హైదరాబాద్‌లోని Top 5 Cancer/Oncology హాస్పిటల్స్ ఇవే..?
Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.
ప్రస్తుతం సగటు మానవాళిని ఆందోళనకు గురిచేస్తోన్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఒకప్పటి వరకు క్యాన్సర్ వచ్చిందంటే.. బతకడం కష్టమని చెప్పేవారు. ప్రధానంగా గర్భాశయ క్యాన్సర్, రొమ్ము, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకల క్యాన్సర్, ప్యాంక్రియాటిక్, కాలేయ, కడుపు క్యాన్సర్ తదితర రూపాల్లో క్యాన్సర్ వ్యాధిని మానవుల్ని పట్టిపీడిస్తోంది. గతంలో క్యాన్సర్ చికిత్స తీసుకునేందుకు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం వైద్యరంగంలో కీలక మార్పులు సంభవించాయి. చికిత్స లేని వైద్యమంటూ దాదాపుగా లేదు. నిజానికి క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ పద్ధతుల్లో చికిత్స చేస్తుంటారు. అందులో క్యాన్సర్‌కు సైతం కొంత ఊరటనిచ్చే చికిత్స అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి క్యాన్సర్ చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమంటూ చాలామంది చెబుతుంటారు. నిజానికి క్యాన్సర్ చికిత్సకు ఆ పరిస్థితులు పోయాయి. క్యాన్సర్ చికిత్స కోసం మరెక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. మన హైదరాబాద్ మహానగరంలోనే అత్యాధునిక క్యాన్సర్ ట్రీట్‌మెంట్ అందుబాటులోకి వచ్చింది. దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి క్యాన్సర్ బాధితులు హైదరాబాద్ నగరానికే వలసవస్తున్నారు. అయితే క్యాన్సర్ బాధితులకు ఎక్కడ మంచి వైద్యం అందుతుంది..? ఏ హాస్పిటల్ అయితే బెటర్..?, హైదరాబాద్ మహానగరంలో Top 5 Cancer/ Oncology Hospitals ఏమిటి..? అనే వివరాలను మీకోసం సమగ్రంగా అందిస్తోది Aadhan Telugu.
ఇకపోతే Top 5 ప్లేస్‌లో AIG హాస్పిటల్ ఉంది. AIG హాస్పిటల్‌లో అన్నిరకాల క్యాన్సర్‌కు చికిత్స అందించే విధంగా రూపుదిద్దుకుంది. ఈ హాస్పిటల్ ఆసియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకి చెందిన ఒక యూనిట్. ఇండియాలోనే ఇది 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఇనిస్టిట్యూట్‌గా చెబుతుంటారు. ఇక్కడ మెడికల్ ఆంకాలజిస్టులు, సర్జికల్ ఆంకాలజిస్టులు, రేడియేషన్ ఆంకాలజిస్టులు, పాథాలజిస్టులు, రేడియాలజిస్టుల నిరంతరం పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ అందుతుంది. AIG హాస్పిటల్‌లో సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీలుగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్, గ్యాస్ట్రోఇన్‌టెన్షియల్ క్యాన్సర్, గైనకాలజికల్ ఆంకాలజీ, హెడ్ అండ్ నెక్ ఆంకాలజీలకు సూపర్ స్పెషాలిటీ చికిత్స అందిస్తారు.
Adress:
AIG HOSPITALS, GACHIBOWLI (A UNIT OF ASIAN INSTITUTE OF GASTROENTEROLOGY)
Plot No 2/3/4/5, Survey No 136/1
Mindspace Road, Gachibowli
Hyderabad, Telangana 500032
Contact Number:40-4244 4222/ 6744 4222
ఇకపోతే Top 4 ప్లేస్‌లో American Oncology Institute ఉంది. హైదరాబాద్ నగరంలోని అత్యున్నత క్యాన్సర్ ఆస్పత్రుల్లో అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ ఒకటి. ఇక్కడ ప్రపంచస్థాయి సాంకేతిక ప్రమాణాలతో క్యాన్సర్ వ్యాధిని నయం చేసేందుకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు సమీప ప్రాంతాల్లోని క్యాన్సర్ పేషంట్లకు సరైన చికిత్సను అందించేందుకు యూఎస్‌లోని పిట్స్‌బర్గ్ మెడికల్ యూనివర్సిటీలోని ప్రముఖ ఆంకాలజిస్టుల బృందం American Oncology Instituteను స్థాపించింది. హైదరాబాద్ నల్లగండ్లలో 10.5 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్‌లో రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ పద్ధతుల్లో చికిత్సను అందిస్తున్నారు. ఈ హాస్పిటల్‌లో హేమాటో ఆంకాలజీ, పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ ఉండడం ప్రత్యేకతగా చెప్పొచ్చు.
AdressG
American Oncology Institute (Cancer Treatment Hospital) – Hyderabad
1-100/1/CCH Citizens Hospital Road,
near Aparna Sarovar, Nalagandla,
Telangana 500019
Contact Number: 18002082000
ఇకపోతే Top 3 ప్లేస్‌లో Omega Hospital ఉంది. వాస్తవానికి ఇండియాలో క్యాన్సర్ రోగులకు సరైన చికిత్స అందించకపోవడాన్ని డాక్టర్ సీహెచ్ మోహన్ వంశీ గుర్తించారు. ఆయన అనేక తర్జనభర్జనల తర్వాత జూలై 2010లో ఒమేగా హాస్పిటల్‌ను క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా తన సహచరులతో కలిసి ప్రారంభించారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌ను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఒమేగా హాస్పిటల్ పురుడుపపోసుకుంది. ఒమేగా హాస్పిటల్స్ ప్రస్తుతం నాలుగు ప్రాంతాల్లో యూనిట్లను ఏర్పాటు చేసింది. అయితే హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ యూనిట్‌లో సంవత్సరానికి 89,500 పేషంట్లు వస్తుంటారు. ఇందులో ఓపీ పేషంట్లు పోగా 24,500 మంది పేషంట్లు అడ్మిట్ అయ్యారు. ఒమేగా హాస్పిటల్ ప్రారంభ సమయలోనే వీమ్యాట్ VMAT రేడియేషన్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేసిన ఏకైక హాస్పిటల్ ఒమేగా కావడం గమనార్హం.
ఇకపోతే ఒమేగా హాస్పిటల్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు 9.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు, శని, ఆదివారాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
Adress:
Omega Hospitals
Plot No: 8-2-293/82/L/276A, MLA Colony,
Road No- 12,Banjara Hills,
Hyderabad, Telangana, 500034.
For Appointments: 9848 011421
ఇకపోతే Top 2 ప్లేస్‌లో Apollo Cancer Hospital ఉంది. Apollo Cancer Hospital హైదరాబాద్‌లో అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్‌గా గుర్తింపు పొందింది. ఈ హాస్పిటల్ Head & Neck Oncology, Haemoto Oncology, Urological Oncology, Orthopaedic Oncology, Gynecological Oncology along with Specialty Clinics for Breast Cancer, Musculoskeletal Cancers, Bone Sarcoma Clinic, Oral and Throat Cancersకు ట్రీట్‌మెంట్ అందిస్తోంది. అయితే అపోలో హాస్పిటల్ ఇండియాలోనే మొట్టమొదటి పీఈటీ సీటీ స్కానర్ ఉన్న హాస్పిటల్‌గానూ గుర్తింపు ఉంది. అపోలో హాస్పిటల్ హైదరాబాద్‌లో తొలిసారిగా 1988లో ప్రపంచానికి పరిచయమయ్యింది. దాదాపు 30 సంవత్సరాల నిరంతర సేవల అనంతరం ఆసియాలోనే అత్యంత ప్రసిద్దమైన హాస్పిటల్ గుర్తింపు తెచ్చుకుంది.
Adress:
Apollo Hospitals Hyderabad
Road No 72, Opp. Bharatiya Vidya Bhavan School Film Nagar,
Jubilee Hills, Hyderabad, Telangana 500033
Hyderabad – 500 033, Telangana
Contact Number: 40-2360 7777/ 5555/ 2000
ఇక Top 1 ప్లేస్‌లో Basavatarakam Indo American Cancer Hospital and Research Institute ఉంది. ఇది ఏలాంటి లాభాపేక్ష లేని హాస్పిటల్‌గా బసవతారకం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడపబడుతోంది. అత్యంత తక్కువ ఖర్చుతో క్యాన్సర్ రోగులకు ఇక్కడ ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇక్కడ ఒక్క తెలంగాణ నుంచే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులు వస్తుంటారు. బసవతారకం హాస్పిటల్‌లో అత్యంత అర్హత కలిగిన వైద్యులతో ట్రీట్‌మెంట్ దొరుకుతుంది. ఇందులో 9 ఆపరేషన్ థియేటర్స్, 4 సర్జికల్ ఐసీయూలు ఉండగా, ఒక్కోదానిలో 11 బెడ్స్, మరో ఐసోలేషన్ రూమ్ ఉంటుంది. దీంతో పాటు 12 బెడ్స్, రెండు ఐసోలేషన్ గదులతో ఒక మెడికల్ ఐసీయూతో పాటు మరికొన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ హాస్పిటల్‌లో చికిత్స కోసం వచ్చిన రోగుల సహాయకుల కోసం ప్రత్యేకమైన వంటగది, గెస్ట్‌హౌస్ ఫెసిలిటీ ఉంది. ఉచిత డార్మెటరీతో పాటు ఉచిత ఆహారం, వసతిని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కల్పిస్తోంది. అంతర్జాతీయ రోగులను సైతం ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స చేస్తారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో రోగికి మెడిసిన్ ఇబ్బందుల్లేకుండా నెల రోజులకు సరిపడా మెడిసిన్ ఇస్తారు. ముస్లిం రోగుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే రోగులకు వైద్యులు సూచించిన డైట్ ప్రకారమే ఆహారం అందిస్తారు.
Adress:
Basavatarakam Indo American Cancer Hospital & Research Institute
Road No 10, Banjara Hills,
Hyderabad 500034, Telangana.
Contact Number: 040-23551235, 040-23556655
GIPHY App Key not set. Please check settings