Top 5 Eye Doctors in Vijayawada

133
0
Top 5 Eye Doctors in Vijayawada | Best Ophthalmologists in Vijayawada | Eye Specialist In Vijayawada
Top 5 Eye Doctors in Vijayawada | Best Ophthalmologists in Vijayawada | Eye Specialist In Vijayawada

విజయవాడలోని Top 5 EYE Doctors వీరే..

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

ప్రస్తుత సమాజంలో 70 శాతం మనుషులు ఏదో ఒక కంటి సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. వాస్తవానికి కంటి సమస్యల్లో చాలా రకాలు ఉంటాయి. అదే విధంగా వాటికి చికిత్స చేసే కంటి వైద్యుల్లోనూ చాలా తేడా ఉంటుంది. ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. అయితే మనం ఎవరినీ సంప్రదించాలనే విషయం పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంటుంది. అన్ని కంటి సమస్యలకు ఆపరేషన్స్ అవసరం లేదు. కొన్ని సమస్యలు కళ్లద్దాలతో సమసిపోతే.. మరికొన్ని సమస్యలు మెడిసన్‌తో నయం అవుతాయి. ఇంకొన్ని సమస్యలకు మాత్రం తప్పకుండా కంటి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరి ఇంతకీ కంటి సమస్యలకు మన విజయవాడ నగరంలో ఎవరినీ సంప్రదించాలో తెలుసా..?. విజయవాడలో Top 5 EYE doctors ఎవరున్నారో మీకు తెలుసా..? అయితే ఈ వీడియో మీకోసమే. నగరంలో Top 5 EYE doctors వివరాలను మీ కోసం ఈ వీడియో రూపంలో సమగ్రంగా అందిస్తున్నాం. ఈ వీడియోను పూర్తిగా చూసి Top 5 EYE doctorsను సంప్రదించి మీ కంటి సమస్యలను పరిష్కరించుకుని మీ జీవితాల్లో వెలుగులు నింపుకోండి.

ఇకపోతే 5 ప్లేస్‌లో Dr. Basheer Ahmed ఉన్నారు. ఈయన విజయవాడ నగరంలోని ప్రముక కంటి వైద్య నిపుణుల్లో ఒకరు. గత 18 సంవత్సరాలుగా కంటి వైద్య రంగంలో సుదీర్ఘ అనుభవం సంపాదించారు. పేద ప్రజలకు సైతం కంటి వైద్యాన్ని సులభంగా అందించేందుకు Dr. Basheer Ahmed విజయవాడ వన్ టౌన్‌లో అయాన్ కంటి ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. జపరోజ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి ఎండీ, ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ నుంచి డీఓ పూర్తి చేశారు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నుంచి ఫెలోషిప్ సైతం పొందారు. అనంతరం కోదాడ, పాల్వంచ, సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాల్లో పలు ఆస్పత్రుల్లో ఫ్రీలాన్స్ సర్జన్‌గానూ పనిచేశారు. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్, మహబూబాబాద్‌లోని సూర్యా ఐ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ సేవలు అందించారు. Dr. Basheer Ahmed ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆలిండియా ఆప్తామాలాజికల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ ఆప్తమాలాజికల్ సొసైటీల్లోనూ సభ్యులుగా ఉన్నారు. ఈయన ఫాకోఎమల్సిఫికేషన్ సర్జరీ, లేజర్ రిఫ్రాక్టివ్ అండ్ క్యాటరాక్ట్ సర్జరీ, ఆటోగ్రాఫ్ట్‌తో పేటరీజియం సర్జరీలు చేయడంలో Dr. Basheer Ahmed సుప్రసిద్ధులుగా పేరు సంపాదించారు.

Address:

9-61-11,

BESIDE ICICI BANK,

B.R.P .Road , Islampet,

Vijayawada-1.

Contact Number: 8121310131

ఇకపోతే 4 ప్లేస్‌లో Dr.K.K.S.Chakravarthy ఉన్నారు. ఈయన ఉత్తమ కంటివైద్యుల్లో ఒకరు. గత కొన్నేండ్లుగా Dr.K.K.S.Chakravarthy శ్రీదేవి ఐ హాస్పిటల్‌లో తన సేవలు అందిస్తున్నారు. ఈయన తండ్రి డాక్టర్ కె.శివరామకృష్ణ ఏపీ తీర ప్రాంతాల చుట్టూ పేదలకు కంటి వైద్యం అందించేందుకు శ్రీదేవి ఐ హాస్పిటల్‌ను స్థాపించారు. Dr.K.K.S.Chakravarthy తన తండ్రి కె.శివరామక‌ృష్ణతో కలిసి ఒకటిన్నర లక్షలకు పైగా శస్త్రచికిత్సలు కంప్లీట్ చేశారు. మైక్రో ఇన్సిషన్ క్యాటరాక్ట్, గ్లాకోమా, మెల్లకన్ను వంటి సమస్యలకు ప్రత్యేకమైన చికిత్స అందిస్తారు. Dr.K.K.S.Chakravarthy ఫాకో, గ్లాకోమాలో మార్గదర్శకుడిగా మారారు. తల పగిలేలా బాధించే మైగ్రైన్‌ను ఎదుర్కోవడంలో నైపుణ్యం సాధించారు. ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

Address:

C/o Sridevi Eye Hospital,

Nakkal Road, Suryarao Pet,

Vijayawada – 520002.

Contact Number:08666617717

ఇకపోతే 3 ప్లేస్‌లో DR K.N.MURTY ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ కంటి వైద్యుల్లో ఈయన ఒకరు. నిజానికి కంటివైద్యంలో  DR K.N.MURTY గత 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ఓవైపు వైద్య సేవలు అందిస్తూనే.. మరోవైపు పీజీవైద్య విద్యార్థులకు లెక్చర్స్ ఇస్తుంటారు. ఈయన వెల్లూరులో డీఓ పూర్తి చేసి, న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆప్తాల్మాలజీలో ఎండీ చేశారు. DR K.N.MURTY ప్రధానంగా గ్లాకోమా వర్క్ అప్, కెరాటోకోనస్ క్లీనిక్, లాసిక్ ఐ సర్జరీ, కాంటాక్ట్ లెన్స్ క్లినిక్, కంటి శుక్లం, ప్రీమియం ఐయోల్ ఇంప్లాంటేషన్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీలు చేయడంలో ప్రత్యేకత సంపాదించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు, ఆదివారం మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు అందుబాటులో ఉంటారు.

Address:

29-4-10,

Kodandarami Reddy St,

Venkatswara Rao Street,

Governor Peta, Vijayawada,

Andhra Pradesh 520002

Contact Number: 08662433122

ఇకపోతే 2 ప్లేస్‌లో DR. VENU GOPAL RAO ఉన్నారు. విజయవాడలోని ప్రముఖ కంటి వైద్యుల్లో DR. VENU GOPAL RAO ఒకరు. దాదాపుగా కంటి వైద్య రంగంలో ఈయన 31 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈయన సూరపనేని కంటి హాస్పిటల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. DR. VENU GOPAL RAO 1976లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, 1982లో కన్నూర్ మెడికల్ కాలేజీ నుంచి ఎంఎస్ ఆప్తాల్మాలజీ కంప్లీట్ చేశారు. ఈయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో సభ్యులు. ఐ నార్మల్ చెకప్, కంటి శుక్లం, గ్లకోమా సర్జరీ, లేజర్ కరెక్షన్, కార్నియా ట్రీట్‌మెంట్ అందించడంలో ఎంతో నైపుణ్యం సాధించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.200 తీసుకుంటారు.

Address:

Gayatri Complex,

40-9-101 Behind, Benz Cir, Sai Nagar,

Vijayawada, Andhra Pradesh 520008

Contact Number:0866 247 3454

ఇకపోతే 1 ప్లేస్‌లో DR. RAVI SHANKAR VALLABHANENI ఉన్నారు. విజయవాడ నగరంలోని ప్రముఖ కంటి వైద్యుల్లో ఈయన ఒకరు. గత 25 సంవత్సరాలుగా కంటి వైద్యరంగంలో అనుభవం సంపాదించారు. ప్రస్తుతం DR. RAVI SHANKAR VALLABHANENI మీనాక్షి ఐ హాస్పిటల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈయన 1990లో గుల్బర్గాలోని మహదేవప్ప రాంపూరే మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, 1993లో కస్తూర్బా మెడికల్ కాలేజీ నుంచి ఎంఎస్ ఆప్తాల్మాలజీ, 1996లో మదురైలోని అరవింద్ ఐ హాస్పిటల్ నుంచి ఫెలోషిప్ ఆఫ్ ది అకాడమీ మెడిసిన్ పూర్తి చేశారు. ఆలిండియా ఆప్తల్మాజికల్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో సభ్యులుగా కొనసాగుతున్నారు.  ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ప్రతి కన్సల్టేషన్ ఫీజుగా రూ.400 తీసుకుంటారు.

Address:

Meenakshi Eye Hospital

29-19-81, Mohanbagh Apartments,

Dornakal Road, Landmark: Opposite to SBI Bank.,

Vijayawada

Contact Number:  0866 243 3388

Leave your vote

More

Previous articleవిజయవాడలోని టాప్ 5 ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఎవరో తెలుసా? | Top 5 Best Orthopedic Doctors in Vijayawada
Next articleTop 5 Cardiologists in Vijayawada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here