విజయవాడలోని Top 5 Cardiologists వీరే..
Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.
ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా.. మెట్లెక్కినా.. ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం.. ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు.
ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. గుండె జబ్బుకు ఆడ, మగ భేదా లు లేవు. ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది. అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడయ్యింది. గుండెపోటుకు గురయ్యే వారిలో చెయ్యి లాగేయడం, ఊపిరి అందకపోవడం, చమట పట్టడం, వికారంగా ఉండ డం వంటి లక్షణాలు స్త్రీపురుషులిద్దరిలోనూ కనపడతాయని తెలుస్తోంది.
అయితే ఇలాంటి గుండె సంబంధిత లక్షణాలు కలిగిన వారంతా విజయవాడ నగరంలోని Top 5 Cardiologists సంప్రదించడం బెటర్. అయితే విజయవాడలోని Top 5 Cardiologists ఎవరు..? వారిని ఏలా సంప్రదించాలి..? వారి ప్రత్యేకతలు ఏంటి..? అనే తదితర వివరాలతో వీడియో రూపొందించాము. ఈ వీడియోను పూర్తిగా చూసి Top 10 Cardiologistsను సంప్రదించి మీ గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.
ఇకపోతే 5 ప్లేస్‌లో Dr.Srinath Reddy Narahari ఉన్నారు. ఈయన దేశంలోని అత్యుత్తమ కార్డియాలజిస్టుల్లో ఒకరిగా ఉన్నారు. Dr.Srinath Reddy Narahari గత 7 సంవత్సరాలుగా కార్డియాలజీ రంగంలో సేవలు అందిస్తున్నారు. ఈయన విజయవాడలోని బెంజ్ సర్కిల్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్, పీడియాట్రిక్ కార్డియాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం సంపాదించారు.
Dr.Srinath Reddy Narahari 2006లో బెల్గామ్‌లోని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2010లో బాంబేలోని ఎంజీఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సెన్సెస్ నుంచి పీడియాట్రిక్స్‌లో ఎండీ, అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి పీడియాట్రిక్స్ కార్డియాలజీలో డీఎంగా కంప్లీట్ చేశారు. Dr.Srinath Reddy Narahari ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఈయన ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.400 తీసుకుంటారు.
Address:
Ramesh Hospitals,
near ITI College,
Vijayawada, Andhra Pradesh 520007
Contact Number:
ఇకపోతే 4 ప్లేస్‌లో DR ANIL KUMAR NARALASETTY ఉన్నారు. ఈయన విజయవాడలోని అత్యుత్తమ కార్డియాలజిస్టుల్లో ఒకరు. DR ANIL KUMAR NARALASETTY 2004లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2010లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నుంచి జనరల్ మెడిసిన్‌లో ఎండీ చేశారు. 2014లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కార్డియాలజీ విభాగంలో డీఎం చేశారు. అనంతరం 2019లో యూకేలో ఏఎఫ్ఈఎస్‌సీ, 2020లో యూఎస్ఏలో ఎఫ్ఎస్‌సీఏఐ కంప్లీట్ చేశారు. అంతేకాకుండా DR ANIL KUMAR NARALASETTY అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎన్ఆర్ఐ హాస్పిటల్స్‌లో, కార్డియాలజీ కన్సల్టెంట్‌గా ఆంధ్రా హాస్పిటల్‌లో పనిచేశారు.
DR ANIL KUMAR NARALASETTY దాదాపు 8 సంవత్సరాల కాలంలో 10వేలకు పైగా సర్జరీలు, 2500 మందికి పైగా స్టంట్స్ వేశారు. ఈయన కార్డియో డిసీస్, కార్డియో చెకప్, కార్డియాక్ ట్రీట్‌మెంట్స్‌తో పాటు ఇతర వ్యాధులకు చికిత్స అందిస్తారు. అంతేకాక యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, పేస్‌మేకర్, పెరిఫెరల్ ఇంటర్వెన్షన్‌లు తదితర ట్రీట్‌మెంట్ ఇవ్వడంలో మంచి నైపుణ్యం సాధించారు. హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ ఏదైనా కార్డియాక్ ఎమర్జెన్సీలను సమర్థవంతంగా నిర్వహించడంలో DR ANIL KUMAR NARALASETTY అద్భుతమైన ఫలితాలను సాధించారు.
Address:
Anu Neuro & Cardiac Hospital,
NH16, Near Ashok Leyland, Enikepadu,
Vijayawada, A.P – 521108
Contact Number: +91 7088 555555
ఇకపోతే 3 ప్లేస్‌లో DR.Y.V.RAO ఉన్నారు. ఈయన కార్డియాలజీ రంగంలో విశేష సేవలను అందించారు. కార్డియాక్ సర్జరీ, కార్డియాలజీ, ప్రివెంటివ్ కార్డియాలజీ, రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ, కంప్లీట్ హెల్త్ చెకప్ ప్రోగ్రామ్స్, రేడియాలజీ, ఛాతీ నొప్పి, హైపర్ టెన్షన్, చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ వంటి కార్డియాలజీ సేవలను అందించడంలో మంచి నైపుణ్యం సంపాదించారు. ఈయన విజయవాడలోని లబ్బీపేటలో ఉషా కార్డియాక్ సెంటర్‌ను ప్రారంభించారు. కార్డియాలజీ చికిత్సకు కావాల్సిన అత్యాధునిక పరికరాలతో రోగులకు సేవలను అందిస్తున్నారు.
ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.2వేలు తీసుకుంటారు.
Address:
Usha Cardiac Centre Ltd Katragadda Pitchaiah Street,
M G Road, Opp, PVP MAll,
Labbipet, Vijayawada,
Andhra Pradesh 520010
Contact Number: 0866 248 4944
ఇకపోతే 2 ప్లేస్‌లో DR. POTHINENI RAMESH BABU ఉన్నారు. ఈయన కార్డియాలజీ విభాగంలో సుదీర్ఘ అనుభవం సంపాదించారు. DR. POTHINENI RAMESH BABU విజయవాడలో రమేష్ హాస్పిటల్స్‌ను స్థాపించారు. 1980లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, న్యూఢిల్లీలో 1984లో ఎయిమ్స్‌లో జనరల్ మెడిసిన్‌లో ఎండీ, 1988లో అదే ఎయిమ్స్‌లో కార్డియాలజీలో డీఎం కంప్లీట్ చేశారు.
న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ ఇంటర్నల్ మెడిసన్, సీనియర్ రెసిడెంట్ ఇంటర్నల్ మెడిసిన్ చేశారు. ఏపీ స్టేట్ మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో ఒకటో స్థానం, న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో డీఎం ప్రవేశపరీక్షలో మొదటి స్థానం సాధించారు. కార్డియో వాస్కులర్ యాంజియోగ్రఫీ అండ్ ఇంటర్వెన్షన్స్, నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్‌లోనూ సభ్యులుగా ఉన్నారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.1000 తీసుకుంటారు.
Address:
ITI Rd,
Jayaprakash Nagar,
Vijayawada, Andhra Pradesh 520008
Contact Number:0866 248 4811
ఇకపోతే 1 ప్లేస్‌లో DR. PALLEM PEDDESWARA RAO ఉన్నారు. ఈయన కార్డియాలజీ రంగంలో 21 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు తన సేవలు అందించారు. అత్యుత్తమ కార్డియాలజిస్టుల్లో DR. PALLEM PEDDESWARA RAO ఒకరు. ఈయన 1986లో కాకినాడలోని రంగరాయ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్, 1992లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎండీ, 1996లో హైదరాబాద్‌లోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో కార్డియాలజీలో డీఎం కంప్లీట్ చేశారు. DR. PALLEM PEDDESWARA RAO 1999లో హార్ట్ కేర్ సెంటరును విజయవాడలో స్థాపించారు. నిజామ్ ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్ ప్రోఫెసర్‌గానూ పనిచేశారు. దేశవ్యాప్తంగా గుండె సంరక్షణ, కార్డియాలజీ సర్జరీ, కార్డియాక్ ట్రీట్‌మెంట్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా రోగులకు ట్రీట్‌మెంట్ అందించారు. తాను స్థాపించిన హార్ట్ కేర్ సెంటర్‌లో 20వేల యాంజియోగ్రామ్‌లను నిర్వహించింది. DR. PALLEM PEDDESWARA RAO రోజుకు సగటున 10 యాంజియోగ్రామ్‌లు, 4100 యాంజియోప్లాస్టీలు, 3 వేల సీటీ సర్జరీలను చేశారు. ఈయన ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.420 తీసుకుంటారు.
Address:
29-12-21,
Dornakal Road, Venkataratnam St,
Suryaraopeta, Vijayawada,
Andhra Pradesh 520002
Contact Number: 0866 243 8588