హైదరాబాద్‌లోని Top 5 Hepatology (Liver specialist) Doctors వీరే..
Hai Viewers. Welcome To Our channel Aadhan Telugu.
ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రతి 10 మందిలో ఐదుగురు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అందులో ప్రధానంగా కాలేయ సంబంధింత వ్యాధులతో సతమతమవుతున్నవారు అనేకమంది ఉన్నారనే చెప్పాలి. అయితే కాలేయ వ్యాధులను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. మెదడు పనితీరు క్షీణించడంతో పాటు ప్రాణాప్రాయ స్థితికి వెళ్లడం ఖాయం. నిజానికి మానవ జీవన విధానంలో వచ్చిన మార్పులతో పాటు మారిన ఆహారపు అలవాట్లతో మధుమేహం, స్థూలకాయం, థైరాయిడ్, సంతానలేమి వంటి సమస్యలు ఏలాగేైతే సాధారణమయ్యాయో.. అదేవిధంగా కాలేయ సంబంధిత వ్యాధులు సాధారణమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిపుణులైన డాక్టర్స్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోకపోతే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో Top 5 Hepatology (Liver specialist) Doctors ఎవరు..? వారిని ఏలా సంప్రదించాలి..? వారి స్పెషాలిటీస్ ఏంటి..? తదితర వివరాలతో ప్రత్యేకంగా ఈ వీడియోను రూపొందించాము. ఈ వీడియోను పూర్తిగా చూసి హైదరాబాద్‌లోని Top 5 Hepatology (Liver specialist) Doctorsను సంప్రదించి మీ కాలేయ సంబంధిత వ్యాధులను నయం చేసుకుని ఆనందమయ జీవితాన్ని గడపండి.
ఇకపోతే Top 5 ప్లేస్‌లో Dr Govind Verma ఉన్నారు. Dr Govind Verma గత 23 సంవత్సరాలుగా హెపాటాలజిస్టుగా సేవలందిస్తున్నారు. దేశంలోనే ప్రముఖ ఆస్పత్రిగా పేరుగాంచిన ముంబైలోని కెమ్ ఆస్పత్రి నుంచి పట్టభద్రులయ్యారు. విద్యలో మంచి ప్రతిభను కనబర్చడంతో పలు బంగారు పతకాలను సైతం దక్కించుకున్నారు. అనంతరం Dr Govind Verma హైదరాబాద్, ముంబైలోని పలు ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో హెపాటాలజిస్టుగా పనిచేశారు. బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో కాలేయ ప్యాంక్రియాస్ ఆంకాలజీ హెడ్‌గా సుదీర్ఘకాలం సేవలు అందించారు. Dr Govind Verma ప్యాంక్రియాటిక్ స్టెంటింగ్, ఎసోఫాగియల్ స్టెంటింగ్ వంటి వాటిల్లో ఆధునాతన చికిత్స కోసం శిక్షణ తీసుకున్నారు. ఎండోస్కోపిక్ విభాగంలో అల్ట్రాసౌండ్, ఈయూఎస్ గైడెడ్, POEM, ARMS, GERD-X, ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ (ESG) తదితర వాటిల్లో ప్రత్యేక నిపుణుడిగా పేరుపొందారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ ఎండోస్కోపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో Dr Govind Verma సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం పేస్ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ అండ్ థెరపీటిక్ ఎండోస్కోపీ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.800 తీసుకుంటారు.
Address:
Beside Hotel Avasa,
Metro Pillar No. 18,
Near Ratnadeep Store,
Hitech City, Hyderabad-500081
Contact Number:040 4521 0511
ఇకపోతే Top 4 ప్లేస్‌లో Dr Ananda Kumar ఉన్నారు. Dr Ananda Kumar ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల్లో ఒకరు. గత 28 సంవత్సరాల సుదీర్ఘకాలం తమన సేవలను అందిస్తున్నారు. Dr Ananda Kumar బెరియాట్రిక్, ల్యాప్రోస్కోపీ సర్జన్, జనరల్ సర్జన్‌గా మంచి గుర్తింపు పొందారు. ఈయన హైదరాబాద్ మహానగరంలో అనన్య గ్యాస్ట్రోఎంటరాలజీ క్లీనిక్‌ను స్థాపించారు. Dr Ananda Kumar వైద్య సేవలు అందించడమే కాదు.. పలు అంశాలపై ఎన్నో అధ్యయనాలు చేశారు. 2006లో ప్రతిష్టాత్మక స్ట్రాస్ బర్గ్ యూనివర్సిటీ నుంచి లాపరోస్కోపిక్ సర్జరీలో డిప్లొమా పట్టాను అందుకున్నారు. 2011లో సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో ఎండీ కంప్లీట్ చేశారు. Dr Ananda Kumar ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.1200 ఛార్జ్ చేస్తారు.
Ananya Gastroentrology
7-1-212/A/19, Shiv Bagh Colony,
Balkampet Road.,
Landmark: Lane Beside Hotel Surya Residency, Hyderabad
Contact Number: 9985003998
ఇకపోతే Top 3 ప్లేస్‌లో Dr.P.Balachandran Menon ఉన్నారు. Dr.P.Balachandran Menon కాలేయ సంబంధిత వ్యాధులపై సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన ఏఐజీ హాస్పిటల్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. Dr.P.Balachandran Menon 1989 సంవత్సరంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునల్ హాస్పిటల్ నుంచి వాస్కులర్ సర్జరీలో శిక్షణ తీసుకున్నారు. సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ కంప్లీట్ చేశారు. Dr.P.Balachandran Menon సియోల్‌లోని శామ్‌సంగ్ హాస్పిటల్‌తో పాటు ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫెలోషిప్ చేశారు. కొంతకాలం పాటు హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పటివరకు Dr.P.Balachandran Menon దాదాపు 2వేలకు పైగా కాలేయ మార్పిడి సర్జరీలు చేసి రికార్డు నెలకొల్పారు.
Address:
1-66/AIG/2 to 5,
Mindspace Road, Gachibowli
Hyderabad, Telangana 500032
Contact Number: 91-40-4244 4222 / 6744 4222
ఇకపోతే Top 2 ప్లేస్‌లో Dr Mettu Srinivas Reddy ఉన్నారు. Dr Mettu Srinivas Reddy ప్రస్తుతం చెన్నైలోని Gleneagles Global Hospital & Health Cityలో లివర్ ప్యాంక్రియాటిక్ సర్జరీ డైరెక్టర్‌గానూ పనిచేస్తున్నారు. ఈయన పాండిచ్చేరిలోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్‌మర్)లో వైద్యవిద్యను పూర్తిచేశారు. ఛండీఘర్‌లోని పోస్టుగ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో జనరల్ సర్జరీలో పట్టా పొందారు. కాలేయ మార్పిడి సర్జరీలో నైపుణ్యం పొందేందుకు యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లారు. విదేశాల్లో చాలాకాలం పాటు వివిధ విభాగాల్లో పనిచేశారు. అనంతరం 2012లో Dr Mettu Srinivas Reddy ఇండియాకు తిరిగొచ్చారు. చైన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో కాలేయ మార్పిడి విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ సర్జన్‌గా జాయిన్ అయ్యారు. తదనంతరం ఏడు సంవత్సరాల్లో 1500కు పైగా లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లలో భాగస్వాముడయ్యారు. 2018లో చెన్నైలోని డాక్టర్ రేలా ఇనిస్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటరులో కాలేయ మార్పిడి డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
Address:
6-1-1070/1 to 4,
Lakdi-ka-pul,
Hyderabad – 500 004, Telangana
Contact Number: 40 2349 1000
ఇకపోతే Top 1 ప్లేస్‌లో Dr. P Nagaraja Rao ఉన్నారు. ఈయన కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందారు. ఎంబీబీఎస్ కోర్సు మొత్తం బ్యాచ్‌లో అత్యుత్తమ అవుట్ గోయింగ్ విద్యార్థిగా నిలిచారు. ప్రివెంటివ్ మెడిసిన్ సర్జరీలో బంగారు పతకాలతో పాటు విద్యా పురస్కరాలను అందుకున్నారు. పీజీని ఛండీగర్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్స్ నుంచి పూర్తి చేశారు. ఇదే ఇనిస్టిట్యూట్ నుంచి జనరల్ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేశారు. ప్రొఫెసర్ డీవీ దత్తా రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సమయంలో హెపాటాలజీలో మంచి అనుభవం సంపాదించారు. కాలేయ వ్యాధుల్లో క్లినికల్ అనుభవం పొందడంతో పాటు హెచ్‌వీపీజీ, ఫంక్షనల్ హెపాటోగ్రఫీ, హెపాటిక్ సిర కాథెటరైజేషన్ వంటి క్లిష్టమైన విధానాల్లో నైపుణ్యం సంపాదించారు. చంఢీగర్‌లోని PGIMERలో పనిచేసిన తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా మెడ్విన్, మెడిసిటి, కేర్ ఆస్పత్రుల్లో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాలను ఏర్పాటు చేశారు. 2006లో ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో హెపటాలజీ అండ్ న్యూట్రిషన్ చీఫ్‌గా చేరారు. Dr. P Nagaraja Rao ఇప్పటివరకు ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, ఫ్యాటీ లివర్ డిసీజ్, లివర్ క్యాన్సర్ తదితర కాలేయ వ్యాధులకు సంబంధించి 50 వేల మందికి పైగా రోగులకు సేవలు అందించారు. ఇప్పటివరకు అనేక అవార్డులను సాధించడంతో పాటు అధ్యాపకుడిగానూ కీలకమైన సేవలు అందించారు. ప్రతి సోమవారం నుంచి బుధవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజు రూ.500 తీసుకుంటారు.
Address:
AIG HOSPITALS,
1-66/AIG/2 to 5,
Mindspace Road, Gachibowli
Hyderabad, Telangana 500032
Contact Number: +91-40-4244 4222 / 6744 4222
హైదరాబాద్ నగరంలోని Liver specialist Doctors ఎవరో చూశారుగా. దాంతో పాటు హైదరాబాద్ నగరంలో కాలేయ సంబంధిత వ్యాధుల కోసం ఏ హాస్పిటల్స్‌ను సంప్రదించాలి..? ఏవి బెస్ట్ హాస్పిటల్స్..? వివరాలను సైతం మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము.
ఇకపోతే best liver disease hospitalగా 2వ ప్లేస్‌లో AIG Hospitals ఉంది. ఇది ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించిన యూనిట్. దేశంలోనే అగ్రగామిగా హాస్పిటల్‌గా ఉంది. AIG Hospitals 800 పడకలతో సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తోంది. చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రావు నేతృత్వంలో 8 కేంద్రాల్లో కాలేయ సంబంధిత వ్యాధి నిర్మూలన కోసం ఉత్తమ సేవలను అందిస్తోంది. కాలేయ మార్పిడి సర్జరీలు చేసేందుకు AIG Hospitals ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ హాస్పిటల్‌లో నాణ్యమైన వైద్య సేవలతో పాటు ప్రశాంతమైన సానుకూలమైన వాతవారణంలో త్వరగా కోలుకునేలా చూస్తారు. AIG Hospitals 1986లో గ్యాస్ట్రోఎంటరాలజీ డేకేర్ సెంటరుగా ప్రారంభమై.. నేడు కాలేయ వ్యాధులతో పాటు మరెన్నో వ్యాధులకు చికిత్స అందిస్తోంది. ఇండియాతో పాటు 20కి పైగా విదేశాల నుంచి రోగులు ఇక్కడికి వచ్చి ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. ఈ హాస్పిటల్‌లోని అనుభవం కలిగిన వైద్యులు ప్రముఖ అంతర్జాతీయ జర్నల్స్‌లో తమ ప్రచురణలను ప్రచురించారు.
Address:
AIG HOSPITALS,
1-66/AIG/2 to 5,
Mindspace Road, Gachibowli
Hyderabad, Telangana 500032
Contact Number: +91-40-4244 4222 / 6744 4222
ఇకపోతే best liver disease hospitalగా 1వ ప్లేస్‌లో Gleneagles Global Hospital ఉంది. Gleneagles Global Hospital గత 20 సంవత్సరాలుగా కాలేయ మార్పిడికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌ను అందిస్తోంది. దాదాపు 150కి పైగా పడకలతో సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం లక్షలాది మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతారు. Gleneagles Global Hospital కాలేయ మార్పిడి చికిత్స అందించడంలో ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కేర్ సంస్థ. రోగులు చికిత్స అందించడం కోసం 100 మందికి పైగా డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. 6 ఆపరేషన్ థియేటర్లతో పాటు 24 గంటల పాటు మెడికల్ హాల్, ల్యాబ్ వసతి ఉంటుంది. వాస్తవానికి Gleneagles Global Hospital కాలేయ మార్పిడి చికిత్స అందించే ఉత్తమ ఆస్పత్రుల్లో ఒకటి. ఈ హాస్పిటల్‌లో అత్యుత్తమ హెపాటాలజిస్ట్ ఉండడంతో హాస్పిటల్ విజయవంతంగా తమ రోగులకు సేవలను అందిస్తోంది.
Address:
6-1-1070/1 to 4,
Lakdi-ka-pul,
Hyderabad – 500 004, Telangana
Contact Number: +91-40 2349 1000
ఓకే ఫ్రెండ్స్ చూశారుగా.. హైదరాబాద్‌లోని Top 5 Hepatology (Liver specialist) Doctors ఎవరో. ఇంకెందుకు ఆలస్యం. సంవత్సరాల తరబడి కాలేయ సమస్యతో పడుతున్న బాధలకు Top 5 Hepatology (Liver specialist) Doctors కలిసి చెక్ పెట్టేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.. షేర్ చేయండి. మా ఆదాన్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిగ్నల్‌ను నొక్కండి. ఎప్పటికప్పుడు మేం చేసే లెటెస్ట్ అప్‌డెట్స్ నోటిఫికేషన్ రూపంలో పొందండి. థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్.