Neurology is the branch of medicine concerned with the study and treatment of disorders of the nervous system. The nervous system is a complex, sophisticated system that regulates and coordinates body activities. It has two major divisions: The central nervous system: the brain and the spinal cord.
న్యూరాలజీ సమస్యలను పరిష్కరించుకునేందుకు విజయవాడ నగరంలో Top 5 Neurologist Doctors ఎవరు ఉన్నారు..?. వారి అపాయింట్‌మెంట్ ఏలా తీసుకోవాలి? అడ్రస్ ఎక్కడ..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ వీడియోను చూసి విజయవాడ నగరంలోని Top 5 Neurologist Doctorsను సంప్రదించి మీ న్యూరాలజీ సమస్యలకు చెక్ పెట్టేసేయండి.
ఇకపోతే Top 5 ప్లేస్‌లో Dr Ranga Rao SV ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ న్యూరాలజిస్ట్‌ల్లో ఈయన ఒకరు. Dr Ranga Rao SVకు న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగంలో 20 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. 1989లో విజయవాడలో తొలిసారిగా న్యూరోసర్జరీ కోసం S V R Neuro & Multi Speciality Hospitalsను స్థాపించారు. బెంగళూరులోని NIMHANSలో ఎంబీబీఎస్, న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో పీజీ కంప్లీట్ చేశారు. త్రివేండ్రంలోని SCTIMSTలో కన్సల్టెంట్‌గానూ పనిచేశారు. Dr Ranga Rao SV సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 14 సంవత్సరాల పాటు న్యూరోసర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈయన గత 10 ఏండ్లుగా మైక్రో న్యూరో సర్జరీలు చేయడంలో విజయవంతమయ్యారు. Dr Ranga Rao SV తన 20 సంవత్సరాల కేరీర్‌లో 5వేలకు పైగా న్యూరో సర్జరీలను చేయడం గమనార్హం. ఈయన మెదడు, వెన్నుపాము, పరిధీయ నరములు, కణితి తొలగింపు, పరిధీయ నరాల శస్త్రచికిత్స & ఎక్స్‌ట్రా-క్రానియల్ సెరెబ్రోవాస్కులర్ సిస్టమ్ వంటి చికిత్స చేయడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, ఆదివారం మాత్రం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు అందుబాటులో ఉంటారు.
ADDRESS:
S V R Neuro & Multi Speciality Hospitals,
40-1/1-14a, Sivananda Street,
M.G. Road, Labbipet,
Vijayawada – 10
Contact Number: +91 9542121234
ఇకపోతే Top 4 ప్లేస్‌లో Dr. Chevuturi Ramakrishna Rao ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ న్యూరాలజిస్ట్‌ల్లో ఈయన ఒకరు. Dr. Chevuturi Ramakrishna Raoకు వైద్యరంగంలో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. 13 సంవత్సరాలుగా న్యూరాలజీ స్పెష్టలిస్టుగా ఉన్నారు. ఈయన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో న్యూరాలజీ విభాగాధిపతిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. 1981లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, 1997లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి జనరల్ మెడిసిన్‌లో ఎండీ, 2005లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో న్యూరాలజీలో డీఎం కంప్లీట్ చేశారు. అనంతరం 2006లో విజయవాడలో Sri Satya Sai Neuro Centerను స్థాపించారు. Neurologist, General Physician, Geriatric Neurologistగా Dr. Chevuturi Ramakrishna Rao ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.500 తీసుకుంటారు.
Sri Satya Sai Neuro Centre
29-22-34,
Tadepalli vari street, Arundalpet,
Landmark: Near Mother and Child Hospital,
Vijayawada.
Contact Number: 96421 00369.
ఇకపోతే Top 3 ప్లేస్‌లో DR. ANIL KUMAR ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ న్యూరాలజిస్ట్‌లో ఈయన ఒకరు. DR. ANIL KUMARకు న్యూరాలజీ రంగంలో 4 సంవత్సరాల అనుభవం ఉంది. ఈయన 2015లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి న్యూరాలజీలో డీఎం చేశారు. DR. ANIL KUMAR ప్రధానంగా నిద్ర సంబంధిత సమస్యలు, మూర్ఛ, మైగ్రేన్, పార్కిన్సన్స్ వ్యాధి వంటి అన్ని రకాల నరాల సంబంధిత కేసులకు చికిత్స చేస్తున్నారు. దాంతో పాటు వివిధ రకాల తలనొప్పి, వెన్నెముక రుగ్మతలు, నిద్ర రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు ఉత్తమ సేవలను అందిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన సేవలు అందించేందుకు ANIL NEURO AND TRAUMA CENTREను ప్రారంభించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు, సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.400 తీసుకుంటారు.
Address:
Anil Neuro and Trauma Center
31-21- 25C,
Kakninagar, Chuttugunta,
Eluru Road, Landmark: near chuttugunta signal,
Vijayawada
Contact Number:0866 2435777, (+91) 98855 85777
ఇకపోతే Top 2 ప్లేస్‌లో DR. NAVEEN THOTA ఉన్నారు. విజయవాడలోని ఉత్తమ న్యూరాలజిస్ట్‌లో ఒకరు. ఈయనకు న్యూరాలజీ విభాగంలో మంచి అనుభవం ఉంది. ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఎండీ, తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ నుంచి న్యూరాలజీలో డీఎం కంప్లీట్ చేశారు. Bangloreలోని NIMHANSలో పార్కిన్సన్‌లో ఫెలో చేశారు. పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించి ఏపీలోనే మొట్టమొదటి ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’(డీబీఎస్) చేశారు. ఇప్పటివరకు వివిధ మూవ్‌మెంట్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న 50 మంది డీబీఎస్‌తో ప్రయోజనం పొందారు. ఇప్పటివరకు ఆయన చేసిన సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి.
Address:
Anu Institute of Neuro and Cardiac Sciences
# 3-20/14,
Main Road, Enikepadu,
Vijayawada-521108, AP,
Contact Number: 9603637733
ఇకపోతే Top 1 ప్లేస్‌లో DR. PRAMOD CHALASANI ఉన్నారు. విజయవాడలోని ప్రముఖ న్యూరాలజిస్ట్‌లో ఈయన ఒకరు. న్యూరో సమస్యలకు DR. PRAMOD CHALASANI వన్ స్టాప్ సొల్యూషన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో న్యూరాలజీ ప్రొఫెసర్‌గానూ పనిచేశారు. గత 15 సంవత్సరాలుగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో తన వైద్యసేవలు అందించారు. ప్రధానంగా హైపోక్సిక్ ఎన్సెఫలోపతి, స్ట్రోక్, తలనొప్పి, మూర్ఛ, మైగ్రేన్, సెరెబ్రో వాస్కులర్ వ్యాధులు, డీమిలినేటింగ్ వ్యాధులు, CNS ఇన్ఫెక్షన్, పార్కిన్సన్స్ డిసీజ్ & మల్టిపుల్ స్క్లెరోసిస్ ట్రీట్‌మెంట్ అందించడంలో మంచి నైపుణ్యం సాధించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు అందుబాటులో ఉన్నాయి.
Address:
Road no:5, Prakasham Road,
Suryaraopeta, Vijayawada,
Andhra Pradesh 520002
Contact Number:79951 08108