Home Best Of Five Top 5 Oncology Doctors in Visakhapatnam

Top 5 Oncology Doctors in Visakhapatnam

106
0
Best Cancer Specialists in Vizag | Top 5 Oncology Doctors in Visakhapatnam

ఒకప్పుడు దేశంలోని ప్రధాన నగరాలకే పరిమితమైన Cancer Specialistలు మన చుట్టూపక్కల ఉండే నగరాల్లోనూ అందుబాటులోకి వచ్చారు. అతితక్కువ ఖర్చుతోనే పేదలకు సైతం నాణ్యమైన వైద్యం చేస్తూ అందరికీ ఆరోగ్యం అందిస్తున్నారు. క్యాన్సర్‌కు చికిత్స అందించే హాస్పిటల్స్ చాలా ఉన్నప్పటికీ వైజాగ్ నగరంలోని Top 5 Oncologist (Cancer Specialist) Doctors ఎవరు..? వారిని ఏలా సంప్రదించాలి..? తదితర వివరాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ వీడియోను చూసి వైజాగ్ నగరంలోని Top 5 Oncologist (Cancer Specialist) Doctorsను సంప్రదించి క్యాన్సర్ మహమ్మారికి చెక్ పెట్టేసేయండి.

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Dr. Raghu Vamsi N ఉన్నారు. వైజాగ్‌లోని ఉత్తమ Oncologistలో ఒకరు. గత 11 సంవత్సరాలుగా వైద్యరంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. Dr. Raghu Vamsi N 2006 సంవత్సరంలో వినాయక మిషన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఎంబీబీఎస్, 2010లో చెన్నైలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీలో ఎంఎస్, 2014లో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ చేశారు. సుదీర్ఘకాలం పాటు పలు ప్రముఖ ఇనిస్టిట్యూట్‌లో ఆంకాలజీ ప్రొఫెసర్‌గా, వైద్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం  HCG Cancer Hospitalలో సర్జికల్ ఆంకాలజిస్ట్‌గా పనిచేశారు. Bloogd cancer treatment, liver cancer, breast cancer, lung cancer, breast cancer surgery, lung cancer surgery, Oral cancer surgery చికిత్స చేయడంలో స్పెషలిస్టుగా గుర్తింపు పొందారు. Dr. Raghu Vamsi N కన్సల్టేషన్ ఫీజుగా రూ.630 తీసుకుంటారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

Address:
HCG pinnacle cancer center,
Pinnacle Hospital Compound,
APIIC Health City, Arilova,
Chinnagadili, Andhra Pradesh 530040
Contact Number:0891 668 2700

ఇకపోతే Top 4 ప్లేస్‌లో Dr. Karthik Chandra Vallam ఉన్నారు. ఈయన వైజాగ్‌లోని ఉత్తమ ఆంకాలజిస్ట్‌ల్లో ఒకరు. గత 10 సంవత్సరాలుగా వైద్య రంగంలో తన సేవలను అందిస్తున్నారు. ఆంకాలజీ రంగంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనే First Robotic surgeonగా ఘనత సాధించారు. 2006 సంవత్సరంలో Dr. Karthik Chandra Vallam జిప్‌మర్ నుంచి ఎంబీబీఎస్, 2010లో మద్రాస్ డెంటల్ కాలేజీ నుంచి జనరల్ సర్జరీలో ఎంఎస్, 2014లో ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ నుంచి సర్జికల్ ఆంకాలజీలో ఎంసీహెచ్ పూర్తి చేశారు. ఈయన అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియాలో, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీలో సభ్యులుగా ఉన్నారు. 2016లో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏసియన్ క్లినికల్ ఆంకాలజీ సమ్మిట్’లో బెస్ట్ పోస్టర్ అవార్డును దక్కించుకున్నారు. కన్సల్టేషన్ ఫీజుగా పేషంట్ల నుంచి రూ.400 తీసుకుంటారు.

Address:
apollo cancer hospital,
Health City,
Arilova, Chinagadila,
Visakhapatnam,
Andhra Pradesh.
Contact Number: 9553860804

ఇకపోతే Top 3 ప్లేస్‌లో Dr J Kishore ఉన్నారు. ఈయన వైజాగ్‌లోని ఉత్తమ ఆంకాలజిస్ట్‌లో ఒకరు. ఈ రంగంలో 21 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం  ఈయన Dr J Kishore’s Clinicలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
Dr J Kishore 1985లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, 1994లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి జనరల్ సర్జరీలో ఎంఎస్ పూర్తి చేశారు. Endocrine Surgery,Surgical Oncology, Laparoscopic Surgery,Colorectal Surgery and Bariatric Surgeries చేయడంలో Dr J Kishore ప్రత్యేక గుర్తింపు పొందారు. Dr J Kishore ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీలో సభ్యులుగా ఉన్నారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉంటారు. కన్సల్టేషన్ ఫీజుగా రూ.300 ఛార్జీ తీసుకుంటారు.

Address:
Dr. J Kishore’s Clinic
Room No.212, Srinivasa Chambers,
Landmark: Opp KGH Out Gate.
Maharani Peta, Visakhapatnam,
Contact Number: 98485 29091, 77021 62434

ఇకపోతే Top 2 ప్లేస్‌లో Dr Ravi Shankar Bellala ఉన్నారు. ఈయన వైజాగ్‌లోని ఉత్తమ ఆంకాలజిస్ట్‌లో ఒకరు. వైద్య రంగంలో గత 20 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. Dr Ravi Shankar Bellala సుదీర్ఘ కాలం పాటు Clinical Research, Teachingలో పనిచేస్తున్నారు. ఈయన Head &Neck Oncology and Breast & Gyneac Oncologyలో మంచి నిపుణుడిగా పేరు సంపాదించారు. Dr Ravi Shankar Bellala 1992లో శ్రీ దేవరాజు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, 1997లో వెల్లూరులోని సీఎంసీ కాలేజీలో ఎండీ, 2001లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి డీఎన్‌బీ, 2007లో హాంగ్‌కాంగ్‌లో క్లినికల్ ఆంకాలజీలో ఎఫ్ఆర్‌సీఆర్, 2010లో ఆంకాలజీ క్లినికల్ ట్రయల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారు. 2013లో యూకేలో మెడికల్ ఆంకాలజీలో ఎంఆర్‌సీపీ, 2016లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేశారు. Dr Ravi Shankar Bellalaలో కాకినాడలోని క్రిస్టియన్ క్యాన్సర్ సెంటర్‌లో రేడియేషన్ ఆంకాలజిస్ట్, విశాఖపట్నంలోని లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో, విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా, క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

Address:
Omega Cancer Hospitals,
Chinna Gadhili, Hanumanthavaka,
Visakhapatnam, Andhra Pradesh 530040.
Contact Number: 9849123256.

ఇకపోతే Top 1 ప్లేస్‌లో Dr Murali Krishna Voonna ఉన్నారు. ఈయన వైజాగ్‌లోని ఉత్తమ ఆంకాలజిస్ట్‌లో ఒకరు. గత వైద్య రంగంలో 24 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. Dr Murali Krishna Voonna సుదీర్ఘ కాలంగా Surgical Oncologyగా పనిచేస్తున్నారు. ఈయన ఇప్పటివరకు 12వేలకు పైగా complex cancer surgeries చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి జనరల్ సర్జరీలో ఎంఎస్, చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నుంచి సర్జికల్ ఆంకాలజీ ఎంసీహెచ్, ఎంబీఏలో హాస్పిటాలిటీ ఆడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు. న్యూక్లియర్ మెడిసిన్‌కు సంబంధించి ‘The Nuclear Physicians of India’ అవార్డును దక్కించుకున్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌లో 3 గోల్డ్ పతకాలు సొంతం చేసుకున్నారు. విశాఖపట్నంలోని Mahatma Gandhi Cancer Hospital and Research Instituteకు Chief Promoterగా పని చేశారు.

Address:
C-6, Doctors & Doctors Plaza, Rednam Gardens,
Opposite KGH O.P Gate, Rednam Gardens,
Visakhapatnam – 530 002
Contact Number: 089127 06876

Leave your vote

More

Previous articleఅంబటి రాంబాబు బయోగ్రఫీ | Ambati Rambabu Biography
Next articleTop 10 Hospitals in Chennai | చెన్నైలో ఉన్న టాప్ 10 హాస్పిటల్స్ ఇవే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here