Home Best of Health Top 5 Cancer Hospitals in Hyderabad

Top 5 Cancer Hospitals in Hyderabad

0
157
Top 5 Cancer Hospitals in Hyderabad | Best Oncology Hospitals in Hyderabad

హైదరాబాద్‌లోని Top 5 Oncologist(Cancer Specialist) వీరే..

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

ప్రపంచ మానవాళిని క్యాన్సర్ మహమ్మారి విపరీతంగా భయపెడుతోంది. ఒకప్పటి వరకు క్యాన్సర్‌కు తగిన వైద్యం లేక ఎంతోమంది ప్రాణాలొదిలారు. ఒకవేళ వైద్యం ఉన్నా.. ఏ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం.. అది భారీ వ్యయప్రయాసలతో కూడుకుని ఉండడం సమస్యగా మారేది. అయితే ప్రస్తుతం వైద్యరంగంలో భారీ మార్పులు వచ్చాయి. క్యాన్సర్ మహమ్మారిని జయించేందుకు పలురకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మన హైదరాబాద్ నగరంలోనూ క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించేందుకు ఎంతోమంది Cancer Specialist అందుబాటులోకి వచ్చారు. అయితే అందులో Top 5లో ఎవరు ఉన్నారు..? వారి అపాయింట్‌మెంట్ పొందడం ఏలా..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకేముంది.. ఈ వీడియోనూ చూసి హైదరాబాద్ మహానగరంలో Top 5 Oncologist(Cancer Specialist)లను సంప్రదించి క్యాన్సర్‌ను ఏలాంటి భయం లేకుండా జయించండి.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Dr.Mohana Vamsy ఉన్నారు. ఇండియాలోని సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్టుల్లో Dr. Mohana Vamsy ఒకరు. దేశంలోనే సుప్రసిద్ధమైన పాండిచ్చేరిలోని జిప్‌మర్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం అదే ఇనిస్టిట్యూట్‌లో జనరల్ సర్జరీలో స్పెషలైజేషన్‌తో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూ‌ట్‌లో సర్జరీ ఆంకాలజీ చేయగా, న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డును అందుకున్నారు. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి లాపరోస్కోపీ సర్జరీలో డిప్లొమా కూడా పొందారు. అనంతరం అడయార్‌లోని క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో సర్జరీ ఆంకాలజీలో రిజిస్ట్రార్‌గా పనిచేశారు. 1993 నుంచి 1994 వరకు మణిపాల్‌లోని కస్తూర్భా మెడికల్ కాలేజీలో సర్జికల్ ఆంకాలజీలో, 1994 నుంచి 1999 వరకు ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2002 వరకు అపోలో హాస్పిటల్‌లో సర్జికల్ ఆంకాలజీ విభాగం హెడ్‌గా, 2010 వరకు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒమేగా హాస్పిటల్స్‌లో చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్‌గా ఉన్నారు. ఇకపోతే ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

Adress:

Omega Hospitals

Plot No: 8-2-293/82/L/276A, MLA Colony,

Road No – 12,Banjara Hills,

Hyderabad, Telangana, 500034.

Contact Number: 9848011421

ఇకపోతే Top 4 ప్లేస్‌లో DR.T.SUBRAMANYESHWAR RAO ఉన్నారు. ఈయనకు సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. Dr. T Subramanyeshwar 1988లో కాకతీయ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి ఎంఎస్ సర్జన్, 1993లో అదే కాలేజీలో సర్జికల్ ఆంకాలజీ పూర్తి చేశారు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ, హైదరాబాద్ సర్జన్స్ సొసైటీలో సభ్యుడిగా ఉన్నారు. ఈయనకు వైద్యవిద్య బోధించడంలోనూ సుదీర్ఘ అనుభవం ఉంది. 2015 సంవత్సరంలో హెల్త్ కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డను సైతం అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో 45కు పైగా పబ్లికేషన్స్ ప్రచురితమయ్యాయి.  ఇకపోతే Dr. T. SUBRAMANYESHWAR RAO ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.300 ఛార్జ్ తీసుకుంటారు.

Adress:

Basavatarakam Indo American Cancer Hospital & Research Institute

Road No 10, Banjara Hills

Hyderabad 500034, Telangana

COntact Number: 040 4917 0222

ఇకపోతే Top 3 ప్లేస్‌లో Dr. Jagadishwar Goud Gajagowni ఉన్నారు. Dr. Jagadishwar Goud Gajagowni రోబోటిక్ సర్జరీ వాడకంలో ముందంజలో ఉన్నారు. ఆంకాలజీ విభాగంలో దాదాపు 29 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ఇన్‌ఫెక్షన్ రహిత సర్జరీ చేసేందుకు హాస్పిటల్‌లో అత్యాధునిక పరికరాలను వినియోగిస్తారు. అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌లో సర్జికల్ ఆంకాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ హెడ్‌గా ఉన్నారు. రోబోటిక్ సైన్స్ రంగంలో ఈయన దేశంలోని టాప్ సర్జికల్ ఆంకాలజిస్టుల్లో ఒకరు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌తో ఎంఎస్ పూర్తి చేశారు. బెంగళూరులోని క్విడాయ్ మోమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ విభాగానికి రిజిస్ట్రార్‌గా పనిచేశారు. 1999 నుంచి 2005 వరకు ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్‌లో అసోసియేట్ ప్రోఫెసర్‌గా, 2016 నుంచి 2020 వరకు యశోదా హాస్పిటల్‌లో సీనియర్ సర్జికల్ ఆంకాలజీలో పనిచేశారు. 2020 నుంచి ఇప్పటివరకు అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్నారు. ఇకపోతే ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజు రూ.700 తీసుకుంటారు.

Adress:

American Oncology Institute

1-100/1/CCH, Nallagandla,

Seri Lingampally,

Landmark: Near Aparna Sarovar,

Hyderabad.

Contact Number: 044 4627 1079

ఇకపోతే Top 2 ప్లేస్‌లోDr.Babaiah M ఉన్నారు. ఈయన హైదరాబాద్‌లోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో మెడికల్ డైరెక్టర్, చీఫ్ రేడియేషన్ ఆంకాలజిస్టుగా ఉన్నారు. Dr.Babaiah M 30 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని క్యాన్సర్ బాధితులకు తన సేవలను అందిస్తున్నారు. ఈయన కృషి వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని రేడియేషన్ ఆంకాలజీ ముఖచిత్రాన్నే మార్చేసిందని చెప్పొచ్చు. 1980లో కంప్యూటరైజ్డ్ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి రేడియేషన్ ఆంకాలజిస్ట్ Dr.Babaiah M కావడం గమనార్హం. క్యాన్సర్ విభాగంలో ఎన్నో విప్లవాత్మక సాంకేతిక ట్రీట్‌మెంట్‌ను పరిచయం చేశారు. ఆయన విశేష సేవల వల్ల తొలిసారిగా కార్పొరేట్ తరహాలో హైదరాబాద్ నగరంలో RAPID ARC ట్రీట్‌మెంట్‌ను తీసుకురావడం సాధ్యపడింది. 1975లో కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, న్యూఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రేడియేషన్ ఆంకాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఇకపోతే ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.

Adress:

MEDICOVER CANCER INSTITUTE

opposite cyber gateway, beside Ibis hotel,

HUDA Techno Enclave, HITEC City,

Hyderabad- 500081

Contact Number: 040 6902 4455

ఇకపోతే Top 1 ప్లేస్‌లో Dr palkonda vijay Anand Reddy ఉన్నారు. ఈయన తన 28 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఎన్నో అవార్డులు, ప్రజంటేషన్లు, పబ్లికేషన్స్‌తో ముందుకు సాగారు. క్యాన్సర్ రోగులకు విశేష సేవలు అందించి ప్రపంచ ప్రఖ్యాత ఆంకాలజిస్టుగా గుర్తింపు పొందారు. 1992లో స్విట్జర్లాండ్‌లోని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సాంకేతిక అవార్డుతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. Dr palkonda vijay Anand Reddy రేడియేషన్ థెరపీలోనే కాకుండా మెడికల్ ఆంకాలజీలోనూ విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నారు. క్యాన్సర్ రంగంలో తన సేవలను అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలోనే కాకుండా ఇతర ఖండాల్లోనూ అందించి క్యాన్సర్ చికిత్సలో గ్లోబల్ మాస్టర్‌గా నిలిచారు. ఇకపోతే ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.500 తీసుకుంటారు.

Adress:

Dr Vijay Anand Reddy,

Director office Ground Floor,

Apollo Cancer Hospital,

Apollo Health City, Jubilee Hills,

Hyderabad- 500096

Contact Number: 040 2355 6357

ఓకే ఫ్రెండ్స్ చూశారుగా.. హైదరాబాద్‌లోని Top 5 Oncologist (Cancer Specialist ఎవరో తెలుసుకున్నారుగా.. మరెందుకు ఆలస్యం. క్యాన్సర్ బాధితులతో పాటు క్యాన్సర్ అనుమానిత లక్షణాలు కన్పించిన వారు సైతం ప్రముఖ క్యాన్సర్ వైద్యులను సంప్రదించొచ్చు. తద్వారా ప్రమాదకరమైన క్యాన్సర్‌ను జయింది మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. అంతేకాదండోయ్.. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.. షేర్ చేయండి. మా ఆదాన్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిగ్నల్‌ను నొక్కండి. ఎప్పటికప్పుడు మేం చేసే లెటెస్ట్ అప్‌డెట్స్ నోటిఫికేషన్ రూపంలో పొందండి. థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్.

Leave your vote

More

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings

close

Log In

Forgot password?

Forgot password?

Enter your account data and we will send you a link to reset your password.

Your password reset link appears to be invalid or expired.

Log in

Privacy Policy

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.