Top 5 Cancer Hospitals in Vijayawada

280
0
Top 5 Cancer Hospitals in Vijayawada | Best Oncology Hospitals in Vijayawada

ప్రస్తుతం సగటు మానవాళిని ఆందోళనకు గురిచేస్తోన్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఒకప్పటి వరకు క్యాన్సర్‌ వచ్చిందంటే.. బతకడం కష్టమని చెప్పేవారు. ప్రధానంగా గర్భాశయ క్యాన్సర్, రొమ్ము, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకల క్యాన్సర్, ప్యాంక్రియాటిక్, కాలేయ, కడుపు క్యాన్సర్ తదితర రూపాల్లో క్యాన్సర్ వ్యాధిని మానవుల్ని పట్టిపీడిస్తోంది. గతంలో క్యాన్సర్ చికిత్స తీసుకునేందుకు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం వైద్యరంగంలో కీలక మార్పులు సంభవించాయి. చికిత్స లేని వైద్యమంటూ దాదాపుగా లేదు. నిజానికి క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ పద్ధతుల్లో చికిత్స చేస్తుంటారు. అందులో క్యాన్సర్‌కు సైతం కొంత ఊరటనిచ్చే చికిత్స అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి క్యాన్సర్ చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమంటూ చాలామంది చెబుతుంటారు. నిజానికి క్యాన్సర్ చికిత్సకు ఆ పరిస్థితులు పోయాయి. క్యాన్సర్ చికిత్స కోసం మరెక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. మన విజయవాడ నగరంలోనే అత్యాధునిక క్యాన్సర్ ట్రీట్‌మెంట్ అందుబాటులోకి వచ్చింది. దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి క్యాన్సర్ బాధితులు విజయవాడ నగరానికే వలసవస్తున్నారు. అయితే క్యాన్సర్ బాధితులకు ఎక్కడ మంచి వైద్యం అందుతుంది..? ఏ హాస్పిటల్ అయితే బెటర్..?, విజయవాడ నగరంలో Top 5 Cancer/ Oncology Hospitals ఏమిటి..? అనే వివరాలను మీకోసం సమగ్రంగా అందిస్తోది మీ Aadhan Telugu.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Nagarjuna Cancer Centre ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్‌లో ఒకటి. Nagarjuna Cancer Centreలో నిపుణులైన కన్సల్టెంట్లు, వైద్యాధికారులతో పాటు అర్హత కలిగిన నర్సుల బృందం నేతృత్వంలో అత్యాధునిక వైద్య సాంకేతికతతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ క్యాన్సర్ వైద్యంతో పాటు కార్డియాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్స్, నెఫ్రాలజీ, ఆంకాలజీ, యూరాలజీ, న్యూరాలజీతో పాటు మరికొన్ని విభాగాల్లోనూ చికిత్స అందిస్తుంది. 140 పడకల సామర్థ్యంతో 4.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గతంలో కోస్తా జిల్లాల ప్రజలు అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ లేదా చెన్నై వెళ్లాల్సి వచ్చేది.  హాస్పిటల్స్ దూరంగా ఉండడంతో సకాలంలో అక్కడికి చేరుకోలేకపోయేవారు. ఇలాంటి పరిస్థితుల్లో 1987లో లండన్‌లో హాస్పిటల్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కె.జగన్ మోహన్ రావు నేతృత్వంలో ఏడుగురు వైద్యులు సమావేశమై.. విజయవాడలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాని ఫలితంగానే నాగార్జున క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటయ్యింది. ఇందులో అతి తక్కువ ధరలకే క్యాన్సర్ వైద్యం అందిస్తున్నారు.

Address:
8-102,
Kanuru Main Rd,
Kamayyathopu, Chalasani Nagar,
Ashok Nagar, Vijayawada,
Andhra Pradesh 520007
Contact Number: 9963414242

ఇకపోతే Top 4 ప్లేస్‌లో RAVI’S AMERICAN CANCER CARE ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్‌లో ఒకటి. నిత్యం భయాందోళనగా ఉండే క్యాన్సర్ పేషంట్లకు స్నేహాపూర్వక వాతావరణంలో ట్రీట్‌మెంట్ అందిస్తుంటారు. మెడికల్ ఆంకాలజిస్టు, హెమటాలజిస్ట్‌ల ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులకు ప్రత్యేక చికిత్స అందిస్తుంటారు. RAVI’S AMERICAN CANCER CAREలో డాక్టర్ రవికిరణ్ బొబ్బా క్యాన్సర్‌ వ్యాధిని నయం చేసేందుకు నిరంతరం రోగులకు అందుబాటులో ఉంటారు. ఈయన సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీస్ పూర్తి చేయడంతో పాటు యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ వర్జనీయా స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఇంటర్నల్ మెడిసిన్ కంప్లీట్ చేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో హెమటాలజీ, మెడికల్ ఆంకాలజీలో సూపర్ స్పెషాలిటీ చేశారు. దీంతో ఆయన క్యాన్సర్ వ్యాధి నిర్మూలనపై మంచి పట్టు సాధించారు.

Address:
D.No 40-6, 2-1&2,
Kanakamedala Seshagiri Rao Rd,
Mogalrajapuram, Sidhartha Nagar,
Labbipet, Vijayawada,
Andhra Pradesh 520010
Contact Number:8985090909

ఇకపోతే Top 3 ప్లేస్‌లో Manipal Hospital ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్‌లో ఒకటి. Manipal Hospital 250 పడకల సామర్థ్యంతో 50 మంది సూపర్ స్పెషాలిటీ కన్సల్టెంట్లతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలతో పాటు ల్యాబ్ సేవలు, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన అలోజెనిక్, ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసిన మొదటి హాస్పిటల్‌గా గుర్తింపు పొందింది. అత్యధికంగా విజయవంతమైన లైవ్ కాడవెరిక్ కాలేయ మార్పిడి చేసిన మొదటి ఆస్పత్రిగాను నిలిచింది. విజయవాడలో 2006 నుంచి సీఆర్‌ఆర్‌టీ కార్పొరేట్ హాస్పిటల్‌ Manipal Hospital కావడం గమనార్హం.

Address:
Manipal Hospital Vijayawada
# 12-570
near varadhi By pass road Tadepalli Guntur District,
Tadepalli, Andhra Pradesh 522501
Contact Number:086456 69966

ఇకపోతే Top 2 ప్లేస్‌లో American Oncology Institute (Cancer Hospital) ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్‌లో ఒకటి. అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ విజయవాడలోని నాగార్జున క్యాన్సర్ సెంటర్‌లో క్యాన్సర్ సేవల కోసం తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ హాస్పిటల్‌లో 100 పడకల సామర్థ్యంతో చికిత్స అందిస్తున్నారు. యూఎస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ మెడికల్ సెంటర్‌లో ప్రముఖ ఆంకాలజిస్ట్‌ల బృందంతో American Oncology Institute స్థాపించబడింది. దేశంతో పాటు దక్షిణాసియా అంతటా సూపర్-స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను విస్తరించింది. క్యాన్సర్ కేర్‌లో అగ్రశ్రేణి ఆసుపత్రిగా పరిగణించబడుతున్న American Oncology Institute విజయవాడ రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, హెమటాలజీ వంటి చికిత్స సేవలను అందిస్తుంది. ఈ ఆసుపత్రి విజయవాడలో క్యాన్సర్‌కు అత్యుత్తమ చికిత్సను అందజేస్తుంది.

Address:
AMERICAN ONCOLOGY INSTITUTE
Nagarjuna Hospital Kanuru,
Vijayawada, Andhra Pradesh – 520007
Contact Number: 73311 91919

ఇకపోతే Top 1 ప్లేస్‌లో HCG CURIE CITY CANCER CENTRE ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్‌లో ఒకటి. క్యాన్సర్ చికిత్స కోసం రోగులకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. HCG CURIE CITY CANCER CENTRE సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ ద్వారా నాణ్యమైన క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ హాస్పిటల్‌లోని డయాగ్నస్టిక్ ఫెసిలిటీ అత్యాధునిక ఇమేజింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఈ హాస్పిటల్‌లోని మెడికల్ ఆంకాలజీ విభాగం సహాయక కీమోథెరపీ, నియోఅడ్జువాంట్ కెమోథెరపీ, పాలియేటివ్ కెమోథెరపీ, టార్గెటెడ్ కెమోథెరపీలను అందజేస్తుంది. HCG CURIE CITY CANCER CENTRE లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గుర్తింపు పొందింది. ఈఎస్ఐ, ఈసీహెచ్ఎస్, ఈహెచ్ఎస్ వంటివి ఇందులో వర్తిస్తాయి.

Address:
#44-1-1/3,
Padavalarevu, Gunadala,
Vijayawada, Andhra Pradesh 520004
Contact Number:063588 88811

Leave your vote

More

Previous articleTop 10 Fertility Centers in Hyderabad
Next articleTop 10 Hospitals in Vijayawada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here