Top 5 ENT Doctors in Vijayawada | బెస్ట్ ENT స్పెష‌లిస్టులు వీరే

106
0
Top 5 ENT Doctors in Vijayawada | Best ENT Specialists In Vijayawada |బెస్ట్ ENT స్పెష‌లిస్టులు వీరే
Top 5 ENT Doctors in Vijayawada | Best ENT Specialists In Vijayawada |బెస్ట్ ENT స్పెష‌లిస్టులు వీరే

విజయవాడలోని Top 5 ENT Doctors వీరే..

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

చలికాలంలో ఎన్నో రకాల అరోగ్య సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలు ముప్పేటగా దాడి చేస్తుంటాయి. సైనసైటిస్‌ ఉన్నవారి పరిస్థితైతే వర్ణనాతీతంగా ఉంటుంది. గొంతులో నొప్పి, విడిచిపెట్టని జలుబు, చెవిలో పోట్లు వంటివాటితో ఎక్కువమంది సతమతమవుతుంటారు. ఏమాత్రం చల్లని పదార్థాలు తాగినా సరే గొంతు ఇన్ఫెక్షన్‌ వచ్చేస్తుంటుంది. చెవుల్లో చలిగాలి దూరి, ఇన్ఫెక్షన్‌కు కారణవుతుంటుంది. ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా చలికాలంలో వచ్చే ఇలాంటి సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. మరోవైపు పర్యావరణంలోనూ కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరిగాయి. జల, వాయు, శబ్ధ కాలుష్యాలతో వచ్చే ఇఎన్‌టి సమస్యలకు చలిగాలి, చల్లని వాతావరణం తోడవ్వడంతో సమస్య తీవ్రమవుతోంది. నిజానికి మనకు చెవి, ముక్కు, గొంతు వేర్వేరు భాగాలుగా కనిపిస్తున్నా.. శరీర నిర్మాణరీత్యా ఈ మూడూ సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. పైకి కనిపించకపోయినా లోపలి భాగాలు ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. వీటిలో ఒక దానికి ఇన్ఫెక్షన్‌ వచ్చినా దాని ప్రభావం మిగిలిన రెండింటిపై ఉంటుంది. మారుతున్న ఆధునిక కాలంలో వాయు, శబ్ధ కాలుష్యాలు పెరగడం, వాతావరణంలో మార్పులు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు కారణమవుతున్నాయి. దీనికి తప్పనిసరిగా తగిన చికిత్సలు చేయించుకోవాలి. అయితే ఈఎన్‌టీ సమస్యలతో బాధపడుతున్నవారంతా విజయవాడలోని Top 5 ENT Doctorsను సంప్రదించడం బెటర్. అయితే విజయవాడలోని Top 5 ENT Doctors ఎవరు..? వారిని ఏలా సంప్రదించాలి..? వారి స్పెషాలిటీస్ ఏంటి..? తదితర వివరాలతో వీడియో రూపొందించాము. ఈ వీడియోను పూర్తిగా చూసి Top 5 ENT Doctorsను కలిసి మీ ఈఎన్‌టీ సమస్యలను పరిష్కరించుకోండి.

ఇకపోతే 5 ప్లేస్‌లో DR.RACHABATHUNI NAVEEN ఉన్నారు. ఈయన గత 21 సంవత్సరాలుగా ఈఎన్‌టీ రంగంలో సేవలు అందిస్తున్నారు. విజయవాడలోని అత్యుత్తమ ఈఎన్‌టీ డాక్టర్లలో ఈయన ఒకరు. DR.RACHABATHUNI NAVEEN విజయవాడలో నవీన్ ఈఎన్‌టీ హాస్పిటల్‌ను 2010లో ప్రారంభించారు. ఈయన 1995లో గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, 2000లో ఇదే కాలేజీ నుంచి Diploma in Otorhinolaryngology (DLO), 2002లో న్యూఢిల్లీలోని డీఎన్‌బీ బోర్డు నుంచి ఈఎన్‌టీ పూర్తి చేశారు.  DR.RACHABATHUNI NAVEEN ప్రధానంగా Labyrinth disease, Nasal Disorders, Vertigo, Labyrinthitis and Hearing Deficiency Assessment వంటి చికిత్స చేయడంలో మంచి గుర్తింపు పొందారు. ఈయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ Otorhinolaryngology ఆఫ్ ఇండియాలోనూ సభ్యులుగా ఉన్నారు. ప్రతి సోమవారం నుంచి బుధవారం వరకు, తిరిగి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 08.30 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.250 తీసుకుంటారు.

Address:
Naveen ENT Hospital
#29/12/42, Venkatratnam Street,
Nakkal Road., Landmark: Near RVR Hospital,
Vijayawada.
Contact Number:040 4520 9753

ఇకపోతే 4 ప్లేస్‌లో DR.VENKATARATNAM MANNE ఉన్నారు. ఈయన విజయవాడలోని ఉత్తమ ఈఎన్‌టీ వైద్యుల్లో ఒకరు. ఈ రంగంలో 28 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం DR.VENKATARATNAM MANNE సాయికృష్ణ ఈఎన్‌టీ హాస్పిటల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. 1985లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, 1991 ఇదే మెడికల్ కాలేజీలో డీఎన్‌బీ ఈఎన్‌టీ, 1999లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంఎస్(ఈఎన్‌టీ) పూర్తి చేశారు. DR.VENKATARATNAM MANNE ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో పాటు అసోసియేషన్ ఆఫ్ Otorhinolaryngology ఆఫ్ ఇండియాలోనూ సభ్యులుగా ఉన్నారు. DR.VENKATARATNAM MANNE కోస్టా ఆంధ్రాలో తొలిసారిగా నాసల్ ఎండోస్కోపి సర్జరీలు, లారింజెక్టమీ వంటి క్యాన్సర్ సర్జీరీలు, రాడికల్ నెక్ డిసెక్షన్స్ వంటి చికిత్సను విజయవంతంగా చేశారు. బాంబేలోని జేజే హాస్పిటల్‌లో శిక్షణ పొందారు. బాంబేలోని టాటా మెమోరియల్, బెంగళూరులోని కిద్వాయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలోనూ పనిచేశారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.200 తీసుకుంటారు.

Address:
Sai Krishna Hospital,
29, 12-36, Venkataratnam St,
Suryaraopeta, Governor Peta,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number:08662436799

ఇకపోతే 3 ప్లేస్‌లో Dr.Sudhakara Rao M ఉన్నారు. ఈయనకు ఈఎన్‌టీ రంగంలో 19 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. తనకు ఉన్న ఆసక్తితో మైక్రోఇయర్ సర్జరీపై అసాధారణ ఫలితాలను సాధించారు. చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించి మంచి అనుభవాన్ని సంపాదించారు. Dr.Sudhakara Rao M 2001లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, 2005లో హైదరారబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంఎస్ ఈఎన్‌టీ పూర్తి చేశారు. ఈయన స్టేట్ కాన్ఫరెన్స్‌లో ఉత్తమ పేపర్ ప్రజంటేషన్‌కు గోల్డ్ మెడల్, గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో యూనివర్సిటీలో టాపర్‌గా నిలిచి బంగారుు పతకాలను సాధించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఒటాలజీ, అసోసియేషన్ ఆఫ్ ఓటోలారిన్జాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా లోనూ సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రతి సోమ, ఆదివారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1.30 గంటల వరకు, బుధవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.300 తీసుకుంటారు.

Address:
Gf-2/3, Sudhakar Ent Care,
Near Benz Circle, Nirmala Convent Road,
Vijayawada, Andhra Pradesh 520010
Contact Number:0866 247 4442

ఇకపోతే 2 ప్లేస్‌లో DR.G.RAJENDRAPRASAD ఉన్నారు. ఈయన విజయవాడలోని ఉత్తమ ఈఎన్‌టీ స్పెషలిస్టుల్లో ఒకరు. చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించి చికిత్స అందించడంలో మంచి నైపుణ్యం సంపాదించారు. ప్రస్తుతం ఈయన సింగారి హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. DR.G.RAJENDRAPRASAD ఎంబీబీఎస్‌తో పాటు డీహెచ్ఏ కంప్లీట్ చేశారు. ఈఎన్‌టీ రంగంలో తనకు ఉన్న అపార అనుభవంతో వేలాది మంది రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.500 తీసుకుంటారు.

Address:
Dno:29-9-54,
Govindarajulunaidu Street,
Suryaraopeta, Vijayawada,
Andhra Pradesh – 520002
Contact Number:  7947303862

ఇకపోతే 1 ప్లేస్‌లో DR.RAJANIKANTH ఉన్నారు. ఈయనకు ఈఎన్‌టీ రంగంలో 22 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. DR.RAJANIKANTH 1999లో పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్‌మర్), ఇదే ఇనిస్టిట్యూట్ నుంచి 2004లో ఎంఎస్ ఈఎన్‌టీ పూర్తి చేశారు. ఈయన ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ టాపర్‌గా నిలిచారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం DR.RAJANIKANTH ప్రశాంతమైన వాతావరణంలో సొంత క్లినిక్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్పీచ్ థెరపీలో ఈయన ప్రత్యేకమైన చికిత్స అందిస్తారు. రినోప్లాస్టీ, గురకకు శస్త్రచికిత్స, వినికిడి లోపం, తల, మెడ నొప్పి, నాసికా అవరోధం, పునర్నిర్మాణ మధ్య చెవి శస్త్రచికిత్స, చెవి సమస్యలు, సైనసిటిస్, స్లీప్ అప్నియా, దీర్ఘకాలిక దగ్గు, పుట్టుకతో వచ్చే చెవి సమస్య చికిత్స, ఇయర్ స్పీచ్ సమస్య చికిత్స చేయడంలో మంచి గుర్తింపు పొందారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.300 తీసుకుంటారు.

Address:
40-9-57, Kala Nagar Road,
Beside venkatramana Trust Hospital,
near Central Bank, Kala Nagar,
Benz Circle, Vijayawada,
Andhra Pradesh 520010
Contact Number:97041 16988

Leave your vote

More

Previous articleTop 10 Hospitals in India | ఇండియాలో ఉన్న టాప్ 10 హాస్పిటల్స్ ఇవే…
Next articleTop 5 Neurologists in Hyderabad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here