంతకుమించి హైలెట్‌గా నిలిచే షాపింగ్ మార్కెట్స్ ఉన్నాయి. సొంత రాష్ట్రం ప్రజలే కాదు.. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు సైతం ఆ షాపింగ్స్ ప్రాంతాలను చూసి ఔరా అనాల్సిందే. ఈ మార్కెట్లలో గుండు పిన్ను దగ్గరి నుంచి ఏ వస్తువైనా దొరుకుతుంది. సాధారణ సాంప్రదాయ వస్తువల దగ్గరి నుంచి ప్రపంచ ప్రసిద్ధ డిజైనర్లు రూపొందిన డిజైన్ల వరకు అన్ని ఇక్కడి మార్కెట్లలో లభిస్తాయి. హైదరాబాద్‌లోని పలు మార్కెట్లలో షాపింగ్ చేయడం జీవితంలోనే మరిచిపోలేని మధురానుభూతిని సొంతం చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ మహానగరంలో అలాంటి షాపింగ్ ప్లేస్‌లు ఎక్కడ ఉన్నాయి..? అక్కడికి ఏలా వెళ్లాలి..? ఆ మార్కెట్ల స్పెషాలిటీ ఏంటి..? తదితర వివరాలతో హైదరాబాద్‌లోని 10 Best Shopping Places వివరాలను మీకోసం ఈ వీడియో రూపంలో అందిస్తున్నాం. ఈ వీడియోను పూర్తిగా చూసి హైదరాబాద్‌లోని 10 Best Shopping Placesలో మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి మధురానుభూతులను సొంతం చేసుకోండి.
ఇకపోతే Top 10 ప్లేస్‌లో Moazzam Jahi Market ఉంది. Moazzam Jahi Marketలో యాపిల్స్ నుంచి ఎండుద్రాక్ష వరకు, తుపాకుల నుంచి బుల్లెట్ల వరకు దొరకని వస్తువంటు ఉందడు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నాంపల్లికి సమీంలో మొజం జాహీ మార్కెట్ ఉంది. ఏ వస్తువైనా ఇక్కడే కొనుక్కోవచ్చు. Moazzam Jahi Marketను హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. 1935లో ఈ మార్కెట్ నిర్మించిన నిజాం రెండో కొడుకు ప్రిన్స్ మొజామ్ జా బహదూర్ పేరు పెట్టారు. దాదాపు 1.77 ఎకరాల్లో ఈ మార్కెట్ విస్తరించి ఉంది. ఈ మార్కెట్‌లో ఓ టవర్‌కు త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గోడ గడియారం హైలెట్‌గా నిలుస్తుంది. ఇక్కడ దాదాపు 100 షాపులతో పాటు ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ మార్కెట్ మొత్తం గ్రానైట్ రాళ్లతో నిర్మించి నిజాం రాజుల వైభవాన్ని తలపిస్తోంది. ఈ భవనం చారిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలవడమే కాదు. నగరవాసులకు కావాల్సిన అన్నిరకాల వస్తువులను ఇక్కడ కొనుగోలు చేసేలా షాపింగ్ కాంప్లెక్స్ అందుబాటులో ఉంటాయి. ఈ Moazzam Jahi Marketలో ప్రధానంగా పండ్లు, తాజా పూలు, సుగంధ ద్రవ్యాలు, మాంస ఉత్పత్తులు, కిరాణా సామాగ్రి, స్థానికంగా ఉత్పత్తి చేసే ఫర్‌ఫ్యూమ్, అత్తర్ తదితరాలతో పాటు క్లాత్ ఫాబ్రిక్, ఇక్కత్ వంటివన్నీ ఇక్కడ తక్కువ ధరలో కొనుగోలు చేయోచ్చు. ఈ మార్కెట్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ఇకపోతే Top 9 ప్లేస్‌లో Abids Market ఉంది. హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ వ్యాపార కేంద్రాల్లో Abids Market ఒకటి. అయితే నగరంలో ఎక్కడ షాపింగ్ చేసినా అబిడ్స్‌లో చేయకపోతే మీ షాపింగ్ పూర్తికానట్టే. ఎందుకంటే ఇక్కడి మార్కెట్‌లో ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫ్యాషన్ ఆభరణాలు, బ్యాగులు, చెప్పులు, షూస్, హస్తకళకు సంబంధించిన ఉత్పత్తులు, ఫుడ్ ఐటమ్స్.. ఇలా ఎన్నో రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. దీంతో పాటు ఇక్కడ సండే బుక్ బజార్‌ను ఆదివారం రోజు తప్పక చూడాల్సిందే. రోడ్డు వెంట ఏర్పాటు చేసే బుక్ బజార్‌లో దొరకని పుస్తకమంటూ ఉండదు. ఈ మార్కెట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ ఏలాంటి వస్తువైనా బయటి మార్కెట్ల కంటే తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. ఈ ప్రాంతాన్ని షాపర్స్ ప్యారడైజ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతం మొత్తం అనేక దుకాణాలతో, సందర్శకుల తాకిడితో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇంట్లో వినియోగించే అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, స్కూల్ యూనిఫామ్స్, నాణ్యమైన నూలు వస్త్రాలు వంటివన్నీ ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ బేరం ఆడడం దాదాపు అసాధ్యం. కానీ మీనా బజార్ వంటి ప్రదేశాల్లో డిస్కౌంట్ లో మీరు మంచి ధరకు వస్తువులను పొందవచ్చు.
ఇకపోతే Top 8 ప్లేస్‌లో General Bazaar ఉంది. ఈ మార్కెట్ సికింద్రాబాద్‌లోని కలసిగూడలో ఉంది. ఇక్కడ షాపింగ్ వస్తువుల నుంచి అనేక రకాల ఉత్పత్తులకు సంబంధించిన 300కు పైగా దుకాణాలు ఉన్నాయి. General Bazaarను పొగాకు మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఈ మార్కెట్‌లో అతి తక్కువ ధరకే అధునాతన జాకెట్లు,కుర్తా, జీన్స్, ఫ్యాన్సీ ఫుట్ వేర్, క్యాజువల్ బ్యాగులు, రంగురంగుల దుపట్టాలు, లోటస్ చెవిపోగులు, డ్రెస్ మెటీరియల్, ప్రింటెడ్ చీరలు, పొట్లీస్, పేపర్ గిఫ్ట్ బ్యాగులు ఇలా అన్నిరకాల జనరల్ వస్తువులు దొరకుతాయి. ఇక్కడ సాంప్రదాయ భారతీయ డిజైన్లతో పాటు విదేశీ సాంప్రదాయ వస్తువులు అతి తక్కువ ధరకే దొరుకుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. రూ.20 పెట్టి 10కి వస్తువులను కొనుగోలు చేయోచ్చు. ఈ మార్కెట్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఈ మార్కెట్‌కు లోకల్ ఆటోలు, షేరింగ్ ఆటో, బస్సుల్లో ఈజీగా చేరుకోవచ్చు. ఇదిలావుంటే.. పెళ్లి వస్త్రాల నుంచి నైట్ వేర్ వరకూ ఈ బజార్ లో తక్కువ ధరకు నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయి. సికింద్రాబాద్ లోని ఈ ఇరుకైన బజార్ లోకి వెళ్లే కొద్దీ వస్త్ర కలెక్షన్ సందర్శకులను అబ్బురపరుస్తుంది. దాదాపు 300 దుకాణాలు గల ఈ బజార్ లో అన్ని రకాల వస్త్రాలు, హ్యాండ్ లూమ్స్, మోడ్రన్ దుస్తులు కూడా నమ్మశక్యం కాని ధరల్లో దొరుకుతాయి. మగవారికి సంబంధించి షర్ట్స్, ట్రౌజర్లు, సూటింగ్ మెటీరియల్స్ కూడా లభిస్తాయి.
ఇకపోతే Top 7 ప్లేస్‌లో Sultan bazar ఉంది. హైదరాబాద్‌లోని ప్రధాన వాణిజ్య మార్కెట్లలో ఇది ఒకటి. Sultan bazar అబిడ్స్, కోఠి వాణిజ్య ప్రాంతాల మధ్య ఉంది. గతంలో దీన్ని రెసిడెన్సీ బజార్ అని పిలిచేవారు. అనంతర కాలంలో సయ్యద్ సుల్తానుద్దీన్ నవాబ్ పేరుమీదుగా సుల్తాన్ బజార్‌గా మార్చారు. ఇక్కడ నమ్మశక్యం కాని ధరల్లో వస్త్రాలను కొనుగోలు చేయోచ్చు. దాదాపు ఇక్కడ అన్ని వస్తువులను రోడ్డు పక్కన, ఫుట్ పాత్ లపై విక్రయిస్తుంటారు. ఇక్కడ కనిపించే విభిన్న రకాల కలెక్షన్ లు మీ సమయాన్ని కూడా మర్చిపోయేలా చేస్తాయి. మీరు కొనే వస్త్రాలకు సంబంధించి మ్యాచ్ అయ్యే ఫుట్ వేర్ తో సహా అన్ని వస్తువులు ఇక్కడ లభిస్తాయి. గృహాలంకరణ వస్తువులు, పిల్లో కవర్లు, హ్యాండ్ బ్యాగ్స్ వంటివి మీ బడ్జెట్ ధరల్లోనే కొనుగోలు చేయవచ్చు.
ఇకపోతే Top 6 ప్లేస్‌లో Nampally Exhibition ఉంది. ఈ ఎగ్జిబిషన్ ను ప్రతి ఏటా జనవరి మొదటి నుంచి ఫిబ్రవరి 15 వరకూ 45 రోజుల పాటూ ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరాటంకంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రకాల వస్త్రాలు, సరికొత్త మోడల్స్ దుస్తులు మీకు ఇక్కడ దొరుకుతాయి. తెలివిగా బేరం ఆడగలిగితే అందుబాటు ధరలోనే మీకు నచ్చిన వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ ఎగ్జిబిషన్ లో కావాల్సినంత వినోదాన్ని కూడా పొందవచ్చు. 1938, ఏప్రిల్ 6 తేదిన అప్పటి ముల్కి ఉస్మాన్ అలీఖాన్ జన్మదినం సందర్భంగా పబ్లిక్ గార్డెన్‌లో తొలిసారిగా నుమాయిష్‌ను ప్రారంభించారు. అప్పట్లోనే దాదాపు 3 లక్షల రూపాయలతో 100 పైగా స్టాల్స్‌తో నుమాయిష్‌ను ఏర్పాటు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ స్టాల్స్ సంఖ్య దాదాపు 3 వేలకు పైగా పెరిగింది. కాశ్మీర్ వస్త్రాల దగ్గర నుండి డ్రైఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇరాన్ తివాచీలు.. ఇలా ఎన్నో ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. 2012 వరకు పాకిస్తాన్ నుంచి కూడా వర్తకులు వచ్చి తమ సామాన్లను అమ్మేవారు. అయితే ఆ తర్వాత వారికి అనుమతిని నిరాకరించారు. ఇదిలావుంటే.. ఎగ్జిబిషన్‌కు భారతదేశంలో ఉన్న నలుమూలల నుంచి వచ్చి తాము తయారు చేసిన రకరకాల వస్తువులను ప్రదర్శిస్తారు. అలాగే ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్‌లో ఉండే హస్తకళలను, చేనేత వస్త్రాలను, డ్రై ఫ్రూట్స్, జమ్మూ కాశ్మీర్ హస్తకళలు, మహిళలకు సంబంధించి ప్రత్యేక స్టాల్స్, పిల్లలు ఇష్టపడే అన్ని రకాల ఆటవస్తువులు, ఇంట్లోకి అవసరమైన ఫర్నిచర్, తివాచీలు ఈ ప్రదర్శనశాలలో ఉంటాయి. అలాగే ఎగ్జిబిషన్‌లో హైదరాబాదీ రెస్టారెంట్ వద్ద హైదరాబాద్‌కే ప్రత్యేకమైన హలీమ్, పిస్తాహౌస్‌లో మీకిష్టమైన పదార్థాలు లభిస్తాయి.
ఇకపోతే Top 5 ప్లేస్‌లో Shahran Market ఉంది. Shahran Marketను షహ్రాన్ బజార్ అని కూడా పిలుస్తారు. చార్మినార్ లాడ్ బజార్ సమీపంలో ఈ మార్కెట్ ఉంటుంది. ఇది ఆధునిక మార్కెట్. ఇక్కడ బుర్కా, సల్వార్ సూట్లు, చీరలు వంటి అనేక రకాల సాంప్రదాయ దుస్తులు ఎక్కువగా దొరకుతాయి. ఇది సాధారణంగా లేడీస్ మార్కెట్‌గా చెప్పుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ఇతర వస్తువులు ఎక్కువగా దొరుకుతున్నాయనే చెప్పాలి. షహరాన్ మార్కెట్‌లో గల్ప్ దేశాల నుంచి దిగుమతైన వస్తువులు దొరుకుతాయి. అత్తర్లు, సెంట్లు, బుర్కాలు, లుంగీలు, వస్ర్తాలు, గృహోపకరణాలు ఉంటాయి. అయితే స్ట్రీట్ షాపింగ్ ప్రేమికులకు ఇది మంచి షాపింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ షాపింగ్ చేయడంతో పాటు గుమగుమలాడించే హలీమ్ రుచులను ఆస్వాదించవచ్చు. ఈ Shahran Market ప్రతి గురువారం మాత్రమే ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
ఇకపోతే Top 4 ప్లేస్‌లో Perfume Market ఉంది. చార్మినార్ సమీపంలో లాడ్ బజార్ అండ్ మోతీ చౌక్ మధ్య హైదరాబాద్ పెర్ఫ్యూమ్ మార్కెట్ ఉంది. ఇక్కడ చాలా పెద్దసంఖ్యలో Perfume దుకాణాలు ఉంటాయి. ఇతర దేశాల్లోని Perfumeలతో పాటు స్థానికంగా తయారైన Perfume సైతం ఇక్కడ దొరుకుగతాయి. ఆల్కహాల్ ఆధారిత పెర్ఫ్యూమ్‌ల లాగా కాకుండా, వీటిని కస్తూరి, మల్లె మరియు గులాబీ వంటి సువాసన, గంధపు నూనెతో తయారు చేస్తారు. ఈ మార్కెట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నిPerfumeలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ 1987 నుంచి Perfume దుకాణాలు ఉన్నాయి. రంజాన్ మాసంలో ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. Perfume Market ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
ఇకపోతే Top 3 ప్లేస్‌లో Shilparamam ఉంది. శిల్పారామం ఆర్ట్స్, చేతిపనులతో రూపొందించిన ఇది గ్రామం మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణలో ఉంది. సాంప్రదాయ చేతిపనుల పరిరక్షణకు వాతావరణాన్ని సృష్టించే ఆలోచనతో ఈ గ్రామం ఉద్భవించింది. ఏడాది పొడవునా జాతి ఉత్సవాలు నిర్వహిస్తారు. భారతదేశంలోని హైటెక్ హబ్ నగరంలో 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శిల్పారామం సంప్రదాయం, సాంస్కృతిక వారసత్వం యొక్క సుందరమైన వాతావరణాన్ని ఇస్తుంది. భారతీయ కళలు, చేతిపనుల ప్రోత్సాహం సంరక్షణ కోసం చేతివృత్తులవారిని ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం 1992 సంవత్సరంలో ఈ వేదికను ఏర్పాటు చేసింది. సాంప్రదాయ ఆభరణాలు, చేతితో నేసిన చీరలు, శాలువాలు, దుస్తులు, బెడ్‌షీట్లు మొదలైన వాటికి భిన్నంగా భారతదేశం నలుమూలల నుండి వచ్చిన హస్తకళాకారులు తమ చెక్క మరియు లోహ వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తారు. నిజానికి ప్రత్యేకమైన షాపింగ్ కు హైదరాబాద్ లోని మరో గమ్యస్థానం శిల్పారామం క్రాఫ్ట్స్ విలేజ్. హాలిడే సమయాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ వినోదభరితంగా గడపడంతో పాటు షాపింగ్ కూడా చేయవచ్చు. వివిధ రకాల హస్త కళలకు సంబంధించిన వస్తువులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన హ్యాండ్ లూమ్ డ్రెస్ మెటీరియల్స్ ను కూడా విక్రయిస్తారు. ఎంబ్రాయిడరీ వస్త్రాలు, గృహాలంకరణ వస్తువులు మీకు అందుబాటు ధరల్లో లభిస్తాయి. శిల్పారామంలో షాపింగ్ చేస్తూ సమయం గడపడం టూరిస్టులకు మంచి కాలక్షేపం అని చెప్పవచ్చు. కళా ప్రియుల కోసం, ఓపెన్ థియేటర్‌లో ఎల్లప్పుడూ కూర్చునే సదుపాయంతో డ్యాన్స్ ప్రదర్శనలు, కార్యక్రమాలు జరుగుతాయి. వీటిని మీరు ఉచితంగా చూడవచ్చు. బోటింగ్‌కు కూడా సౌకర్యం ఉంది. మాదాపూర్‌లో ఉన్న శిల్పారామం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ఇకపోతే Top 2 ప్లేస్‌లో Begum Bazaar ఉంది. ఈ Begum Bazaar అఫ్జల్ గంజ్‌లో ఉంది. ఈ బజారు ఆదివారం మినహా మిగతా రోజుల్లో తెరిచి ఉంటుంది. ఇదిలావుంటే.. అప్పట్లో నిజాం అలీ ఖాన్ నిజాముల్ ముల్క్ తన భార్య హుందా బేగమ్ కు ఈ స్థలాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆమె పేరు మీదనే ఈ ప్రాంతం బేగమ్ మార్కెట్ గా ప్రసిద్ధి చెందింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హోల్ సేల్ & రిటైల్ మార్కెట్ లో వస్త్రాలు, ఆహార తయారీకి ఉపయోగించే సరకులు, మసాలా దినుసులు వంటి అనేక రకాల వస్తువులు దొరుకుతాయి. ఛార్మినార్, ఉస్మానియా ఆసుపత్రికి ఈ బజార్ దగ్గరగా ఉంటుంది. Begum Bazaarలో వస్త్రాలు, గృహోపకరణ సామాగ్రి, ఇత్తడి సామాగ్రి, సౌందర్య ఉత్పత్తులతో పాటు మరికొన్ని వస్తువులకు ప్రత్యేక ప్రాంతంగా చెప్పొచ్చు. ఇక్కడ రిటైల్ దుకాణాలే కాదు హోల్‌సెల్ దుకాణాలు ఉంటాయి. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా.. బేరం ఆడటం ప్రధానమనే చెప్పాలి. Begum Bazaarలో గృహోపకరణాలు, వంటగది సామగ్రి, పరిమళ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు, డ్రై ఫ్రూట్స్, బంగారం, వెండి తదితర వస్తువులన్నీ దొరకడం ఇక్కడి ప్రత్యేకత.
ఇకపోతే Top 1 ప్లేస్‌లో Laad bazaar ఉంది. ఈ బజారు గాజులకు ఫేమస్. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి గాజుల కోసమే ప్రత్యేకంగా మార్కెట్ నడుస్తుంది. చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో ఈ Laad bazaar ఉంది. వాస్తవానికి ఈ Laad bazaar కులీ కుతుబ్ షా వివాహ వేడుకల కోసం నిర్మించిందని చెబుతుంటారు. ఈ బజార్ మొత్తం లక్షలకొద్దీ రంగు రంగుల గాజుల కలెక్షన్ తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వీటిని చూస్తూ మైమరచిపోకుండా మీకు నచ్చిన గాజులను మీ సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ బజార్ కేవలం గాజులకు మాత్రమే కాదు వస్త్రాలకు కూడా ప్రసిద్ధి. అన్ని రకాల వస్త్ర కలెక్షన్ లభించకపోయినా సాంప్రదాయ వస్త్రాలు, ఖారా దుప్పట్టాలు, సిల్క్ చీరలు వంటి వివిధ ఆకర్షణీయమైన కలెక్షన్స్ లభిస్తాయి. ఈ బజారులో కిలోమీటరు మేర గాజుల దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ లక్కతో చేసిన గాజుల దగ్గరి నుంచి కృత్రిమ రత్నాలతో చేసిన గాజుల వరకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ గాజుల దుకాణాలు 200 సంవత్సరాలుగా ఏర్పాటు చేసినవి ఉన్నాయి. Laad bazaar ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.