Top 5 Gastroenterology Hospitals in Vijayawada

138
0
Top 5 Gastroenterology Hospitals in Vijayawada | Best Gastroenterology Hospitals in Vijayawada
Top 5 Gastroenterology Hospitals in Vijayawada | Best Gastroenterology Hospitals in Vijayawada

విజయవాడలోని Top 5 Gastroenterology Hospitals ఇవే..

Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కాలంతో పాటే పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం అలసత్వం చూపినా వెనుకబడినట్టే. అయితే ఈ క్రమంలోనే మానవ జీవనశైలిలో పెనుమాత్మక మార్పులు వచ్చాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రించే వరకు ఎన్నో అలవాట్లు గతానికి భిన్నంగా మారాయి. ప్రధానంగా ఆహారపు అలవాట్లు మారడంతో లేనిపోని రోగాల బారిన పడుతున్నాం. పోటీ జీవన విధానంలో తినేందుకు తీరిక లేకనో.. మరేదైనా కారణంతోనో బయటి ఫుడ్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్‌ను విపరీతంగా తినడం వల్ల చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిలోనూ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడేందుకు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండట్లేదు. దీంతో గ్యాస్ట్రోఎంటరాలజీలో ఉత్తమమైన చికిత్సను అందించే హాస్పిటల్స్‌‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది. అయితే విజయవాడలోని Top 5 Gastroenterology Hospitalsను మీకు పరిచయం చేస్తున్నాం. సో ఇంకేముంది ఈ వీడియో పూర్తిగా చూసేసి.. బెస్ట్ Gastroenterology Hospitalsకు వెళ్లి మీ గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టేసేయండి.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Andhra Hospitals ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ హాస్పిటల్‌లో ఒకటి. అత్యాధునిక సాంకేతికతతో 24 గంటల పాటు అత్యవసర ట్రీట్‌మెంట్‌ సహా అనేక రకాల చికిత్సను అందిస్తుంది. ఈ హాస్పిటల్‌లోని గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి నిత్యం రోగుల రద్దీ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ పీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో అత్యుత్తమ గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలు అందుతాయి. ప్యాంక్రియాటైటిస్, రక్తస్రావం, కాలేయ వైఫల్యం, కాలేయ సిర్రోసిస్ వంటి శస్త్రచికిత్సలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. Andhra Hospitalsలో ట్రీట్‌మెంట్ ఎండోస్కోపిక్, థెరప్యూటిక్ విధానాల్లో జరుగుతుంది. 24 గంటల పాటు హాస్పిటల్ తెరిచి ఉంటుంది. కన్సల్టేషన్ ఫీజు చికిత్స విధానాన్ని బట్టి ఉంటుంది.

Address:
C.V.R. Complex,
Prakasam Road,
Vijayawada – 2, Krishna Dist (A.P)
Contact Number: 0866 2574757

ఇకపోతే Top 4 ప్లేస్‌లో Nalini Gastro Center ఉంది. విజయవాడలోని ఉత్తమ గ్యాస్ట్రో సెంటర్లలో ఇది ఒకటి. గ్యాస్ట్రోఎంటరాలజీ రంగంలో ప్రజలకు విశేష సేవలను అందిస్తోంది. మలబద్దకం వంటి సాధారణ సమస్యల దగ్గరి నుంచి హెపటోసిస్, డిస్స్పెప్సియా, ఎంటెరిటిస్, పెద్దప్రేగు సమస్యలు, దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్, దీర్ఘకాలిక కోలిసైస్టిటిస్, కోలాంగిటిస్ వంటి వ్యాధులకు ఇక్కడ ఉత్తమ చికిత్స అందుతుంది. డాక్టర్ నళిని ప్రసాద్ నేతృత్వంలో అందుతున్న గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలు చాలా సంవత్సరాలుగా ప్రజల మన్ననలను పొందుతుంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

Address:
D no.57-7-23/1,3rd and 4th floor,
Kakateeya road, near Sonovision,
Patamata, Benz Circle,
Vijayawada, Andhra Pradesh 520008
Contact Number:0866 295 0108

ఇకపోతే Top 3 ప్లేస్‌లో SATEESH GASTRO & LIVER CENTRE ఉంది. విజయవాడ నగరంలోని ఉత్తమ GASTRO & LIVER CENTREలో ఇది ఒకటి. ఇక్కడ కాలేయ వ్యాధులు, ప్రేగులు, కడుపు రుగ్మతలు, కొలొనోస్కోపీ, ఎండోస్కోపీ, ప్యాంక్రియాస్, అన్నవాహిక, గాల్ బ్లాడర్ & అన్నవాహిక, అనోరెక్టల్ మానోమెట్రీ తదితర సమస్యలకు ట్రీట్‌మెంట్ అందిస్తారు. ఈ హాస్పిటల్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ జే సతీష్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు. ప్యాంక్రియాటిక్, పెద్దప్రేగు సంబంధ వ్యాధులతో సహా అనేక రకాల రోగాలకు చికిత్స అందిస్తారు. 2012 నుంచి ఈయన గ్యాస్ట్రో రంగంలో ఎన్నో వేల కేసులను పరిష్కరించారు. 24 గంటల పాటు SATEESH GASTRO & LIVER CENTRE రోగులకు అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీలను బట్టి కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది.

Address:
29-14-37,
Prakasam Rd, 5 Route,
Suryaraopeta, Governor Peta,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number:0866 244 2348

ఇకపోతే Top 2 ప్లేస్‌లో KRISHNA GASTRO & LIVER CENTRE ఉంది. ఇది ప్రత్యేకంగా గ్యాస్ట్రోఎంటరాలజీ సంబంధిత వ్యాధులకు మాత్రమే చికిత్స అందిస్తోంది. విజయవాడలోని ఉత్తమ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్స్‌లో ఇది ఒకటి. ఇక్కడ పిత్తాశయం, ప్యాంక్రియాస్, ప్రేగులు, పొట్ట, ఆంత్రమూలం, కాలేయం, జీర్ణవ్యవస్థ సమస్యలకు చికిత్స అందించడంలో ప్రత్యేకతను సంపాదించుకుంది. KRISHNA GASTRO & LIVER CENTREను 2007లో ప్రారంభించారు. అప్పటి నుంచి 24 గంటల పాటు గ్యాస్టోఎంటరాలజీ సేవలు అందిస్తోంది. డాక్టర్ పాలడుగు హరికృష్ణ నేతృత్వంలో గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వేలాది మందికి వైద్యసేవలు అందించారు.

Address:
# 29, 14-52,
Prakasam Rd, near Pushpa Hotel Center,
Suryaraopeta, Labbipet,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number:0866 243 9999

ఇకపోతే Top 1 ప్లేస్‌లో Harini Hospitals ఉంది. ఇది విజయవాడలోని ఉత్తమ Gastroenterology Hospitalsలో ఒకటి. అయితే 2000 సంవత్సరంలో ఎన్టీఆర్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 20 పడకల సామర్థ్యంతో హాస్పిటల్‌ను ప్రారంభించారు. గ్యాస్ట్రిక్ సమస్యల పరిష్కారానికి ప్రజలు ఇది ఒక ఉత్తమ హాస్పిటల్‌గా భావిస్తున్నారు. ఇక్కడ అందించే ఉత్తమ సేవలకు ప్రతిఫలంగా రోగుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో 2006లో ఈ హాస్పిటల్ సామర్థ్యాన్ని 50 పడకలకు పెంచారు. వైద్యరంగంలో ఎప్పటికప్పుడు వస్తోన్న సాంకేతికతను అందిపుచ్చుకుని హరిణీ హాస్పిటల్ ప్రపంచస్థాయి ప్రమాణాలకు ధీటుగా వైద్య సేవలు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎక్సలెన్స్ సెంటర్‌గా మారింది. లివర్ ఫైబ్రోస్కాన్, అడ్వాన్స్‌డ్ బ్లూ లేజర్, ఇమేజింగ్ టెక్నాలజీ, ఫ్యూజినాన్ డబుల్ బెలూన్ ఎండోస్కోపి, 4 ఫుల్ టైమ్ సూపర్ స్పెషాలిటీ కన్సల్టేషన్లు, రెండు మాలిక్యులర్ సర్జరీ థియెటర్లు వంటి ఆధునాతన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. Harini Hospitals 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటుంది.

Address:
# 29, 14-51, Prakasam Rd,
near Pushpa Hotel Center,
Suryaraopeta, Labbipet,
Vijayawada, Andhra Pradesh 520002
Contact Number:0866 249 5522

Leave your vote

More

Previous articleTop 10 Shopping Places in Hyderabad
Next articleTop 10 Hospitals in India | ఇండియాలో ఉన్న టాప్ 10 హాస్పిటల్స్ ఇవే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here