Home Best Of Five Top 5 ENT Hospitals in Vijayawada

Top 5 ENT Hospitals in Vijayawada

0
112
Top 5 ENT Hospitals in Vijayawada | Best ENT Hospitals in Vijayawada
Top 5 ENT Hospitals in Vijayawada | Best ENT Hospitals in Vijayawada

విజయవాడలోని Top 5 ENT Hospitals ఇవే..

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

ప్రస్తుతం ప్రతిఒక్కరిలో ఈఎన్‌టీ సమస్యలు సాధారణమయ్యాయి. అవి చూసేందుకు చిన్న సమస్యలుగానే కన్పించినా.. అనుభవించే వారికి అది చాలా పెద్ద సమస్యే. అయితే శీతాకాలంలో ఈ సమస్యలు మరింతగా వేధిస్తుంటాయి. ప్రధానంగా ముక్కు నుంచి రక్తం కారుట, చెవిలో చీము, వినికిడి లోపం, సైనసైటీస్, గురక వంటి సమస్యలు వేధిస్తుంటాయి. చిన్న పిల్లల విషయానికొస్తే.. చెవిలోంచి చీము కారడం చాలా సాధారణంగా చూసే వ్యాధి లక్షణం. చెవిలోని కర్ణభేరి పగిలి అక్కడ సూక్ష్మక్రిములు చేరి చీము తయారు చేస్తాయి. ఇది సరిగా చికిత్స చేయకపోతే పూర్తిగా చెముడు, అప్పుడప్పుడు మెదడుకు పాకి మెదడు వాపు వ్యాధి లక్షణాలు కలుగుతాయి. చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్దవారి వరకు వేధించే సమస్యల్లో సైనసైటిస్ ఒకటి. కపాలంలో గాలితో నిండిన కేవటీలను సైనస్ అంటారు. సైనస్ మ్యూకస్ మెంబ్రేన్ అనబడే మెత్తటి పొరతో కప్పబడి ఉంటాయి. దీనివల్ల ముక్కుదిబ్బడ, సైనస్‌లు ఉన్న భాగాల్లో తీవ్రమైన నొప్పి, ముక్కు నుంచి చీము కారడం వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాలి. అయితే మన విజయవాడ నగరంలోని Top 5 ENT Hospitals ఏవి..? వాటిని ఏలా సంప్రదించాలి..? వాటి ప్రత్యేకతలు ఏంటి..? తదితర వివరాలతో వీడియో రూపొందించాము. ఈ వీడియోను పూర్తిగా చూసి Top 5 ENT Hospitals సంప్రదించి మీ చెవి, ముక్కు, గొంతు సమస్యలను పరిష్కరించుకోండి.

ఇకపోతే 5 ప్లేస్‌లో Giridhar ENT Hospital ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో ఒకటి. దీన్ని 1999లో సూర్యారావుపేటలో స్థాపించారు. 15 పడకల సామర్థ్యంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలకు మంచి వైద్యం అందిస్తారు. ఇందులో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ పీవీ మధుసూదనశర్మ వంటి వైద్యులు కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నారు. Giridhar ENT Hospitalలో ప్రధానంగా నాసల్ ఎండోస్కోపీ, చెవి మైక్రో సర్జరీ, మైక్రో చెవి సర్జరీ, ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ, ఆడియోమెట్రీ టెస్ట్ వంటి అత్యుత్తమ సేవలతో ఏలాంటి సమస్యనైనా పరిష్కరిస్తున్నారు. Giridhar ENT Hospital ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

Address:
Shop No. 29, 8-39,
Chiluku Durgayya Veedhi,
Governor Peta, Vijayawada,
Andhra Pradesh 520002
Contact Number: 0866 243 5194

ఇకపోతే 4 ప్లేస్‌లో Sudhakar Ent & Dental Care ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ ఈఎ‌న్‌టీ ఆస్పత్రుల్లో ఒకటి. నగరంలోని అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మెషీన్ల సాయంతో సేవలు అందిస్తోంది. Sudhakar Ent & Dental Careను జూన్ 2006లో స్థాపించారు. 2011లో ఈఎన్‌టీ సేవలకు తోడుగా డెంటల్ సేవలు తోడయ్యాయి. 2014లో ఆపరేషన్ థియేటర్‌తో పాటు 15 పడకలకు సామర్థ్యం పెంచారు. ప్రపంచస్థాయి సాంకేతిక పరికరాలతో ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దారు. 2016లో ఏపీలోనే మొదటిసారిగా స్టోర్జ్ సియాలెండోస్కోపీ సిస్టమ్‌ను ఇక్కడ ప్రారంభించారు. ఇక్కడి ఈఎన్‌టీ సర్జన్‌కు దాదాపు 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నాం 1.30గంటలకు, సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఆదివారం మాత్రం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నాం 1.30 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

Address:
Nirmala Convent Rd,
NTR Circle, Old P&T Colony,
Patamata, behind Allahabad Bank,
Vijayawada, Andhra Pradesh 520010
Contact Number:0866 247 4442

ఇకపోతే 3 ప్లేస్‌లో Vijayawada Ent & Multispeciality Hospital ఉంది. ఈ హాస్పిటల్‌ను 2012లో విజయవాడలో స్థాపించారు. నిపుణులైన వైద్యులు విభిన్న సామర్థ్యాలు ఉన్న అత్యాధునిక పరికరాలతో సేవలు అందిస్తోంది. విజయవాడ నగరంలోనే ఎక్కడా లేని విధంగా రోగులకు సేవలు అందించడంలో Vijayawada Ent & Multispeciality Hospital అత్యుత్తమంగా నిలుస్తోంది. ఇక్కడ అల్ట్రాసోనోగ్రఫీ, ASSR, టాన్సిలిటిస్ చికిత్స, ఫార్మసీ, వినికిడి లోపం వంటి సమస్యలకు చికిత్స అందిస్తారు. ఈ హాస్పిటల్‌లో 105 పడకల సామర్థ్యంతో సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్‌లో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.

Address:
29-8-3
chilukudurgaiah street,
Nakkala Rd, Suryaraopeta,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number:  0866 666 0133

ఇకపోతే 2 ప్లేస్‌లో Singari Ent Hospital ఉంది. ఇది విజయవాడలోని అత్యుత్తమ హాస్పిటల్స్‌లో ఇది ఒకటి. చెవి, ముక్కు, గొంతు సమస్యలేవైనా ఇక్కడ ఉత్తమ పరిష్కారం లభిస్తుందని రోగుల నమ్మకం. ఇది కేవలం హాస్పిటల్ మాత్రమే కాదు.. రీసెర్చ్ సెంటర్ కూడా. నిపుణులైన స్పెషలిస్ట్ వైద్యులతో పిల్లల నుంచి పెద్దల వరకు వైద్యం అందిస్తోంది. Singari Ent Hospitalలో సైనసైటిస్ సర్జరీ, టాన్సిల్స్ తొలగింపు, గురక సమస్యలు, ప్రసంగ రుగ్మతలు, నిద్ర రుగ్మతలు, గొంతు, మెడ నొప్పులు వంటి సమస్యలకు చికిత్స అందించడం ఇక్కడి ప్రత్యేకత. Singari Ent Hospitalలో 24 గంటల పాటు చికిత్స అందుబాటులో ఉంటుంది.

Address:
29-9-54,
Govinda Rajulu Naidu Street,
Mill Road, near Devi Oil, Suryaraopeta,
Governor Peta, Vijayawada,
Andhra Pradesh 520002
Contact Number:7947303862

ఇకపోతే 1 ప్లేస్‌లో RAJANI KANTH ENT Clinic ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ ఈఎన్‌టీ హాస్పిటల్స్‌లో ఒకటి. ఇక్కడ 22 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. RAJANI KANTH ENT Clinicలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, చెవి నొప్పి, సైనసైటిస్ వంటి చికిత్సలకు ఉత్తమమైన పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడి వైద్యులు ప్రశాంతమైన వాతావరణంలో రోగులకు చికిత్స అందించడంలో స్పెషల్. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

Address:
40-9-57,
Kala Nagar Road,
Beside venkatramana Trust Hospital,
near Central Bank, Kala Nagar,
Benz Circle, Vijayawada,
Andhra Pradesh 520010
Contact Number: 97041 16988

Leave your vote

More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

close

Log In

Forgot password?

Forgot password?

Enter your account data and we will send you a link to reset your password.

Your password reset link appears to be invalid or expired.

Log in

Privacy Policy

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.