Top 5 Diabetologist Doctors in Hyderabad

170
0
Top 5 Diabetologist Doctors in Hyderabad | Best Diabetologist in Hyderabad
Top 5 Diabetologist Doctors in Hyderabad | Best Diabetologist in Hyderabad


హైదరాబాద్‌లోని Top 5 Diabetologist Doctors వీళ్లే..?

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

ఆహారపు అలవాట్లు కారణమో.. జీవన గమనంలో మార్పులు కారణమో తెలియదుగానీ ప్రస్తుతం సగటు మనిషిని వేధిస్తోన్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ప్రధానమైనది. ఒక్కసారి డయాబెటిస్ ఎటాక్ అయితే జీవితాంతం మెడిసిన్ వాడాల్సిందేనని వైద్యులు చెబుతోన్న మాట. వాస్తవానికి జీవన శైలిని మార్చుకుని కొంతమేర ఫుడ్ డైట్‌ని పాటిస్తే.. డయాబెటిస్ కంట్రోల్ ఉంటుంది.  డాక్టర్ల పర్యవేక్షణలో నిత్యం మెడిసిన్ వాడితే.. షుగర్‌ను కంట్రోల్ చేస్తూ మిగతా లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవొచ్చు. వాస్తవానికి షుగర్ వ్యాధి అందరిలో కామన్ అయినా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అవుతుంది. వాస్తవానికి Type1 డయాబెటిస్‌కు వైరస్, జన్యువుల్లో మార్పుల వల్ల వస్తే, Type2 డయాబెటిస్ ఊబకాయం, హార్మోన్లలో మార్పులు, కుటుంబంలో ఎవ్వరికైనా డయాబెటీస్ ఉన్నా.. సంక్రమిస్తుంది. అయితే డయాబెటిస్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీరని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే డయాబెటిస్ లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో బెటర్. అయితే హైదరాబాద్‌లో ఎవరు బెస్ట్ Diabetologist Doctors..? ఎవ్వరినీ సంప్రదించాలి..? అని వెతక్కోవాల్సిన పనిలేకుండా హైదరాబాద్‌లోని Top 5 Diabetologist Doctors వివరాలను మీకోసం ప్రత్యేకంగా అందిస్తోంది Aadhan Telugu.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో DR.M.CHANDRA SEKHAR ఉన్నారు. DR. M. CHANDRA SEKHAR దాదాపు 14 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్‌గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఈయన హైదరాబాద్ చింతల్‌లోని అలవి హాస్పిటల్‌‌లో టెస్లా డయాగ్నోస్టిక్, సుచిత్రా సర్కిల్, మెదక్‌లోని తూప్రాన్‌లో తన సేవలను అందిస్తున్నారు. DR.M.CHANDRA SEKHAR 2007 సంవత్సరంలో గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, 2015లో బోస్టన్ యూనివర్సిటీ నుంచి డయాబెటాలజీలో పీజీ, 2011లో అన్నామలై యూనివర్సిటీ నుంచి డయాబెటాలజీలో హెల్త్ సైన్సెస్‌లో పీడీడిప్లామా కంప్లీట్ చేశారు. ఈయన దేశంలోని డయాబెటిస్ అధ్యయనం కోసం పనిచేసే పరిశోధనా సంఘంలోనూ సభ్యులుగా ఉన్నారు. ఇకపోతే అందుబాటులో ఉండే టైమింగ్స్ విషయానికొస్తే.. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు, సాయంత్రం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటారు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.200 ఛార్జ్ చేస్తారు.

Adress:
Address: 5-120,
Jeedimetla Main Road,
Sri Sai Colony, Chandra Nagar,
Balanagar, Hyderabad,
Telangana 500055
Contact Number: 91601 21257

ఇకపోతే Top 4 ప్లేస్‌లో Dr.Shyam Kalavalapalli ఉన్నారు.  ఈయన దాదాపు 24 సంవత్సరాలుగా ఈ రంగంలో మంచి అనుభవం సంపాదించారు. Dr.Shyam Kalavalapalli ప్రముఖ గుర్తింపు పొందిన కాలేజీల్లో శిక్షణ తీసుకున్నారు. ప్రధానంగా Addenbrooke’s, Cambridge, John Radcliffe, Oxford and Hammersmith at Imperial College London తదితర కాలేజీల్లో డయాబెటాలజిస్టుగా ట్రైనింగ్ తీసుకున్నారు. మాంచెస్టర్‌లో పలు ప్రముఖ హాస్పిటల్స్‌లో చాలాకాలం పనిచేశారు. Dr.Shyam Kalavalapalli ప్రధానంగా అడల్ట్ ఎండోక్రినాలజీ, థైరాయిడ్, డయాబెటిస్, బేరియాట్రిక్స్ పట్ల విశేషానుభవం సంపాదించారు. ఈయన ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్‌లో సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఐడియా క్లినిక్‌లో సేవలు అందిస్తున్నారు.

అందుబాటులో ఉండే టైమింగ్స్.. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.500 తీసుకుంటారు.

Address:
Triveni Towers,
Road Number 1, KPHB Colony,
Landmark: Opposite Prime Hospitals, Hyderabad

Contact Number: 040 40042000

ఇకపోతే Top 3 ప్లేస్‌లో Dr.K SuryaPavan Reddy ఉన్నారు. Dr.K SuryaPavan Reddy హైదరాబాద్‌లోని డయాబెటిస్ స్పెషలిస్టుల్లో ఒకరు. దాదాపు 18 సంవత్సరాలుగా డయాబెటాలజిస్టుగా సేవలు అందిస్తున్నారు. 2000లో కెరీర్ ప్రారంభించిన ఆయన 2005 వరకు ఆసియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో పనిచేశారు. అనంతరం యశోదా హాస్పిటల్‌లో కన్సల్టెంట్‌గానూ సేవలందించారు. 2005 నుంచి 2010 వరకు డియాకాన్ డయాబెటిస్ క్లినిక్‌లో పనిచేయగా, 2010 నుంచి 2015 వరకు ఇమేజ్ హాస్పిటల్‌లో వర్క్ చేశారు. అపోలో మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గానూ పనిచేశారు. 2016 నుంచి హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో డయాబెటాలజిస్టుగా కొనసాగుతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియాలో ప్రొఫెషనల్ మెంబర్‌గా ఉన్నారు.  ఇప్పటివరకు వందలాది మంది డయాబెటిస్ పెషంట్లకు వైద్యం అందించి ఆరోగ్యకరమైన జీవితాలను అందించారు. Dr.K SuryaPavan Reddy ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఈయన ఆన్‌లైన్‌లోనూ తన సేవలను అందిస్తుండడం గమనార్హం. కన్సల్టేషన్ ఫీజుగా రూ.1000 తీసుకుంటారు.

Address:
Apollo Health City,
Road No 72, Opp. Bharatiya Vidya Bhavan School,
Film Nagar, Jubilee Hills,
Hyderabad, Telangana 500033
Contact Number: 1860 500 4916

ఇక Top 2 ప్లేస్‌లో Dr Somnath Gupta ఉన్నారు. Dr Somnath Gupta డయాబెటిస్‌ను నియంత్రించడంలో 10 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఒక్క డయాబెటిస్‌లోనే కాకుండా బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలకు ట్రీట్‌మెంట్ చేయడంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఈయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, అన్నామలై యూనివర్సిటీ నుంచి డయాబెటాలజీలో పీజీ కంప్లీట్ చేశారు. Dr Somnath Gupta  2009లో పాథాలజీలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లోనూ సభ్యులుగా ఉన్నారు. 2011 నుంచి 2012 వరకు కిమ్స్ హాస్పిటల్‌లో ఇన్సెంటివ్ కేర్ మేనేజ్‌మెంట్‌గా, 2012 నుంచి 2014వరకు సీనియర్ రిజిస్ట్రార్‌గా, డెక్కన్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం పెస్ హాస్పిటల్‌లో జనరల్ ఫిజిషియన్‌, డయాలబెటాలజిస్టుగా సేవలు అందిస్తున్నారు. ఈయన ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆన్‌లైన్ కన్సల్టేషన్ ఫీజు రూ.200 తీసుకుంటారు.

Address:
PACE Hospitals
Hitech City,
Metro Pillar Number C1775, 18,
Hitech City Rd, Beside Avasa Hotels,
HUDA Techno Enclave, HITEC City,
Hyderabad, Telangana 500081
Contact Number: 4048486868

ఇక Top 1 ప్లేస్‌లోDr. V Mohan ఉన్నారు. Dr. V Mohan డయాబెటిస్‌లో సరికొత్త అధ్యయనాన్ని సృష్టించారు. డయాబెటిస్ నియంత్రణ కోసం డాక్టర్ మోహన్ డయాబెటిక్ సెంటరును 1996లో స్థాపించారు. ఈ సెంటర్‌కు చైర్మన్‌గా డాక్టర్ వి.మోహన్ వ్యవహరిస్తూ ఇండియాలోని 8 రాష్ట్రాల్లో 48 డయాబెటిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఇప్పటివరకు 5 లక్షల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. డాక్టర్ మోహన్ తన అండర్ గ్రాడ్యుయేషన్ నాటి నుంచే పరిశోధనలపై ఆసక్తితో ఉండేవారు. ఇప్పటివరకు 1330కి పైగా ఆయన జర్నల్స్ ప్రచురితమయ్యాయంటే అతిశయోక్తి కాదు. డయాబెటిస్‌పై ఇప్పటివరకు డాక్టర్ మోహన్ 162 అధ్యయనాలను టెక్ట్స్ బుక్స్ కోసం అందించారు. డాక్టర్ వి.మోహన్ డయాబెటిస్ విభాగంలో రంగంలో ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డుతో పాటు 180 అవార్డులను సైతం అందుకున్నారు. ఇండియాలో బయోమెడికల్ పరిశోధనలకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటినరీ అవార్డును తీసుకున్నారు. 2012 సంవత్సరంలో డయాబెటిస్ రంగంలో డాక్టర్ వి.మోహన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇకపోతే ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

Adress:
Door No 1-2-365/36/5 & 9,
R K Mutt Road,
Domalguda-himayat Nagar,
Hyderabad – 500029,
Opposite Indira Park, Beside Ramakrishna Mutt
Contact Number: 9384092723

Leave your vote

More

Previous articleTop 10 Resorts In Hyderabad | హైదరాబాద్ లోని బెస్ట్ రిసార్ట్స్ ఇవే…
Next articleTop & Best 10 Schools in Hyderabad 2021 | హైదరాబాద్ లో ఉన్న 10 బెస్ట్ స్కూల్స్ ఇవే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here