Top International Schools in Hyderabad

135
0
Top International Schools in Hyderabad | Best International in Hyderabad 2021
Top International Schools in Hyderabad | Best International in Hyderabad 2021

హైదరాబాద్ నగరంలోని famous schools ఇవే..

ప్రస్తుత సమాజంలో విద్యదే అగ్రభాగం. పిల్లలకు మంచి విద్యను అందిస్తే.. వారికి కోట్ల రూపాయలు సంపాదించిపెట్టినట్టే. అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బెస్ట్ ఎడ్యుకేషన్ అందించేందుకు తహతహలాడుతుంటారు. అయితే ఏ స్కూల్‌లో తమ పిల్లలను చదివించాలనే విషయంపై తల్లిదండ్రులు విపరీతంగా అన్వేషణ చేస్తుంటారు. ఏది బెటర్ స్కూల్ అంటూ తమకు తెలిసిన వారినల్లా అడుగుతుంటారు. తమ పిల్లలను నర్సరీలో నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫేమస్ స్కూల్‌లో చదివించేందుకు భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడబోరు. అయితే హైదరాబాద్ నగరంలోని ఫేమస్ స్కూల్స్ ఏమున్నాయి..? ఎక్కడ ఉన్నాయి..? వాటి ప్రత్యేకతలేంటి..? ఆ ఫేమస్ స్కూల్స్‌లో చేరడం ఏలా..? తదితర వివరాలతో ప్రత్యేకంగా ఈ వీడియోను రూపొందించాము. ఈ వీడియోను పూర్తిగా చూసి హైదరాబాద్‌లోని famous schoolsలో మీ పిల్లలను జాయిన్ చేసి వారికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వండి.

ఇకపోతే Top 6 ప్లేస్‌లో Delhi School Of Excellence – Banjara Hills ఉంది. హైదరాబాద్ నగరంలోని అత్యుత్తమ స్కూల్స్‌లో ఇది ఒకటి. Delhi School Of Excellenceకు నగరంలో మూడు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ స్కూల్‌లో విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు భవిష్యత్తులో అన్ని రంగాల్లోని ఒడిదుడుకులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కావాల్సిన వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తారు. ఇది సీబీఎస్ఈ న్యూఢిల్లీకి అనుబంధంగా పనిచేస్తోంది. రెగ్యులర్ సిలబస్ నేర్చుకోవడమే కాకుండా పిల్లలు తమ ఆసక్తి, ప్రతిభ ఆధారంగా ఇతర ప్రోగ్సామ్స్‌లో పార్టిసిపేట్ అయ్యేలా చూస్తారు. స్పోర్ట్స్, మ్యూజిక్‌ వైపు పిల్లలను ప్రోత్సహిస్తారు. పాఠ్యాంశాల బోధనే కాకుండా విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా మారేలా విలువలను బోధిస్తారు. ప్రతి తరగతి గదిలో 32 మంది విద్యార్థులు మించకుండా చూస్తారు. మొత్తంగా Delhi School Of Excellence – Banjara Hillsలో 2700 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నాం 3.15 గంటల వరకు పనిచేస్తుంది.

Adress:
Delhi School of Excellence, Banjara Hills
8-2-404/1,
Rd Number 6,
Opposite Street GVk, Green Valley,
Banjara Hills, Hyderabad,
Telangana 500034
Contact Number: 92480 72019

ఇకపోతే Top 5 ప్లేస్‌లో Meridian School ఉంది. హైదరాబాద్‌లోని ఉత్తమ పాఠశాలల్లో ఇది ఒకటి. మెరిడియన్ అనేది ఒక న్యూ జనరేషన్ ఎడ్యుకేషనల్ గ్రూప్. విద్యార్థుల ఉత్తమమైన కెరీర్ కోసం మెరిడియన్ స్కూల్‌ను ఉత్తమ పాఠశాలగా ఎంచుకుంటున్నారు. Meridian Schoolను 1995లో బీఎస్ నీలకంఠ, బుట్టా రేణుక మెరిడియన్ స్కూల్ బంజారాహిల్స్ క్యాంపస్‌ను స్థాపించారు. ఈ స్కూల్‌లో సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 1500 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యారంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందుకుంటూ విద్యార్థులను ఆధునాతన పద్ధతుల్లో విద్యను బోధిస్తున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు స్పోర్ట్స్, మ్యూజిక్, ఇతర కళల్లో ప్రావీణ్యం పొందేలా శిక్షణను ఇస్తారు. Meridian Schoolలో ఇప్పటివరకు చదువుకున్న విద్యార్థుల్లో అధికశాతం మంది ఐఐటీ, ఎన్ఐటీ, జిప్‌మర్ వంటి ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్లలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. 2006లో మాదాపూర్, 2008లో కూకట్ పల్లి, 2020లో ఉప్పల్‌లో Meridian School బ్రాంచ్‌లను ప్రారంభించడం గమనార్హం.

Adress:
MERIDIAN SCHOOL, Banjara Hills
8-2-541, Road No 7,
Banjara Hills,
Hyderabad-500034, TELANGANA.
Contact Number: 8096918857, 9948508222.

ఇకపోతే Top 4 ప్లేస్‌లో Oakridge International School ఉంది. ప్రపంచంలోనే Oakridge International School ప్రముఖ లీడింగ్ సంస్థ. గత దశాబ్ద కాలంలో Oakridge International School అత్యుత్తమ అంతర్జాతీయ పాఠశాలల్లో ఒకటిగా నిలిచింది. ఇది హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, మొహాలీలోనూ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. ఈ స్కూల్‌ ఫ్రెంచ్, స్పానిష్, హిందీ, తెలుగు లాంగ్వేజ్‌లలో ఆఫర్ చేస్తోంది. Oakridge International Schoolలో ప్రతి తరగతి గదికి 20 మందికి పరిమితం. ఇందులో ఐబీ, సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ఇతర ప్రోగ్రామ్స్‌లోనూ పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తారు. విద్యార్థులు నిత్యం నేర్చుకునేలా ఓక్రిడ్జ్ నిరంతరం ప్రోత్సహిస్తోంది.

Adress:
Khajaguda,
Nanakramguda Road,
Cyberabad,
Hyderabad – 500008.
Telangana,
Contact Number: 9133337711 / 22

ఇకపోతే Top 3 ప్లేస్‌లో International School Of Hyderabad ఉంది. 1981లో International School Of Hyderabad అండ్ International Crops Research Institute for the Semi-Arid Tropics (ICRISAT) సంయుక్త ఆధ్వర్యంలో స్థాపించారు. ఇది పూర్తిగా లాభాపేక్ష లేని సంస్థ. ఈ స్కూల్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందిన మొదటి పాఠశాలగా గుర్తింపు పొందింది. ఇది పూర్తిగా కో-ఎడ్యుకేషన్ డే స్కూల్. International School Of Hyderabadలో స్థానిక విద్యార్థులతో పాటు 20 దేశాల్లోని 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో దాదాపు 34 శాతానికి పైగా సిబ్బంది విదేశాల నుంచి వచ్చిన వారే. హైదరాబాద్‌లోని ఇతర అంతర్జాతీయ స్కూల్స్‌తో పోలిస్తే International School Of Hyderabadది ప్రత్యేక స్థానం. ఇందులో ఒక్కో తరగతి గదిలో 15 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఈ స్కూల్‌లో ప్రాథమిక విద్య స్థాయి నుంచే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చదివే దిశగా అడుగులు వేస్తుంటారు. ఇప్పటికే ఇందులో చదివిన ఎంతోమంది విద్యార్థులు కెనడాలోని విశ్వవిద్యాలయాలతో పాటు యునైటెడ్ స్టేట్స్‌లోని యూనివర్సిటీలకు వెళుతున్నారు.

Adress:
The International School of Hyderabad c/o ICRISAT,
Patancheru,
Hyderabad,
Telangana- 502324.
Contact Number:8455683865, 8455683872

ఇకపోతే Top 2 ప్లేస్‌లో Sreenidhi International School ఉంది. హైదరాబాద్‌లోని అత్యుత్తమ అంతర్జాతీయ స్కూల్స్‌లో Sreenidhi International School ఒకటి. దాదాపు 60 ఎకరాల్లో ఈ స్కూల్ విస్తరించి ఉంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో దేశంలోని పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటి నిలిచింది. ఈ స్కూల్‌లో ఐబీ, ఐసీఎస్ఈ, ఐసీఎస్ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా పాఠ్యాంశాలను బోధించడంతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తారు. స్పోర్ట్స్‌తో పాటు పాఠ్యాంశేతర కార్యక్రమాల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఈ స్కూల్‌లో బాలబాలికలకు హాస్టల్ వసతి వేర్వేరుగా కల్పిస్తారు. Sreenidhi International Schoolలో తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ స్మార్ట్ బోర్డులను ఏర్పాటుచేశారు. అధునాతన లైబ్రరీతో పాటు పలు సబ్జెక్టుల కోసం ప్రత్యేకంగా ఆధునిక ల్యాబ్‌లు ఉన్నాయి. Sreenidhi International Schoolను నగరం నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ స్కూల్ విద్యా రంగంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది.

Address:
Near Appa Junction,
Aziznagar, Moinabad,
Hyderabad – 500075.
Contact Number: 099122 44409

ఇకపోతే Top 1 ప్లేస్‌లో The Aga Khan Academy ఉంది. ఇది హైదరాబాద్‌లోని అంతర్జాతీయ స్కూల్స్‌లో ఒకటి. ఇది శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలో దాదాపు 100 ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఈ అకాడమీ పూర్తిగా లాభాపేక్ష లేని సంస్థగా చెప్పొచ్చు. ఇందులో అడ్మిషన్ విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లించే ఫీజుల ఆధారంగా కాకుండా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఇస్తారు. The Aga Khan Academyలో అత్యాధునిక సౌకర్యాలతో విద్యార్థులకు చదువును బోధిస్తున్నారు. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి ఉపాధ్యాయులతో పాటు సుదీర్ఘ అనుభవం ఉన్నవారితో బోధన ఉంటుంది. పిల్లల్లో విద్యా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం, విశ్లేషణాత్మక అధ్యయనం చేయించడం, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. The Aga Khan Academyని 2006లో ప్రారంభించారు. ఇక్కడ స్విమ్మింగ్ ఫూల్‌తో పాటు స్పోర్ట్స్ కోసం బాస్కెట్ బాల్, టెన్నిస్, క్రికెట్ గ్రౌండ్‌తో పాటు అథ్లెటిక్ ట్రాక్ అందుబాటులో ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే విద్యార్థుల కోసం మ్యూజిక్, డ్యాన్స్, ఫైన్ ఆర్ట్స్  తదితరాలు ఉన్నాయి.

Address:
Survey No: 1/1,
Hardware Park,
Maheshwaram Mandal,
Hyderabad, Telangana 500005
Contact Number: +91-40-66291300

Leave your vote

More

Previous articleTop 5 Cardiologists in Vijayawada
Next articleTop 10 Resorts In Hyderabad | హైదరాబాద్ లోని బెస్ట్ రిసార్ట్స్ ఇవే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here